జీవిత భరోసా పొందియున్న వ్యక్తి మరణం సంభవించిన పక్షములో, పాలసీ అమలులో ఉన్నంత కాలం లేదా పూర్తిగా చెల్లించబడి ఉంటే, నామినీ(ల)కు ఈ క్రింది మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. పేర్కొనబడిన మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దవుతుంది.
నామినీ (లు) వీటి యొక్క అధిక మొత్తమును అందుకుంటారు:
a. మరణంపై భరోసా సొమ్ము (ఎస్ఎడి) ప్లస్ కూడగట్టుకున్న హామీతో కూడిన జోడింపులు (ఏవైనా ఉంటే, మరణించిన తేదీ వరకూ) లేదా
b. మరణించిన తేదీ వరకు చెల్లించబడిన మొత్తం ప్రీమియముల 105%.
ఇక్కడ మరణంపై భరోసా సొమ్ము (ఎస్ఎడి) వార్షికం చేయబడిన ప్రీమియం కంటే X రెట్లు ఎక్కువగా ఉంటుంది లేదా మరణంపై చెల్లించాల్సియున్న ఒక సంపూర్ణ మొత్తం (ప్రాథమిక భరోసా సొమ్ము) గా ఉంటుంది. X అనేది 3 నుండి 45 సంవత్సరాల వరకు 10 మరియు 46 మరియు ఆపై సంవత్సరాలకు 7 గా ఉంటుంది.
విభాగం 6 లో చెప్పబడినట్లుగా మీరు వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఓపి) రైడర్ కొరకు కూడా ఎంచుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు దయచేసి రైడర్ బ్రోచరును చదవండి.
పాలసీ యొక్క అవధి సందర్భంగా జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణం సంభవించిన సంఘటనలో, నామినీ (ల) కు చెల్లించబడే మరణ ప్రయోజనం ఒక ఏకమొత్తం రూపములో నైనా ఉండవచ్చు లేదా తర్వాతి 5 సంవత్సరాల పాటు నెలసరి ఆదాయముగానైనా ఉండవచ్చు.
గమనిక: మరణ ప్రయోజనము పాలసీ కాలవ్యవధి సందర్భంగా ఏ సమయంలో నైనా / జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన మీదట గానీ ఒక టోకు మొత్తముగా గానీ లేదా పాలసీదారు/నామినీ (ల) చే ఎంచుకోబడిన విధంగా 5 సంవత్సరాల వ్యవధి పాటుగా నెలసరి కంతులలో గానీ చెల్లించబడుతుంది. వాయిదా కంతులలో మరణ ప్రయోజనం చెల్లింపు విషయంలో; మరణ ప్రయోజనాన్ని యాన్యువిటీ కారకాంశముచే గుణించడం ద్వారా నెలసరి వాయిదా మొత్తం లెక్కించబడుతుంది, ఇక్కడ మరణించిన తేదీ నాటికి ఉన్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఆధారంగా యాన్యువిటీ కారకాంశం వస్తుంది. ఒకసారి వాయిదా చెల్లింపు మొదలయిందంటే, వాయిదా కాలవ్యవధి అంతటా ఈ చెల్లింపు అదే మట్టములోనే నిలిచి ఉంటుంది. ప్రస్తుతమున్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆఖరున జరిగే సమీక్షకు లోబడి ఉంటుంది.
పైన చెప్పబడిన వాటికి అదనంగా, మొదటి పాలసీ సంవత్సరంలో ప్రమాద సంఘటన కారణంగా మరణించిన పక్షములో, మరణంపై భరోసా సొమ్ము (ఎస్ఎడి)కు సమానమైన మొత్తం చెల్లించబడుతుంది.
ఒకవేళ పాలసీని పిఓఎస్ ఛానెల్ ద్వారా తీసుకొని ఉన్నట్లయితే, రిస్కును అంగీకరించిన తేదీ నుండి మొదటి 90 రోజుల వరకు వేచి ఉండే వ్యవధి ఉంటుంది.
పిఓఎస్ ఛానెల్ ద్వారా తీసుకొని ఉన్న పాలసీ కొరకు మరణ ప్రయోజనం:
ఒకవేళ మరణం సంభవిస్తే (ప్రమాద సంఘటన కాకుండా ఇతరత్రా):
i) వేచి ఉండే వ్యవధి సందర్భంగా- చెల్లించిన ప్రీమియం యొక్క 100%
ii) వేచి ఉండే వ్యవధి ముగిసిపోయిన తర్వాత- మరణంపై భరోసా సొమ్ము
ప్రమాద సంఘటన కారణంగా మరణించిన సందర్భంలో లేదా పాలసీ పునరుద్ధరణ విషయంలో వేచి ఉండే వ్యవధి వర్తించదు.
అంత్యక్రియల కవర్: మరణంపై భరోసా సొమ్ము యొక్క 10% లేదా రు. 25,000 (ఏది తక్కువైతే అది) పెంచబడుతుంది మరియు జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణ సమాచారం తెలియజేయబడిన మీదట అడ్వాన్సుగా చెల్లించబడుతుంది. ఇది అదనపు ప్రయోజనము కాదు. అంత్యక్రియల వర్తింపుగా చెల్లించబడిన మొత్తం, చెల్లించాల్సిన మరణ ప్రయోజనం మొత్తం నుండి తగ్గించుకోబడుతుంది.