కనీస ప్రవేశ వయస్సు
- Answer
-
15 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
15 సంవత్సరాలు
24 సంవత్సరాలు
70 సంవత్సరాలు
9/12/15 సంవత్సరాలు
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ క్యాష్‌బ్యాక్ ప్లాన్ అనేది పాల్గొనడం లేని, అనుసంధానం చేయబడని మనీబ్యాక్ బీమా ప్లాన్. జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా, ఈ పాలసీ కాలానుగుణ చెల్లింపులను మరియు మీ కుటుంబానికి భద్రతను అందిస్తుంది. ఈ పాలసీ క్రింద, మీ అవసరాల ఆధారంగా మీకు మీరుగా ఎంత మొత్తానికి బీమా చేయించుకోవాలనుకుంటారో ఎంచుకోవచ్చు. జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక అకాల మరణం చెందిన పక్షములో నగదు సమస్యలను నివారించడానికి మీ కుటుంబానికి ఎంత మొత్తం కావాలో దానిని ఎంచుకోవాల్సిందిగా మేము సలహా ఇస్తాము.
ఇది 9/ 12/ 15 సంవత్సరాల పాలసీ కాలావధిని ఎంచుకునే ఆప్షన్ తో ఒక పరిమిత ప్రీమియం పాలసీ.
ఈ పాలసీ క్రింద అందుబాటులో ఉండే ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంత?
పాలసీ కాలవ్యవధి | ప్రీమియం చెల్లింపు అవధి |
---|---|
9 సంవత్సరాలు | 5 సంవత్సరాలు |
12 సంవత్సరాలు | 7 సంవత్సరాలు |
15 సంవత్సరాలు | 10 సంవత్సరాలు |
జీవిత భరోసా పొందిన వ్యక్తి నెలవారీ/ మూడు నెలల వారీ/ ఆరు నెలల వారీ లేదా సంవత్సరం వారీ చెల్లించే ఐచ్ఛికం కలిగి ఉంటారు.
ఈ పాలసీ యందు 'జీవిత భరోసా పొందిన వ్యక్తి', 'పాలసీదారు', 'నామినీ' మరియు 'అపాయింటీ' చేరి ఉండవచ్చు.
జీవిత భరోసా పొందిన వ్యక్తి ఎవరై ఉంటారు?
ఎవరి జీవితంపై పాలసీ ఆధారపడి ఉందో వారు జీవిత భరోసా పొందిన వ్యక్తిగా ఉంటారు. పాలసీ మొదలయ్యే తేదీ నాడే వెంటనే రిస్క్ కవర్ మొదలవుతుంది. జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణంపై, ప్రయోజనం చెల్లించబడుతుంది మరియు పాలసీ ముగుస్తుంది. ఈ క్రింది విధంగా ఉన్నంతవరకూ ఎవరైనా వ్యక్తి జీవిత భరోసా పొందిన వ్యక్తి కావచ్చు –
పాలసీ కాలవ్యవధి | ప్రవేశము వద్ద పొందియున్న కనీస వయస్సు | ప్రవేశము వద్ద పొందియున్న గరిష్ట వయస్సు |
---|---|---|
9 సంవత్సరాలు | 15 సంవత్సరాలు | 45 సంవత్సరాలు |
12 సంవత్సరాలు | 15 సంవత్సరాలు | 50 సంవత్సరాలు |
15 సంవత్సరాలు | 15 సంవత్సరాలు | 55 సంవత్సరాలు |
గరిష్ట మెచ్యూరిటీ వయస్సు | చివరి పుట్టినరోజు నాటికి 70 సంవత్సరాలు |
---|
పాలసీదారు అంటే ఎవరు?
పాలసీ కలిగియున్న వ్యక్తిని పాలసీదారు అంటారు. పాలసీదారు జీవిత భరోసా పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు లేదా కాకపోవచ్చు. మీరు పాలసీదారుగా ఉండాలంటే, పాలసీ కొరకు దరఖాస్తు చేసుకునే సమయంలో, మీ చివరి పుట్టినతేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
నామినీ (లు) అంటే ఎవరు?
నామినీ(లు) అనేవారు, జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన ఉదంతంలో మరణ ప్రయోజనాన్ని అందుకునే వ్యక్తి అయి ఉంటారు. నామినీ(లు) జీవిత భరోసా పొందిన వ్యక్తిచే నియమించబడతారు. నామినీ(లు) మైనర్ (అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు) కూడా అయి ఉండవచ్చు. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 39 యొక్క నిబంధనలను అనుసరించి నామినేషన్ ఉండాలి.
అపాయింటీ అంటే ఎవరు?
జీవిత భరోసా పొందిన వ్యక్తి తాను నామినేట్ చేయగల వ్యక్తిని అపాయింటీ అంటారు. ఒకవేళ నామినీ(లు) గనక మైనర్ అయి ఉన్న పక్షములో, జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క అకాల మరణంపై నామినీ(ల) తరపున అపాయింటీ పాలసీ డబ్బును అందుకుంటారు.
రిస్క్ మొదలయ్యే తేదీ అనేది, ఈ పాలసీ క్రింద బీమా కవరేజీ మొదలయ్యే తేదీ అవుతుంది. రిస్క్ మొదలయ్యే తేదీ, పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా పాలసీ మొదలయ్యే తేదీ ఒకటే అయి ఉంటుంది.
ప్రీమియం చెల్లింపు రూపము | కనీస ప్రీమియమ్ |
---|---|
నెలవారీగా | Rs 522 |
మూడు నెలలకు ఒక మారు | Rs 1554 |
అర్ధ సంవత్సరం వారీ | Rs 3071 |
సంవత్సరం వారీ | Rs 6000 |
నెలవారీ, మూడు నెలలవారీ, మరియు ఆరు-నెలవారీ పాలసీల కొరకు ఈ క్రింది ప్రీమియం అంతరం కారకాంశాలు ఈ దిగువ అంతరం కొరకు ప్రీమియం చెల్లించడానికి వార్షిక ప్రీమియముపై వర్తిస్తాయి.
ప్రీమియం అంతరము | వార్షిక ప్రీమియముపై వర్తింపు చేయవలసిన కారకాంశము |
---|---|
నెలవారీగా | 0.0870 |
మూడు నెలలకు ఒక మారు | 0.2590 |
అర్ధ సంవత్సరం వారీ | 0.5119 |
In the IndiaFirst Life Cash Back Plan, you can choose the sum assured between ₹50,000 and no official maximum limit, subject to underwriting. When you pass away, your loved ones will receive the following benefits:
This means the longer you're covered money back life insurance policy, the bigger the potential payout your loved ones receive.
Yes, the policy offers a high sum assured rebate as mentioned below -
Sum Assured Band | Discount in premium per thousand Sum Assured on maturity (in Rs) |
---|---|
Rs 50 thousand to less than Rs 1 lakh | Nil |
Rs 1 lakh to less than Rs 2 lakhs | 6 |
Rs 2 lakhs to less than Rs 5 lakhs | 9 |
Rs 5 lakhs and above | 10 |
జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణం జరిగిన పక్షములో, సమర్థ న్యాయపరిధిలోని న్యాయస్థానముచే ఆదేశించబడిన విధంగా మేము మరణ ప్రయోజనాన్ని నామినీ(లు)/ అపాయింటీ / వారసులు/ అసైనీ/ వ్యక్తికి అందజేస్తాము. చెల్లించదగినట్టి మరణ ప్రయోజనం అనేది, మరణం మీదట భరోసా సొమ్ము మరియు మరణ తేదీ వరకూ హామీతో కూడిన జోడింపు అయి ఉంటుంది, అందులో మరణంపై భరోసా సొమ్ము ఈ క్రింది విధంగా పేర్కొనబడి ఉంటుంది:
వార్షికం చేయబడిన ప్రీమియముకు 10 రెట్లు ఎక్కువ లేదా చెల్లించబడిన ప్రీమియములు అన్నింటిపై 105% ఉంటుంది. ఇది మరణించిన తేదీ నాటికి లేదా మెచ్యూరిటీ నాటికి హామీతో కూడిన బీమా మొత్తంపై వర్తించు పన్నులు మరియు అదనపు ప్రీమియం/ రైడర్ ప్రీమియం, ఏదైనా ఉంటే, దాని మినహాయింపుతో ఉంటుంది. వార్షికం చేయబడిన ప్రీమియము అనేది మోడల్ కారకాంశం, అదనపు ప్రీమియం మరియు రైడర్ ప్రీమియం ఏదైనా ఉంటే, దానిని మినహాయించుకొని వార్షికం చేయబడిన ప్రీమియము.
జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణంలో, మరణ ప్రయోజనం చెల్లించబడిన తర్వాత, పాలసీ రద్దయిపోతుంది మరి అందువల్ల జీవించియున్న ప్రయోజనం లేదా మెచ్యూరిటీ ప్రయోజనం ఏదీ చెల్లించబడదు.
In case of policyholder’s untimely demise while the life assured is a minor, the surviving parent or legal guardian or anyone with an insurable interest in the minor’s life will be the policyholder.
Under this policy the total benefit payable will always be more than total premiums paid excluding applicable taxes and extra premium if any. The life assured can be the policyholder provided he/ she is 18 years or more at the time of policyholder’s demise.
జీవిత భరోసా పొందిన వ్యక్తి పాలసీ అవధి సందర్భంగా కాలానుగత చెల్లింపులను అందుకుంటారు. పాలసీదారుచే మెచ్యూరిటీ సమయానికి ఎంచుకోబడిన భరోసా సొమ్ము మీద ఆధారపడి చెల్లించబడే మొత్తం మారుతుంది. చెల్లించబడే అంతరము మరియు మొత్తము ఈ దిగువన ఇవ్వబడ్డాయి –
వయస్సు/పాలసీ అవధి | 9 సంవత్సరాలు | 12 సంవత్సరాలు | 15 సంవత్సరాలు |
---|---|---|---|
3 | మెచ్యూరిటీపై 20% భరోసా మొత్తము | - | - |
4 | - | మెచ్యూరిటీపై 20% భరోసా మొత్తము | - |
5 | - | - | మెచ్యూరిటీపై 20% భరోసా మొత్తము |
6 | మెచ్యూరిటీపై 20% భరోసా మొత్తము | - | - |
8 | - | మెచ్యూరిటీపై 20% భరోసా మొత్తము | - |
10 | - | - | మెచ్యూరిటీపై 20% భరోసా మొత్తము |
జీవిత భరోసా పొందిన వ్యక్తి పాలసీ అవధి ఆధారంగా హామీతో కూడిన జోడింపులతో పాటుగా భరోసా సొమ్ములో 60% సొమ్మును మెచ్యూరిటీ ప్రయోజనముగా అందుకుంటారు. పాలసీ అవధి ముగింపులో ప్రయోజనం చెల్లించబడుతుంది.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
జీవిత భరోసా పొందిన వ్యక్తి నెలవారీ/ మూడు నెలల వారీ/ ఆరు నెలల వారీ లేదా సంవత్సరం వారీ చెల్లించే ఐచ్ఛికం కలిగి ఉంటారు.
పెయిడ్-అప్ విలువను పొందడానికి ముందు
ఒకవేళ మీరు మొదటి రెండు పాలసీ సంవత్సరాల్లో మీ ప్రీమియం చెల్లించడం ఆపివేసినట్లయితే, ఎలాంటి పెయిడ్-అప్ విలువను కూడగట్టుకోకుండానే పాలసీ లాప్స్ అవుతుంది. మేము ఐదు సంవత్సరాల పునరుద్ధరణ వ్యవధిని అనుమతిస్తాము, ఆ సమయంలో మీరు మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. ఈ కాలవ్యవధిలో ఏ ప్రయోజనాలూ చెల్లించబడవు.
పాలసీ కాలవ్యవధి | ప్రీమియమును చెల్లించాల్సిన సంవత్సరాల సంఖ్య పెయిడ్ అప్ విలువను కలిగి ఉంటుంది |
---|---|
9/ 12/ 15 years | 2 Years |
పెయిడ్ అప్ విలువను పొందిన తర్వాత
పై పట్టికలో కనబరచిన విధంగా రెండు పూర్తి సంవత్సరాల తర్వాత మీరు మీ ప్రీమియంలను చెల్లించడం ఆపివేసినట్లయితే, పాలసీ గ్యారంటీ ఇవ్వబడిన పెయిడ్- అప్ విలువను పొందుతుంది. పాలసీ పెయిడ్-అప్ గా మారిన తర్వాత జీవించియున్న ప్రయోజనం మరియు గ్యారెంటీడ్ జోడింపులు చెల్లించబడవు.
మెచ్యూరిటీపై చెల్లించదగిన పెయిడ్-అప్ విలువ | మరణంపై చెల్లించదగిన పెయిడ్-అప్ విలువ |
---|---|
మెచ్యూరిటీపై భరోసా సొమ్ము X (చెల్లించబడిన ప్రీమియముల సంఖ్య / చెల్లించవలసిన మొత్తం ప్రీమియముల సంఖ్య) + గ్యారంటీడ్ జోడింపులు – జీవించియున్న ప్రయోజనం ఏదైనా చెల్లించబడి ఉంటే అది. | మరణంపై భరోసా సొమ్ము X చెల్లించబడిన ప్రీమియముల సంఖ్య / చెల్లించవలసిన మొత్తం ప్రీమియముల సంఖ్య) + గ్యారంటీడ్ జోడింపులు |
పాలసీని పునరుద్ధరించడానికి గల ఆప్షన్లు ఏవేవి?
మీరు ఇలా మీ పాలసీని నిర్దిష్ట వ్యవధిలో పునరుద్ధరించుకోవచ్చు –
i. లాప్స్ అయిన పాలసీ పునరుద్ధరణ కోసం లిఖితపూర్వక అభ్యర్థనను సమర్పించడం;
ii. చెల్లించని ప్రీమియములన్నింటినీ వడ్డీతో పాటు చెల్లించడం; మరియు
iii. మంచి ఆరోగ్యం ఉన్నట్లు ప్రకటనను ఇవ్వడం మరియు అవసరమైతే మీ స్వంత ఖర్చుతో వైద్య పరీక్ష చేయించుకోవడం.
చెల్లించబడని మొదటి ప్రీమియము యొక్క గడువు తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున, ఐతే మెచ్యూరిటీ తేదీకి ముందే పునరుద్ధరణ చేసుకుంటున్నంత కాలమూ మీరు దానిని చేసుకోవచ్చు. ఈ కాలవ్యవధిలో మరణం జరిగిన పక్షములో, చెల్లించబడే విలువ, ఏదైనా ఉంటే అది తప్ప ఇతరత్రా ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు. పునరుద్ధరణ వ్యవధి లోపున మీ పాలసీని పునరుద్ధరించిన మీదట, పాలసీ పెయిడ్-అప్ గా మారిన తర్వాత చెల్లించాల్సియున్న ఏవైనా జీవించియున్న ప్రయోజనాలకు మీరు అర్హులు అవుతారు.
సంతృప్తికరమైన వైద్య మరియు ఆర్థిక పూచీకత్తుకు లోబడి పునరుద్ధరణ ఆధారపడి ఉంటుంది. పునరుద్ధరణ వ్యవధి ముగిసే లోపున మీరు మీ పాలసీని పునరుద్ధరించకుండా మరియు మీరు మీ రెగ్యులర్ ప్రీమియంలను రెండు సంవత్సరాల కంటే తక్కువగా చెల్లించి ఉంటే, అప్పుడు పాలసీ ఎటువంటి పెయిడ్-అప్ విలువను పొందదు మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.
మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము, అది ప్రీమియం గడువు తేదీ నుండి ప్రీమియం చెల్లింపు కోసం అందించబడిన సమయం, ఆ సమయంలో పాలసీ రిస్క్ కవర్ తో సహా అమలులో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఈ పాలసీ, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ వ్యవధి సందర్భంగా ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక మరణించిన పక్షములో, మరణం సంభవించే వరకూ బాకీ పడి ఉన్న ప్రీమియములను మినహాయించుకొని మరణ ప్రయోజనం నామినీ (లు)/అపాయింటీ/చట్టబద్ధ వారసులకు చెల్లించబడుతుంది.
ఈ కాలవ్యవధిలో, పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.
త్వరగా రద్దుపరచిన విలువ:
సరెండర్ విలువ:
మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు;
మీరు ఏవైనా పాలసీ నిబంధనలు మరియు షరతులకు అంగీకరించని పక్షములో, మీరు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించే ఐచ్ఛికం కలిగి ఉంటారు మరియు ఆ నిబంధనలు లేదా షరతుల్లో దేనినైనా మీరు అంగీకరించని పక్షములో పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజులలోపున అందుకు కారణాలను తెలియజేస్తూ పాలసీని మాకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.
మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందారా?
ఔను. మేము చెల్లించిన ప్రీమియమునకు సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము. దీనిని తగ్గించుకొని: i. పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం మరియు రైడర్ ప్రీమియం, ఏదైనా ఉంటే. దీనిని తగ్గించుకొని ii. ఏదైనా స్టాంప్ డ్యూటీని చెల్లించి ఉంటే అది తగ్గించుకొని iii. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
సుదూర మార్కెటింగ్‌లో, వాయిస్ రూపం, ఎస్ఎం ఎలక్ట్రానిక్ రూపం, భౌతిక రూపం (పోస్టల్ మెయిల్ వంటివి) లేదా వ్యక్తిగతంగా కాకుండా మరే ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా విజ్ఞప్తి (లీడ్ జనరేషన్‌తో సహా) మరియు బీమా ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రతి కార్యాచరణ చేరి ఉంటుంది.
ఈ పాలసీ క్రింద ఋణ సదుపాయం ఇవ్వబడదు.
ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్యకు పాల్పడితే, నామినీ(లు)/ అపాయింటీ/ చట్టబద్ధ వారసులకు, చెల్లించిన మొత్తం ప్రీమియంలో 80%ని మేము చెల్లిస్తాము. జీవిత భరోసా పొందిన వ్యక్తి, మరణించిన సమయంలో తెలివిగా ఉన్నారా లేదా మతిస్థిమితం లేకుండా ఉన్నారా అనే దానితో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది.
ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి పునరుద్ధరణ/పునఃస్థాపన తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్యకు పాల్పడితే, చెల్లించాల్సియున్న ప్రయోజనం సరెండర్ విలువ కంటే అధికంగా లేదా చెల్లించిన మొత్తం ప్రీమియములో 80%కి సమానంగా ఉంటుంది.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
15 లేదా 20 సంవత్సరాల మొత్తం పాలసీ అవధి అంతటా జీవిత బీమా వర్తింపుతో పాటుగా అనుకూలవంతమైన ప్రీమియములు, హామీతో కూడిన జీవన ప్రయోజనాలు, మరియు బోనసులు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) అందించే ఈ హామీతో కూడిన పొదుపు జీవిత బీమా ప్లానుతో ఒక వ్యక్తిగతీకృతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి
అస్వీకార ప్రకటన
#బకాయీ ఉన్న ప్రీమియములు అన్నీ చెల్లించబడినప్పుడు ప్రయోజనాలు గ్యారంటీగా ఉంటాయి.
*చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. ఈ పాలసీని కొనుగోలు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.