₹1.5 కోటి భరోసా సొమ్ముతో అవధి బీమా ప్లాన్ అంటే ఏమిటి?
మీ అవధి బీమా కోసం సరియైన భరోసా సొమ్మును ఎంచుకోవడం అనేది మీ జీవిత బీమా కొనుగోలు ప్రయాణంలో అత్యంత కీలకమైన దశల్లో ఒకటి అవుతుంది. ఇది మీ ప్రియమైనవారి కోసం మీరు వదిలివెళ్ళే మొత్తము అవుతుంది, కాబట్టి వారి ఆర్థిక ఒత్తిడి తగ్గిపోవచ్చు. ₹1.5 కోట్ల భరోసా సొమ్ము అవధి బీమా ప్లాన్ ₹1.5 కోట్ల విలువైన లైఫ్ కవరేజీతో వస్తుంది. ఇది మీ నామినీ మరణ ప్రయోజనము క్లెయిము చేయగల ముఖ్యమైన విలువగా ఉంటుంది.
మీరు ₹1.5 కోట్ల భరోసా సొమ్ము ప్లాన్‌ని ఎంచుకునే ముందుగా, అవధి బీమా అంటే ఏమిటో మరియు అది మీ ఆర్థిక ప్రణాళికకు ఎలా సరిపోతుందో మీకు బాగా తెలుసుకొని ఉన్నట్లుగా నిర్ధారించుకోండి. అలాగే, మీ కోసం ₹1.5 కోట్లు సరియైన భరోసా సొమ్ము అవుతుందా లేదా అని కూడా పరిశీలించుకోండి.
₹1.5 కోటి భరోసా సొమ్ముతో అవధి బీమా ఎలా పనిచేస్తుంది?
భరోసా సొమ్ముతో సంబంధం లేకుండా, దాదాపుగా అన్ని అవధి బీమా ప్లాన్లు ఇదే తీరులో పని చేస్తాయి. అత్యధిక అవధి బీమా ప్లాన్లు నెరవేర్చే ప్రాథమిక లక్ష్యం, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ నామినీ లేదా లబ్దిదారుకు ఆర్థిక మద్దతుకు ఒక వనరుగా ఉండటం అయి ఉంటుంది.
ఉదాహరణకు, మీరు లేనప్పుడు మీ బిడ్డ భవిష్యత్తు చదువుకు భద్రత కల్పించాలని మీరు చూస్తున్నట్లయితే, ₹1.5 కోట్ల అవధి బీమా హామీ సొమ్ము అందుకు గణనీయమైన సహాయంగా ఉండగలదు.
మీరు కొనుగోలు చేయడానికి ముందుగా పరిగణించవలసిన కొన్ని అంశాలలో సరైన భరోసా సొమ్మును ఎంచుకోవడం అనేది ఒకటి అయి ఉంటుంది. మీరు ₹1.5 కోట్ల అవధి బీమా కవర్ పైన స్థిరపడిన తర్వాత, కొనుగోలు చేయడానికి ముందుగా ప్రీమియం మొత్తము, టర్మ్ కాలావధి, రైడర్ చేరిక మరియు మరిన్ని అటువంటి ఇతర అంశాలను పరిగణించండి.
ప్రీమియం ఖర్చు మీ బడ్జెట్‌కు మించి లేకుండునట్లుగా నిర్ధారించుకోవడానికి గాను, అవధి బీమా కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి. అది మీ వ్యక్తిగత వివరాలు, ప్లాన్ ఆవశ్యకతలు మరియు ఎంచుకున్న అనుకూలీకరణల ఆధారంగా అంచనాలను పొందడానికి మీకు వీలు కలిగిస్తుంది.
ఒకసారి మీరు ప్లాన్ కొనుగోలు చేశారంటే, మీ నామినీ తనకు ఏ ప్లాన్ అవసరమో మరియు వారు దానిని ఎలా క్లెయిమ్ చేయవచ్చునో అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు రైడర్లను ఎంచుకుని ఉంటే, వారు దానిని అర్థం చేసుకుని ఉన్నట్లుగా నిర్ధారించుకోండి.
ఒక కొత్త అవధి ప్లాన్ కొనాలని చూస్తున్నారా? ఇండియాఫస్ట్ లైఫ్ అవధి బీమా ప్లానుల శ్రేణి నుండి ఎంచుకోండి. వాటిని ఆన్లైన్ ఇక్కడ కొనండి.
₹1.5 కోటి అవధి బీమా ప్లానులను ఎవరు కొనుగోలు చేయాలి?
అవధి జీవిత బీమా ప్లానులు దాదాపు ప్రతి వ్యక్తికీ మరియు ప్రత్యేకించి ఆధారపడి ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటాయని నిరూపితం కాగలుగుతాయి. ఈ క్రింది రకం వ్యక్తుల కోసం ₹1.5 కోట్ల అవధి బీమా ప్లానులు ఉపయోగకరంగా ఉండవచ్చు:
ఒకవేళ ఈ మొత్తానికి దగ్గరగా ఉన్న విలువతో మీకు గనక బాధ్యతలు ఉంటే: మీపై సంపూర్ణంగా ఆర్థికంగా ఆధారపడిన అనేక మంది కుటుంబ సభ్యులు మీకు ఉండకపోవచ్చు. అయినప్పటికీ, మీకు అకాల మరణం సంభవించిన సందర్భంలో వారిపై భారం పడకూడదని మీరు అనుకునే ఒక ఇంటి లోన్ మీకు ఉండవచ్చు.
ఒకవేళ మీకు నిర్దిష్ట అవసరాలతో ఆధారపడిన వ్యక్తులు ఉంటే: మీ కుటుంబంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యుడు లేదా ఉన్నత విద్యను అభ్యసించే ఒక చిన్నారి ఉంటే.
ఒకవేళ మీరు అధిక-శ్రమతో కూడిన ఉద్యోగంలో పనిచేస్తూ ఉండి, అయినా గణనీయమైన ఆదాయం వస్తూ ఉంటే: ఒకవేళ మీరు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటే, మీరు వెళ్లిపోయిన తర్వాత మీ కుటుంబం తమ జీవనశైలిని నిర్వహించుకునే లైఫ్ కవర్ని కలిగి ఉండటానికి ఇది సహాయపడవచ్చు.
ఒకవేళ మీరు ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఖర్చుల గురించి ఆందోళన చెందుతూ ఉంటే: రాబోయే సంవత్సరాల్లో మీ కుటుంబం యొక్క అవసరాలు పెరుగుతాయని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే, ₹1.5 కోట్ల అవధి బీమా పాలసీ భవిష్యత్తు ప్రణాళికలో మీకు సహాయపడగలుగుతుంది.
₹1.5 కోట్ల అవధి బీమా ప్లానుల యొక్క కొన్ని సంభావ్య ప్రయోజనాలు ఏవేవి?
₹1.5 కోట్ల అవధి బీమా ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల పాలసీదారులు మరియు వారి కుటుంబాలకు అసంఖ్యాకమైన ప్రయోజనాలు లభిస్తాయి. కీలకమైన ప్రయోజనాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి:
ఆర్థిక భద్రత: ₹1.5 కోట్ల భరోసా సొమ్ముతో ఒక అవధి బీమా ప్లాన్ మీ ప్రియమైన వారికి గణనీయమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది.
స్థోమతకు తగిన ప్రీమియములు: ఇదే విధమైన కవరేజీని అందించే ఇతర జీవిత బీమా ఉత్పాదనలతో పోలిస్తే ₹1.5 కోట్ల పాలసీకి ప్రీమియంలు సాధారణంగా తక్కువగానే ఉంటాయి.
పన్ను ప్రయోజనాలు: చెల్లించిన ప్రీమియంలు మీ పన్ను చెల్లించదగిన పరిధిలోనికి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తూ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C క్రింద తగ్గింపులకు అర్హమైనవిగా ఉంటాయి. అదనంగా, లబ్ధిదారులు అందుకునే మరణ ప్రయోజనం సెక్షన్ 10(10D) క్రింద పన్ను నుండి మినహాయించబడింది.
అనుకూలత (ఫ్లెక్సిబిలిటీ): అనేక అవధి బీమా ప్లాన్లు పాలసీ అవధి మరియు ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను ఎంచుకోవడంలో వెసులుబాటును అందిస్తాయి.
రైడర్ ఆప్షన్లు: వివిధ ఆకస్మిక పరిస్థితులకు సమగ్ర కవరేజీని అందిస్తూ, మీ ₹1.5 కోట్ల అవధి బీమా పాలసీకి నామమాత్రపు ధరతో రైడర్లను జోడించుకోవచ్చు.
సరియైన 1.5 కోటి అవధి బీమా ప్లానును ఎంచుకోవడం ఎలా?
మీరు ఎంచుకుంటున్న ప్లాన్ మీకు సరైనదే అని నిర్ధారించుకోవడానికి గాను ఈ క్రింది అంశాలను పరిగణించండి.
సరియైన భరోసా సొమ్మును ఎంచుకోండి
₹1.5 కోట్లు మీకు సరియైన భరోసా సొమ్ము అని నిర్ధారించుకోవడానికై మీరు అవధి బీమా కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. సరియైన భరోసా సొమ్ము మొత్తాన్ని గుర్తించడానికి మీ వార్షిక ఆదాయంతో పాటు మీ బాధ్యతలను కూడా పరిగణన లోనికి తీసుకోవడం చాలా ముఖ్యం అవుతుంది.
క్లెయిము పరిష్కార నిష్పత్తి
సరియైన బీమా ప్రదాతను ఎంచుకోవడం అనేది కనీసం సరియైన పాలసీని మరియు సరియైన బీమా సొమ్మును ఎంచుకోవడమంత ముఖ్యమైనది. క్లెయిము పరిష్కార నిష్పత్తి బీమాదారు యొక్క క్లెయిము పరిష్కరణ పోకడపై గ్య్రాహ్యతలను అందిస్తుంది. పరిగణించడానికి అది సహాయకారక పారామితి కాగలదు.
రైడర్ల లభ్యత మరియు అవి ఖర్చుకు ఎంత అదనంగా జోడిస్తాయో పరిశీలించుకోండి. అవి మీ బడ్జెట్‌కు సరిపోతుంటే మరియు మీ అవసరాలకు సరిపోతుంటే వాటిని జోడించుకోండి.
మా నుండి ₹1.5 కోటి అవధి బీమా ప్లాన్ ఎందుకు కొనాలి?
₹1.5 కోటి అవధి బీమా కవరేజీ కోసం ఇండియాఫస్ట్ లైఫ్ బీమా సరియైన ఎంపిక అవుతుంది. మేము ఏమి అందిస్తామో ఇక్కడ ఉంది:
ఎంచుకోవడానికి గాను విస్తృత శ్రేణి ప్లానులు
సహాయకరమైన కస్టమర్ సర్వీస్ బృందము
అంతరాయం-లేని క్లెయిము పరిష్కార ప్రక్రియ
పాలసీ నిర్ణయాలతో మీకు సహాయపడే నిపుణుడి సలహా
98.04% క్లెయిము పరిష్కార నిష్పత్తి
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ₹1.5 కోటి అవధి బీమా ప్లాన్ కొనడం ఎలా?
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి అవధి బీమా ప్లానులను సౌకర్యవంతంగా ఆన్లైన్ కొనుగోలు చేయవచ్చు.
మొదలుపెట్టడానికై ఈ దశలను పాటించండి:
మీ అవసరాలకు సరిపోయే ప్లాన్‌ని ఎంచుకోండి మరియు కొనుగోలు పేజీకి కొనసాగండి.
ప్లాన్ వివరాలను ఎంటర్ చేయండి మరి ఆ మీదట మీ వ్యక్తిగత సమాచారమును అందజేయండి.
ప్లాన్ వివరాలను సమీక్షించుకొని నిర్ధారించండి.
కావలసిన పత్రాలను సమర్పించండి మరియు ప్రీమియం చెల్లించండి.
మీరు పాలసీ డాక్యుమెంటును అందుకుంటారు.
ప్రత్యామ్నాయంగా, కొనుగోలు ప్రక్రియ సందర్భంగా మీ బీమా ఏజెంటును లేదా ఇండియాఫస్ట్ లైఫ్ సలహాదారును సంప్రదించండి.
సరియైన జీవిత బీమా ప్లాన్ ఎంచుకోవడంలో సహాయం కావాలా? మాకు ఇప్పుడే 8828840199 పై కాల్ చేయండి లేదా ఇక్కడ ఒక కాల్ బ్యాక్ కోరండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
₹ 1.5 కోటి అవధి బీమాను కొనుగోలు చేయడానికి అర్హత కోసం కనీస ఆదాయం ఎంత అవసరమై ఉంటుంది?
ఎంచుకున్న భరోసా సొమ్ము కోసం ఎటువంటి కఠినమైన కనీస ఆదాయ ఆవశ్యకత ఏదీ లేదు. భరోసా సొమ్ముకు ఆమోదము పూచీకత్తు బృందం యొక్క ఆమోదానికి లోబడి ఉంటుంది. పాలసీ కొనుగోలుతో ఎలాంటి సమస్యనైనా నివారించడానికి గాను, ఎంచుకున్న భరోసా సొమ్ము కోసం మీరు ప్రీమియంను భరించగలరని నిర్ధారించుకోండి.
₹1.5 కోటి అవధి ప్లాన్ కొరకు ఎవరు అర్హులు అవుతారు?
మీరు సురక్షితపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న భరోసా సొమ్ముతో సంబంధం లేకుండా, అవధి జీవిత బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి గాను మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. మీరు ప్లాన్ పొందగలిగి ఉండేలా నిర్ధారించుకోవడానికి గాను మీరు కోరుకునే అవధి పాలసీ యొక్క అర్హతా ప్రాతిపదికలను పరిశీలించుకోండి.
ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి పాలసీ కాలావధి అంతటా జీవించి ఉంటే ఏమి జరుగుతుంది?
ఒకవేళ మీరు ఒక స్థాయి అవధి బీమా పాలసీని ఎంచుకుని, పాలసీ కాల వ్యవధి పాటు జీవించి ఉంటే, క్లెయిమ్ చేయడానికి గాను అవధి బీమా యొక్క మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏవీ ఉండవు. అయినప్పటికీ, మీ ప్లాన్‌కి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటే, మీరు ప్లాన్ మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం రిటర్న్‌ను క్లెయిము చేసుకోవచ్చు.
₹1.5 కోటి అవధి బీమా పాలసీ కొరకు ప్రీమియం మొత్తము ఎంత ఉంటుంది?
ఒక ప్లాన్ కోసం ప్రీమియం మొత్తం మీ వయస్సు మరియు లింగం, అలాగే ఎంచుకున్న భరోసా సొమ్ము వంటి వివిధ అంశాల పైన ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా, ఎంచుకున్న ప్లాన్ మరియు బీమా సొమ్ము కోసం అంచనాలను పొందడానికి మీరు అవధి బీమా కాలిక్యులేటర్‌ని ఉపయోగించుకోవచ్చు.
₹1.5 కోటి అవధి ప్లాన్ నేను ఎలా కొనుగోలు చేయవచ్చు?
మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వెబ్సైట్ లోనికి లాగిన్ అయి, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మీరు అవసరమైన పత్రాలను సమర్పించగలిగి ఉండి, ప్రీమియం మొత్తాన్ని చెల్లించగలిగి ఉంటే, కొనుగోలు ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు బీమా ఏజెంట్ సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.