గృహిణి కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
జీవిత బీమా యొక్క అత్యంత ప్రాథమిక వెర్షన్లలో ఒకటైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, దాదాపుగా ఎవరైనా తమకు లేదా తమ ప్రియమైనవారిలో ఒకరి కోసం కొనుగోలు చేయదగిన పాలసీ. అత్యంత సులువైన మాటల్లో చెప్పాలంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక వ్యక్తి మరణించిన మీదట క్లెయిమ్ చేసుకోగల ఒక నిర్ధారిత మొత్తం (భరోసా సొమ్ము)తో ఆ వ్యక్తికి భద్రత కల్పించడం అన్నమాట. ఒక గృహిణి కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనడం అంటే సరైన భరోసా సొమ్ముకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్లాన్‌ను ఎంచుకోవడం మరియు అవసరమైన అన్ని యాడ్-ఆన్‌లను చేర్చుకోవడం ఇమిడి ఉంటుంది.
గృహిణులకు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత
టర్మ్ ప్లానులు, లేదా సాధారణంగా జీవిత బీమా ప్లానులు అని పిలువబడేవి కుటుంబంలో ప్రధాన ఆదాయం పొందుతున్న వ్యక్తులపై తల్లిదండ్రులు, పిల్లలు లేదా జీవిత భాగస్వాములు వంటి ఆర్థికంగా ఆధారపడిన వ్యక్తులకు స్పష్టమైన ఎంపికగా పరిగణించబడతాయి. అయినప్పటికీ, కుటుంబ వ్యవస్థకు దోహదపడటాన్ని కేవలం ఆదాయంతో మాత్రమే కొలవలేము.
అందువల్ల, కుటుంబంలో దోహదకారిగా ఉన్న ఈ సభ్యురాలికి ఏదైనా దురదృష్టకర పరిస్థితి జరిగితే మిగిలిపోయే శూన్యతను ఊహించడం ఎంతో కష్టంగా ఉంటుంది. ఆమె లేని లోటు తీర్చలేనిది అయినా, ఆమె మరణించిన తర్వాత ఏదైనా ఆర్థిక సహాయం వస్తే, అది సభ్యులు తమ అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుంది.
గృహిణికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులను ఎందుకు పరిగణించాలో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.
ఆధారపడి ఉన్నవారికి మద్దతు
గృహిణి వెళ్ళిపోగా బ్రతికి ఉన్న వ్యక్తులు తమ పట్ల తాము శ్రద్ధ తీసుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ నుండి వచ్చే మరణ ప్రయోజనంపై ఆధారపడవచ్చు.
ఆమె బిడ్డ యొక్క భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడం
వారి తల్లి వెళ్ళిపోయాక, వారి సమీప బంధువు ఆమె పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి లేదా వారి చదువుకు నిధులు సమకూర్చడానికి ఆ భరోసా సొమ్మును ఉపయోగించవచ్చు.
వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కొరకు మద్దతు
ఒకవేళ టర్మ్ ప్లాన్‌ని ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అనారోగ్య రైడర్ వంటి రైడర్లతో కొనుగోలు చేసినచో, క్లెయిమ్ చేయబడిన ప్రయోజనాన్ని ఆమె ఊహించని వైద్య అవసరాలకు లేదా ప్లాన్‌కు అటువంటి యాడ్-ఆన్ల ద్వారా కవర్ చేయబడిన ఏవైనా ఆకస్మిక పరిణామాలకు ఉపయోగించవచ్చు.
ఒక గృహిణి కోసం టర్మ్ ప్లాన్ కు ₹1 కోటి సరియైన భరోసా సొమ్ము అవుతుందా? మీ అవసరాలకు సరియైనవైన ప్లానులను కనుగొనండి. మరింత తెలుసుకోవడానికై ఇక్కడ క్లిక్ చేయండి.
గృహిణులకు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య విశేషాంశాలు
మామూలుగా, గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీరు ఇతరుల కోసం కొనుగోలు చేసే ప్లానుల మాదిరిగానే ఉంటాయి. ఈ రకమైన జీవిత బీమా ప్లాన్ నుండి మీరు ఆశించగల కొన్ని కీలకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.
టర్మ్ ప్లానులు అత్యుత్తమ ప్రీమియం-నుండి-కవరేజ్ రేషియోను అందించేవిగా పరిగణించబడతాయి. మీరు ఆశించిన భరోసా సొమ్మును సంబంధితంగా సరసమైన ధరకే మీరు పొందవచ్చు. మీరు ఆశించిన ప్లాన్ కోసం ప్రీమియం ధరలను అర్థం చేసుకోవడానికి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ ని కూడా ఉపయోగించవచ్చు.
ప్రధానంగా చూస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు జీవిత బీమా భాగాన్ని మాత్రమే అందజేస్తాయి. ఈ ప్లానులలో అత్యంత ప్రాథమిక వెర్షన్ అయిన లెవల్ టర్మ్ ప్లాన్ నుండి ఆశించదగిన ఇతర రాబడులు లేదా ప్రయోజనాలు ఏవీ లేనప్పటికీ, కొన్ని ప్రాథమిక ప్రయోజనాలను అందించగల ఇతర ప్లాన్ వేరియంట్లు కూడా ఉన్నాయి.
గృహిణుల కోసం మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క పరిధిని మెరుగుపరచడానికి, మీరు ప్లానుతో అందుబాటులో ఉన్న రైడర్లను పరిశీలించవచ్చు. సాధారణమైన వాటిలో వైవర్ ఆఫ్ ప్రీమియం, ప్రమాదవశాత్తు మరణ ప్రయోజనం, ప్రమాదవశాత్తు సంపూర్ణ మరియు శాశ్వత అంగవైకల్యం మరియు ఆదాయ ప్రయోజనం వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఐచ్ఛికమైనవి మరియు వాటి ఖరీదు మీ మొత్తం ప్రీమియమును మార్చివేయవచ్చు.
గృహిణుల కోసం టర్మ్ ప్లానులు ఏయే ప్రయోజనాలను అందిస్తాయి?
గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు నిజమైన ప్రయోజనాలను అందించడానికి చాలా సులువైనవని గనక మీరు భావిస్తే, కొన్ని ప్రయోజనాలను పరిశీలించండి:
భవిష్యత్ భద్రత – గృహిణికి జీవిత బీమాను ఏర్పాటు చేయడం అంటే ఆమెపై ఆధారపడిన వారి భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేయడం అన్నమాట. తమ ప్రియమైనవారి మద్దతు లేకుండా తమ భవిష్యత్తు గురించి వారు తక్కువ చింతలను కలిగి ఉండగలుగుతారు.
కాలవ్యవధి యొక్క ఎంపిక - టర్మ్ ప్లానులు మామూలుగా పరిమిత కాలవ్యవధికి అందించబడతాయి, అందుబాటులో ఉన్న ఎంపికల నుండి పాలసీదారు కాల వ్యవధిని ఎంచుకుంటారు. మీకు ఎంత కాలం అవసరమైతే అంత కాలానికి మీరు కవరేజీని ఎంచుకోవచ్చు.
రాబడులు - మీరు ఒక గృహిణి కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్‌ను ఎంచుకుంటే, ప్లాన్ మెచ్యూరిటీకి చేరుకున్నట్లయితే మీకు ప్రీమియం మొత్తం తిరిగి చెల్లించబడవచ్చునని ఆశించవచ్చు.
పన్ను విధింపు ప్రయోజనావకాశాలు - ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను చట్టాల ప్రకారం, పాత పన్ను వ్యవస్థను ఎంచుకున్న పన్ను చెల్లింపుదారు చెల్లించిన ప్రీమియంలపై పన్ను మినహాయింపులను పొందడానికి ఎంచుకోవచ్చు. ఒకవేళ నామినీ గనక అదే వ్యవస్థను ఎంచుకుంటే, అందుకున్న మరణ ప్రయోజనంపై కూడా వారు మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు.
మనశ్శాంతి - ఒక గృహిణికి జీవిత బీమా ఉండటం వల్ల జీవిత బీమా పొందినవారు మరియు వారిపై ఆధారపడినవారితో సహా అనేక మంది వ్యక్తులు మనశ్శాంతి పొందగలుగుతారు.
గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ రకాలు
గృహిణుల కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానులను పరిగణిస్తున్నప్పుడు, అనేక రకాల ఎంపికల శ్రేణి అందుబాటులో ఉందని తెలుసుకోండి. అందుబాటులో ఉన్న ఎంపికలలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకునే ముందు మీ అవసరాలను లెక్కలోనికి తీసుకోండి.
ఇక్కడ కొన్ని సాధారణ రకాలు ఉన్నాయి.
స్థాయి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణించిన పక్షములో, ఈ ప్లానులు నామినీకి నిర్ధారిత భరోసా సొమ్మును అందిస్తాయి. ఇది ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు లేకుండా ఆవశ్యకమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది.
ప్రీమియం తిరిగి రాకతో టర్మ్ ఇన్సూరెన్స్
TROP అని కూడా పిలువబడే ఈ ప్లానులు, పాలసీ వ్యవధి అంతటా వారు జీవించి ఉంటే పాలసీదారు చెల్లించిన ప్రీమిములు అన్నింటినీ తిరిగి ఇచ్చేలా చూస్తాయి. రక్షణ మరియు పొదుపు అంశం రెండింటినీ కోరుకునే గృహిణులకు ఈ ప్లాన్ చాలా బాగా సరిపోతుంది.
ఉమ్మడి టర్మ్ ఇన్సూరెన్స్ కవర్
మీరు డ్యూయల్ లైఫ్ కవరేజ్ ప్రయోజనం ఉండే ప్లాన్ ని గనక కోరుకుంటే, మీరు ఉమ్మడి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాముల్లో ఏ ఒక్కరు మరణించినా, జీవించి ఉన్న భాగస్వామి భరోసా సొమ్మును అందుకుంటారు. ఈ ప్లాన్ మొత్తం ఇంటికీ సమగ్రమైన కవరేజీని అందజేస్తుంది.
పెరిగిపోయే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్
ద్రవ్యోల్బణం మరియు మారుతున్న ఆర్థిక అవసరాలను బట్టి పెరుగుతున్న కవరేజీని అందించడం ద్వారా భరోసా సొమ్ము ప్రతి సంవత్సరమూ పెరుగుతుంది.
తగ్గిపోయే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్
తగ్గిపోయే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ గృహిణులకు కాలక్రమేపీ ముందుగా నిర్ణయించిన రేటుతో తగ్గుతున్న హామీతో కూడిన కవర్ మొత్తాన్ని అందజేస్తుంది. కాలం గడిచే కొద్దీ మీ ఆర్థికపరమైన మరియు ఇతర బాధ్యతలు తగ్గుతాయని మీరు అనుకుంటే ఇది సరియైన ఎంపిక అవుతుంది.
గృహిణులకు టర్మ్ ఇన్సూరెన్స్ తో అందుబాటులో ఉన్న రైడర్లు
అవి ఐచ్ఛికం మరియు అదనపు ఖర్చుతో వచ్చేవి అయినా, రైడర్లు మీ టర్మ్ ఇన్సూరెన్స్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా మీకు సహాయపడగలుగుతాయి. ఉదాహరణకు, మీరు ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్‌ని కలిగి ఉన్నా లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో భరోసా సొమ్ము ఉన్నా, అందుకునే ప్రయోజనం నేరుగా మరణ ప్రయోజనంగా ఉంటుంది. రైడర్లతో, మీరు మరిన్ని సాధ్యతల కోసం ఎక్కువ కవరేజీని ఆశించవచ్చు.
ఎంచుకోవడానికి గాను సామాన్య రైడర్ ఆప్షన్లు కొన్ని ఇక్కడ ఉన్నాయి.
ప్రమాద మరణ ప్రయోజన రైడర్: పాలసీదారు గనక ప్రమాదంలో మరణిస్తే అదనపు భరోసా సొమ్మును అందిస్తుంది.
క్లిష్టమైన అనారోగ్యం రైడర్: క్యాన్సర్ లేదా గుండె జబ్బులు వంటి నిర్దిష్ట క్లిష్టమైన అనారోగ్యాలు వ్యాధినిర్ధారణ చేయబడితే ఏకమొత్తాన్ని చెల్లిస్తుంది.
వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్: ఒకవేళ పాలసీదారు వైకల్యానికి గురైతే లేదా తీవ్ర అనారోగ్యానికి గురైతే భవిష్యత్ ప్రీమియంలను మాఫీ చేస్తుంది.
అంగవైకల్య ఆదాయ రైడర్: పాలసీదారు గనక శాశ్వతంగా వికలాంగులుగా మారితే క్రమం తప్పని ఆదాయాన్ని అందిస్తుంది.
గృహిణుల కోసం సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడం
సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉండాలి. మీకు మొదటగా ముందుకు వచ్చే అందుబాటు ఎంపికను కొనుగోలు చేయడం మానుకోండి.
టర్మ్ ప్లానులు అనేవి దీర్ఘకాలిక నిబద్ధతలుగా ఉంటాయి ఇంకా మీ ఆర్థిక ప్రణాళికలో ముఖ్య పాత్ర పోషించగలుగుతాయి. మీకు ఏది ప్రముఖంగా ఆదరణ పొందిందో దానికి బదులుగా మీ అవసరాలకు ఏది బాగా సరిపోతుందో దానిని బట్టి ఒకదాన్ని ఎంచుకోండి.
మీరు భరోసా సొమ్ము విలువను నిర్ణయించడం ద్వారా మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు, ₹5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ స్థోమతకు తగిన ఆప్షన్ అని మీరు అనుకోవచ్చు. అయితే మీకు కావాల్సిన కవరేజ్ దానికంటే ఎక్కువ లేదా తక్కువై ఉండొచ్చు. ఈ అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మీరు హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్ ని ఉపయోగించవచ్చు లేదా ఒక నిపుణుడిని సంప్రదించవచ్చు.
తర్వాత, మీరు కోరుకున్న భరోసా సొమ్ముకు ప్రీమియం అంచనాలను పొందడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. రైడర్లు మీ ప్రీమియం మొత్తాన్ని ఎలా మారుస్తాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ అవసరాలు మరియు బడ్జెట్ ఆధారంగా వాటిని జోడించుకోవడానికి ఎంచుకోండి.
గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే ముందు పరిగణించుకోవలసిన అంశాలు
మీరు గృహిణి అయినా లేదా గృహిణికి జీవిత బీమా కొనుగోలు చేస్తున్న వారైనా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానులను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
Cమీ అవసరాల ఆధారంగా సముచితమైన భరోసా సొమ్మును ఎంచుకోండి. మీరు ₹2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొన్నా లేదా లక్షలలో భరోసా సొమ్ముతో గల ప్లాన్ కొన్నా, ఆ మొత్తం మీకు సరియైనదిగా ఉండేలా నిర్ధారించుకోండి.
మీ బాధ్యతల యొక్క అంచనాల ప్రకారం సరియైన టర్మ్ కాల వ్యవధిని ఎంచుకోండి. ఉదాహరణకు, మీ పిల్లలు రాబోయే 15-20 సంవత్సరాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మీరు ఆశిస్తే, 20 సంవత్సరాల టర్మ్ కాల వ్యవధి సరిపోతుంది. అయినప్పటికీ, మీకు తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటే, మీకు ఎక్కువ కవరేజ్ అవసరం కావచ్చు.
అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మరియు నమ్మకమైన కస్టమర్ సర్వీసు ఉన్న ఒక బీమా ప్రదాతను ఎంచుకోండి. అది మీ లబ్ధిదారుకు మరియు మీకు కూడా ఏవైనా సమస్యలు ఉంటే నివారించడానికి సహాయపడుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడంలో సముచితమైన రైడర్లను ఎంచుకోవడం కూడా కీలకమైన భాగం. మీరు కొనుగోలు చేయడానికి ముందు, రైడర్లు అంటే ఏమిటి మరియు అవి ఎలా ప్రయోజనకరంగా నిరూపించబడతాయో మీకు స్పష్టమైన అవగాహన ఉండేలా నిర్ధారించుకోండి.
మీరు గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు, అంచనాలను పొందడానికి ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను వాడండి. అది మీ ఆర్థిక విషయాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడంలో మీకు సహాయపడుతూ మీరు ఎంచుకున్న ప్లాన్ కోసం అందాజు ప్రీమియం మొత్తాన్ని మీకు తెలియజేస్తుంది. త్వరిత, విసుగు-లేని టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఖరీదైనదిగా ఉంటుందా?
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానులు అనేవి మార్కెట్లో లభించే అత్యంత చౌకైన లైఫ్ ఇన్సూరెన్స్ ఎంపికలుగా ఉంటాయి. ప్రీమియం మామూలుగా భరోసా సొమ్ములో ఒక భాగంగా ఉంటుంది. మీరు ఆశించిన ప్లాన్ మీకు ఎంత ఖర్చవుతుందో అర్థం చేసుకోవడానికి మీరు ఆన్లైన్ కాలిక్యులేటర్‌ని వాడవచ్చు.
గృహిణులు తమ జీవిత భాగస్వాములతో కలిసి ఉమ్మడి టర్మ్ ప్లానులను కొనుగోలు చేయవచ్చునా?
మీరు గృహిణి అయి ఉంటే, మీ జీవిత భాగస్వామి ఉమ్మడి టర్మ్ ప్లాన్ తీసుకొని మిమ్మల్ని దాని జీవిత వర్తింపు క్రింద చేర్చవచ్చు. అయినప్పటికీ, మీ జీవిత భాగస్వామి సంపాదించు వ్యక్తి అయి ఉంటే మీయంతట మీరే ఈ కొనుగోలును చేయలేకపోవచ్చు.
జీతం రాని ఒక వ్యక్తి టర్మ్ ప్లాన్ ని కొనుగోలు చేయవచ్చునా?
గృహిణులకు స్థిరమైన ఆదాయ మూలం గానీ లేదా అసలు ఆదాయమే గానీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ, వారు టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే, వారికి ఆదాయ ఋజువు అవసరం అవుతుంది. ఇందుకోసం, వారు తమ జీవిత భాగస్వామి ఆదాయ ఋజువును ఉపయోగించుకోవచ్చు.
గృహిణుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనడానికి వయోపరిమితి ఎంత?
వయో పరిమితులతో సహా,టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అర్హత ప్రాతిపదికలు గృహిణులకు మరియు ఇతర కస్టమర్లకు ఒకే విధంగా ఉంటాయి. ఈ వివరాలు ప్లానులను బట్టి మారుతుంటాయి కాబట్టి, మీకు ఆసక్తి ఉన్న ప్లాన్ అర్హత ప్రాతిపదికలను మీరు చెక్ చేసుకోవచ్చు.
ఒక గృహిణి విషయంలో అనుమతించబడిన గరిష్ట భరోసా సొమ్ము ఎంత?
మామూలుగా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ భరోసా సొమ్ముకు గరిష్ట పరిమితి అంటూ ఉండదు. మీరు మీకు తగిన ఒక మొత్తమును ఎంచుకోవచ్చు. అయినప్పటికీ, అంతిమ మొత్తము ప్లాన్‌ని అందించే బీమా కంపెనీ యొక్క ఆమోదానికి లోబడి ఉండవచ్చు.