మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు
- Answer
-
75 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
ముఖ్య విశేషాంశాలు
మీ ప్లాన్‌ని దర్శించండి
75 సంవత్సరాలు
కనిష్టం
గరిష్టం: 50 సంవత్సరాలు
20 మరియు 25 సంవత్సరాలు
10-సంవత్సరాల పాలసీ అవధి కొరకు
15-సంవత్సరాల పాలసీ అవధి కొరకు
20-సంవత్సరాల పాలసీ అవధి కొరకు
25-సంవత్సరాల పాలసీ అవధి కొరకు
కనీసం: ₹1,50,000.
గరిష్టం: అండర్‌రైటింగ్ కి లోబడి ఏ పరిమితీ లేదు.
సంవత్సరం వారీ, అర్ధ సంవత్సరం వారీ, మూడు నెలల వారీ లేదా నెలవారీ
బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఎటువంటి పరిమితీ లేదు
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
జీవిత బీమా మరియు పొదుపు ప్లాన్‌ను ఒకటిగా కలుపుతున్నట్టి ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్‌ని పరిచయం చేస్తున్నాము. ఇది కేవలం స్మార్ట్ చెల్లింపు ప్లాన్ మాత్రమే కాదు; ఇది ఆదాయపు పన్ను ఆదా చేసుకునే పథకం కూడా. డబ్బు-ఆదా చేసుకునే ఈ ప్లానుతో, మీరు పరిమిత సమయం వరకు ప్రీమియంలను చెల్లిస్తారు, మరియు ఈ కాలవ్యవధిలో మీరు కొంత డబ్బును వెనక్కి పొందవచ్చు. మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పినప్పటికీ, మీ లైఫ్ కవర్ క్రియాశీలకంగానే ఉంటుంది. ఇంకా అదనంగా, ఈ స్మార్ట్ టర్మ్ చెల్లింపు ప్లాన్ మెచ్యూర్ అయినప్పుడు, మీరు బోనస్‌లను పొందవచ్చు (ప్రకటించి ఉంటే). ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబాన్ని రక్షించడానికి ఈ ప్లాన్ లైఫ్ కవర్ కూడా అందిస్తుంది. మరింత వెసులుబాటు మరియు భద్రతతో మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడేలా ఇది రూపొందించబడింది.
పాలసీలో మెచ్యూరిటీపై భరోసా ఇవ్వబడిన సొమ్ము పాలసీ యొక్క ప్రారంభంలో మీరు ఎంచుకున్నట్లుగా ఉంటుంది మరియు అది మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన కనీస ప్రయోజనంగా ఉంటుంది.
భరోసా ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము | భరోసా ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము |
---|---|
1,50,000 | బోర్డు ఆమోదిత అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి ఎటువంటి పరిమితీ లేదు |
పెంపొందిత ప్రయోజనం కోసం మీరు వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కొరకు కూడా ఎంచుకోవచ్చు. సదరు రైడర్ పైన మరిన్ని వివరాల కోసం దయచేసి ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ బ్రోచరును చదవండి.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. ఈ పాలసీని కొనుగోలు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
మీ పాలసీ యొక్క పూర్తి ప్రయోజనాలను ఆనందించడానికి గాను మీ పాలసీని కొనసాగించడం మంచిదని సలహా ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో మీరు మీ పాలసీని సరెండర్ చేయాల్సి వస్తుందని మేము అర్థం చేసుకుంటాము. రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములను చెల్లించిన తర్వాత పాలసీ సరెండర్ విలువను పొందుతుంది.
సరెండర్ చేయబడిన సమయములో హామీ ఇవ్వబడిన సరెండర్ విలువ (GSV) లేదా ప్రత్యేక సరెండర్ విలువ (SSV) కంటే ఎక్కువ సొమ్ము చెల్లించబడుతుంది. చెల్లించవలసియున్న సరెండర్ విలువ పాలసీ అవధి మరియు సరెండర్ చేసిన పాలసీ సంవత్సరాన్ని బట్టి మారుతుంటుంది. జీఎస్‌వీ కారకాంశములు పాలసీ సరెండర్ చేయబడిన సంవత్సరం మరియు పాలసీ అవధిపై ఆధారపడి ఉంటాయి. రెండు కూర్పుల జీఎస్‌వీ కారకాంశములు ఉన్నాయి. చెల్లించిన మొత్తం ప్రీమియంలపై ఒక కూర్పు జీఎస్‌వీ కారకాంశములు వర్తిస్తాయి మరియు సరెండర్ తేదీ వరకు కూడగట్టుకోబడిన ఏదైనా మిగిలియున్న సాధారణ రివర్షనరీ బోనస్ (ప్రకటించి ఉంటే) పైన ఇతర జీఎస్‌వీ కారకాంశములు వర్తిస్తాయి.
జీఎస్‌వీ = ప్రీమియం కోసం జీఎస్‌వీ కారకాంశం * వర్తించే పన్నులు మినహా చెల్లించిన మొత్తం ప్రీమియం, రైడర్ ప్రీమియం ఏదైనా ఉంటే, మరియు అదనపు ప్రీమియం, ఏదైనా ఉంటే; ప్లస్సింపుల్ రివర్షనరీ బోనస్ కోసం జీఎస్‌వీ కారకాంశం * కూడగట్టుకున్న సింపుల్ రివర్షనరీ బోనస్ (ప్రకటించి ఉంటే); ఈ తగ్గింపుతో, సరెండర్ తేదీ వరకు ఏదైనా వార్షికం చేయబడిన ప్రీమియం చెల్లించబడి ఉంటే అందుకు 103% జీవించియున్న ప్రయోజనం.
ఎస్ఎస్‌వి ఇలా ఉంటుంది = {(చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య/పాలసీ అవధిలో చెల్లించాల్సియున్న ప్రీమియంల మొత్తం సంఖ్య) x (భరోసా సొమ్ము ప్లస్ పాలసీ క్రింద వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 103% జీవించియున్న ప్రయోజనం);అందులో ఇది తగ్గించుకొని, సరెండర్ తేదీ వరకు, ఏదైనా చెల్లించి ఉంటే, వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 103% జీవించియున్న ప్రయోజనం; ప్లస్, కూడగట్టుకున్న సింపుల్ రివర్షనరీ బోనస్ (ప్రకటించి ఉంటే)} సరెండర్ సమయంలో ఉన్న ఎస్ఎస్‌వి కారకాంశముచే గుణించగా వచ్చిన మొత్తము.
ముందస్తు నిబంధనాయుత ఆమోదమునకు లోబడి ఎస్ఎస్‌వి కారకాంశము మాచే కాలానుగుణంగా నిర్ణయించబడుతుంది. జిఎస్‌వి కారకాంశములు అనుబంధం 1 లో కనబరచబడ్డాయి.
ఒకవేళ పాలసీ చెల్లించబడే-విలువను పొందినట్లయితే మీ పాలసీ జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
ఈ ప్రయోజనం క్రింద; మీ పాలసీ పెయిడ్-అప్ విలువను సాధించిన తర్వాత ఒక పాలసీ సంవత్సరానికి మీరు ప్రీమియం చెల్లించడం తప్పినట్లయితే; అమలులో ఉన్న పాలసీ ప్రకారం "మొదటి చెల్లించని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం పాటు పాలసీ క్రింద మరణ ప్రయోజనాలు కొనసాగుతాయి. ఈ కాలవ్యవధిలో ఆ సంవత్సరానికి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం బాకీపడి చెల్లించబడని సంవత్సరం పాటు సాధారణ రివర్షనరీ బోనస్ (ప్రకటించబడి ఉంటే) చెల్లించబడదు.
కస్టమరు "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం లోపు వర్తించే వడ్డీతో సహా ప్రీమియమును చెల్లిస్తే, "జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనం" యొక్క ప్రయోజనాన్ని మరింత పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అట్టి చెల్లింపుపై, సవరించబడిన "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం పాటు జీవిత వర్తింపు కొనసాగే ప్రయోజనం వర్తిస్తుంది. బాకీ పడిన ప్రీమియమును మీరు చెల్లించిన సంవత్సరానికి మీరు రివర్షనరీ బోనస్ ఏదైనా ప్రకటించబడి ఉంటే, దానిని కూడా అందుకుంటారు.
ఒకవేళ మీరు "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి 12 నెలల లోపున ప్రీమియమును చెల్లించకపోతే, అప్పుడు తగ్గించబడిన పెయిడ్-అప్ విలువ మేరకు మరణ ప్రయోజనం తగ్గిపోతుంది.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పు ప్రకటన అనేదానితో వ్యవహరించబడుతుంది.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 45 ఇలా చెబుతుంది
మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు;మీరు ఏవైనా పాలసీ నిబంధనలు మరియు షరతులకు అంగీకరించని పక్షములో, మీరు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించే ఐచ్ఛికం కలిగి ఉంటారు మరియు ఆ నిబంధనలు లేదా షరతుల్లో దేనినైనా మీరు అంగీకరించని పక్షములో పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపున మీ అభ్యంతరాలకు కారణాలను తెలియజేస్తూ పాలసీని దాని రద్దు కోసం బీమాదారులకు తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. సుదూర మార్కెటింగ్ లేదా ఎలక్ట్రానిక్ రూపము ద్వారా కొనుగోలు చేసిన పాలసీల కొరకు ఫ్రీ - లుక్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది.
మీ పాలసీని మీరు రద్దు చేసుకున్నప్పుడు మీరు ఏదైనా రీఫండ్ పొందారా?
ఔను. మేము దీనికి సమానమైన మొత్తమును తిరిగి చెల్లిస్తాము -
చెల్లించబడిన ప్రీమియం
i ని తగ్గించుకోండి: పాలసీ అమలులో ఉన్న కాలావధికి గాను ప్రో-రేటా రిస్క్ ప్రీమియం మరియు రైడర్ ప్రీమియం, ఏదైనా ఉంటే.
ii ని తగ్గించుకోండి. చెల్లించబడిన ఏదేని స్టాంప్ డ్యూటీ
iii ని తగ్గించుకొని. వైద్య పరీక్షపై చేయబడిన ఖర్చులు, ఏవైనా ఉంటే.
ఔను, ఈ ప్లాన్ క్రింద మీరు ఒక లోన్ సౌకర్యము నుండి ప్రయోజనం పొందవచ్చు.
ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము అప్పటి సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులోని సరెండర్ మొత్తంలో 90% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు. కనీస లోన్ మొత్తము రు.1,000 లుగా ఉండాలి. మేము సంవత్సరానికి 10% రేటుతో వడ్డీని విధిస్తాము, అది ఐఆర్‌డిఎఐ ఆమోదానికి లోబడి మాచే ఎప్పటికప్పుడు సమయానుగుణంగా మార్పు చేయబడవచ్చు.. కూడగట్టుకుపోయిన వడ్డీతో కూడిన ఋణం సరెండర్ విలువను మించిపోయినప్పుడు, పాలసీ ముందస్తుగా ముగించబడుతుంది మరియు వడ్డీతో పాటు బాకీ పడిఉన్న ఋణం సరెండర్ రాబడి నుండి వసూలు చేసుకోబడుతుంది. వడ్డీతో పాటు బాకీ పడిఉన్న ఋణం, ఒకవేళ ఏదైనా ఉంటే, మరణం లేదా మెచ్యూరిటీ లోపున తిరిగి చెల్లించబడనప్పుడు అది మరణం/ మెచ్యూరిటీ రాబడుల నుండి వసూలు చేసుకోబడుతుంది.
కారుణ్య వ్యవధి లోపున పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియము బాకీ ఉన్నట్లయితే, పాలసీ గనక గ్యారంటీడ్ సరెండర్ విలువను పొందక పోయి ఉంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. రిస్క్ కవర్ ఆపివేయబడుతుంది మరియు ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు.
ఒకవేళ రెండు పూర్తి సంవత్సరాల కంటే తక్కువ కాలానికి ప్రీమియములు చెల్లించబడకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది.
అయినప్పటికీ, పునరుద్ధరణ వ్యవధి లోపున మీరు మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణపై మరింత సమాచారం కోసం మీరు ఈ దిగువన తదుపరి విభాగాలను చూడవచ్చు.
కనీసం రెండు (2) పూర్తి సంవత్సరాల ప్రీమియం చెల్లించి, మరియు తదుపరి బకాయి ప్రీమియంలు ఏవైనా చెల్లించనట్లయితే, మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి కారుణ్య వ్యవధి గడువు ముగిసిన తర్వాత పాలసీ పెయిడ్-అప్ విలువను పొందుతుంది. ఒకసారి పెయిడ్-అప్ పాలసీ లోనికి మార్చబడిన తర్వాత పాలసీ భవిష్యత్తులో ఏవైనా సాధారణ రివర్షనరీ బోనస్‌లకు (ప్రకటించబడితే) అర్హత పొంది ఉండదు.
గమనిక:
ఒక పెయిడ్-అప్ పాలసీని షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున (అసలు ప్రయోజనాలకు) పునరుద్ధరించవచ్చు.
పెయిడ్-అప్ రూపంలో ఉన్న పాలసీని పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పునరుద్ధరించకపోతే, అది పాలసీ యొక్క మెచ్యూరిటీ లేదా మరణం లేదా సరెండర్ వరకూ తగ్గించబడిన పెయిడ్- అప్ రూపంలోనే కొనసాగుతుంది. పాలసీ యొక్క అవధి సందర్భంగా చెల్లించాల్సిన ప్రీమియములు అన్నీ చెల్లించబడితే పాలసీ పూర్తిగా పెయిడ్-అప్ గా మారుతుంది మరియు చెల్లించదగిన ప్రయోజనాలు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఉంటాయి.
ఒకసారి పాలసీ పెయిడ్-అప్ గా మారినదంటే:
మరణంపై భరోసా సొమ్ము అనేది పెయిడ్-అప్ చేయబడిన పాలసీ యొక్క తేదీ నాటికి భరోసా సొమ్ము* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య)
కాగా, మెచ్యూరిటీ పైన తగ్గించబడిన పెయిడ్-అప్ భరోసా సొమ్ము ఈ క్రింది విధంగా పేర్కొనబడుతుంది:
(మెచ్యూరిటీపై గ్యారంటీడ్ భరోసా సొమ్ము ప్లస్ సర్వైవల్ ప్రయోజనం) x (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య)
పాలసీని పునరుద్ధరించడానికి గల ఆప్షన్లు ఏవేవి?
చెల్లించబడని మొదటి ప్రీమియము యొక్క గడువు తేదీ నుండి 5 సంవత్సరాల లోపున, ఐతే పాలసీ అవధి గడువు తీరే ముందే మీరు మీ పాలసీని పునరుద్ధరణ చేసుకోవచ్చు-
వడ్డీతో పాటు చెల్లించబడని ప్రీమియములన్నింటినీ చెల్లించడం; మరియు
బోర్డ్ ఆమోదించిన పూచీకత్తు విధానం ప్రకారం, అవసరమైతే, ఆరోగ్యానికి సంబంధించి సంతృప్తికరమైన నిరూపణను అందించడం. మెడికల్స్ యొక్క ఖర్చు, ఏదైనా ఉంటే, దానిని పాలసీదారు భరిస్తారు.
బోర్డు ఆమోదిత పూచీకత్తు విధానం ప్రకారం ల్యాప్స్ అయిన లేదా తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ మాత్రమే దాని ప్రయోజనాలు అన్నింటితో పాటు పునరుద్ధరించబడుతుంది. ఒకవేళ పాలసీ గనక పునరుద్ధరించబడితే, అప్పుడు అమలులో ఉన్న ఒక పాలసీకి సంబంధించిన పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం అన్ని ప్రయోజనాలు పునరుద్ధరించబడతాయి.
గమనిక: ప్రీమియం చెల్లింపులో జాప్యం కోసం వసూలు చేయబడే ప్రస్తుత వడ్డీ సంవత్సరానికి 9% గా ఉంది. ఐఆర్‌డిఏఐ నుండి ముందస్తు ఆమోదానికి లోబడి అది ప్రతి ఆర్థిక సంవత్సరమూ సవరించబడవచ్చు
ఔను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఓపి) రైడర్ (UIN:143B017V01) ఎంచుకునే ఒక ఆప్షన్ కలిగి ఉంటారు, కలిగి ఉన్నారు. ఈ రైడర్ ని మీరు ఎంచుకున్నప్పుడు, ఒకవేళ పాలసీదారు / బీమా పొందిన వ్యక్తి గనక రైడర్ ఐచ్ఛికం క్రింద పేర్కొనబడినట్లుగా మరణం, ప్రమాద కారణంగా సంపూర్ణ శాశ్వత అంగ వైకల్యం లేదా క్లిష్ట అస్వస్థతను అనుభవించిన పక్షములో, మీ బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములు మాఫీ చేయబడటం ద్వారా మీకు మద్దతును ఇస్తుంది. పాలసీదారు/ జీవిత భరోసా పొందిన వ్యక్తి కొరకు ఆప్షన్లు ఈ దిగువ కనబరచిన విధంగా ఉన్నాయి.
ఆప్షన్ | ప్రయోజనం |
---|---|
మరణంపై ప్రీమియం వైవర్ | ఈ ఆప్షన్, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, పాలసీదారు యొక్క మరణంపై బేస్ పాలసీ కింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది (బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులు అయినప్పుడు మాత్రమే). |
ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థత (రోగ నిర్ధారణ) పై ప్రీమియం యొక్క వైవర్ | ఈ ఆప్షన్, ఈ క్రింది ఘటనలలో ఏదైనా ఒకటి లేదా ఏకకాలంలో జరగడంపై బేస్ పాలసీ క్రింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది; రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్న రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క నిర్ధారిత రోగనిర్ధారణ. |
మరణం లేదా ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థతపై ప్రీమియం యొక్క వైవర్ | ఈ ఆప్షన్ ఈ క్రింది ఘటనలలో దేనిలోనైనా ముందుగా జరిగే మరియు చెల్లించవలసిన అన్ని భవిష్యత్ ప్రీమియమ్‌లను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది - జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క మరణం లేదా జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం ధృవీకరించబడిన నిర్ధారణపై, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భరోసా ఇవ్వబడుతుంది. ఈ ఆప్షన్ కొరకు ఎంచుకోవడానికి, బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులై ఉండాలి |
అవును, దిగువ పట్టిక ప్రకారం మీరు అధిక భరోసా మొత్తాన్ని ఎంచుకొని ఉంటే ప్రీమియం రాయితీ ఉంటుంది:-
మెచ్యూరిటీ బ్యాండ్ పైన భరోసా సొమ్ము | ప్రీమియంపై డిస్కౌంట్ % |
---|---|
1,50,000 నుండి < 2,00,000 | లేదు |
2,00,000 నుండి <3,00,000 | 1% |
3,00,000 నుండి <5,00,000 | 2% |
5,00,000 నుండి <10,00,000 | 3% |
10,00,000 మరియు ఆ పైన | 4% |
కంపెనీచే ప్రకటించబడి యున్న బోనస్ పాలసీ ప్రకారం ఈ పాలసీ క్రింద బోనస్‌లలో సింపుల్ రివర్షనరీ బోనస్ (ఎస్ఆర్‌బి) మరియు టెర్మినల్ బోనస్ (టిబి) ఉన్నాయి.
మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము, అది ప్రీమియం గడువు తేదీ నుండి ప్రీమియం చెల్లింపు కోసం అందించబడిన సమయం, ఆ సమయంలో పాలసీ రిస్క్ కవర్ తో సహా అమలులో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఈ పాలసీ, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ వ్యవధి సందర్భంగా ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక మరణించిన పక్షములో, మరణం సంభవించే వరకూ బాకీ పడి ఉన్న ప్రీమియములను మినహాయించుకొని కరణ ప్రయోజనం నామినీ (లు)/అపాయింటీ/వారసులకు చెల్లించబడుతుంది. ఈ కాలవ్యవధిలో, పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.
పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య కారణంగా మరణం విషయంలో, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.
మీరు ఈ క్రింది పట్టిక ప్రకారం మీ జీవించియున్న ప్రయోజనాలను అందుకుంటారు: -
ప్రీమియం చెల్లింపు అవధి | చెల్లించే సంవత్సరం (ఈ పాలసీ సంవత్సరం ముగింపు నాటికి వార్షికం చేయబడిన ప్రీమియం యొక్క 103% చెల్లించబడుతుంది) |
---|---|
5 సంవత్సరాలు | 4వ సంవత్సరము |
6 సంవత్సరాలు | 5వ సంవత్సరము |
7 సంవత్సరాలు | 6వ సంవత్సరము |
8 సంవత్సరాలు | 7వ సంవత్సరము |
10 సంవత్సరాలు | 9వ సంవత్సరము |
12 సంవత్సరాలు | 11వ సంవత్సరము |
15 సంవత్సరాలు | 14వ సంవత్సరము |
17 సంవత్సరాలు | 16వ సంవత్సరము |
20 సంవత్సరాలు | 19వ సంవత్సరము |
మీ పాలసీ యొక్క ప్రీమియంని చెల్లించడానికి ఈ జీవించియున్న ప్రయోజనాన్ని ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంటుంది. మీరు మొదట్లో ఎంచుకున్న మెచ్యూరిటీ మొత్తానికి భరోసా సొమ్ము జీవించియున్న ప్రయోజనం తర్వాత కూడా గ్యారంటీడ్ గా నిలిచి ఉంటుంది మరియు మీకు తిరిగి వెనక్కి చెల్లించిన మొత్తం మేరకు తగ్గించబడదు. మీరు ఈ ఐచ్ఛికాన్ని మొదట్లోనే ఎంచుకోవాల్సి ఉంటుంది.
పాలసీ యొక్క అవధి సందర్భంగా జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి మరణించిన పక్షములో, నామినీకి మరణ ప్రయోజనం ఒక ఏకమొత్తం రూపములోనైనా లేదా తదుపరి 5/10/15 సంవత్సరాల పాటు నెలసరి ఆదాయముగానైనా చెల్లించబడుతుంది. మరణ ప్రయోజనం అనేది రెండు ఐచ్ఛికాలలో అధికంగా ఉన్నదానిగా నిర్ణయించబడుతుంది:
మరణంపై భరోసా సొమ్ము వీటిలో ఎక్కువదిగా లెక్కించబడుతుంది:
మరణ ప్రయోజనం వాయిదాలలో చెల్లించబడితే, మరణ ప్రయోజనాన్ని యాన్యువిటీ కారకాంశముచే గుణించడం ద్వారా నెలసరి వాయిదా మొత్తం నిర్ణయించబడుతుంది, మరణించిన తేదీ నాటికి ఉన్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఆధారంగా యాన్యువిటీ కారకాంశం వస్తుంది. కంతుల కాలవ్యవధి అంతటా కంతు మొత్తం ఒకే స్థాయిలోనే నిలిచి ఉంటుంది. మార్చి 31వ తేదీన చేయబడిన నిర్ణయాలను అనుసరించి ప్రస్తుతమున్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆఖరున జరిగే సమీక్షకు లోబడి ఉంటుంది.
మీరు ఈ క్రింది వాటిని మెచ్యూరిటీ వద్ద అందుకుంటారు: -
దీనిని పాలసీ లోని మెచ్యూరిటీ ప్రయోజనం అని కూడా అంటారు.
మెచ్యూరిటీ ప్రయోజనం యొక్క చెల్లింపు మీదట, పాలసీ రద్దు అవుతుంది మరియు ఇక ఎటువంటి ప్రయోజనాలూ చెల్లించబడవు.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
15 లేదా 20 సంవత్సరాల మొత్తం పాలసీ అవధి అంతటా జీవిత బీమా వర్తింపుతో పాటుగా అనుకూలవంతమైన ప్రీమియములు, హామీతో కూడిన జీవన ప్రయోజనాలు, మరియు బోనసులు (ఒకవేళ ప్రకటించబడి ఉంటే) అందించే ఈ హామీతో కూడిన పొదుపు జీవిత బీమా ప్లానుతో ఒక వ్యక్తిగతీకృతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి
Disclaimer
Linked Insurance Products are different from the traditional insurance products and are subject to risk factors. The Premium paid in unit-linked life insurance policies are subject to investment risks associated with capital markets and NAVs of the units may go up or down, based on the performance of fund and factors influencing the capital market and the insured is responsible for his/her decisions. IndiaFirst Life Insurance Company Limited is only name of the Insurance Company and does not in any way indicate the quality of the contract, its future prospects, or returns.
Please know the associated risks and the applicable charges from your Insurance Agent or the Intermediary or policy document issued by the Insurance Company. The various funds offered under this contract are the names of the funds and do not in any way indicate the quality of these plans, their future prospects and returns. Past performance may or may not be sustained in future and is not a guarantee of future performance. Some of the contents of this document may contain statements / estimates / expectations / predictions, which may be 'forward looking'.
The actual outcomes could differ materially from those expressed /implied in this document.These statements, do not intend to provide personal recommendation to any specific individual or any investment needs of an individual. The recommendations / statements / estimates / expectations / predictions are of general in nature and may not take into account the specific investment needs or risk appetite or financial situations of individual policyholder / clients. For more details on risk factors and terms and conditions, please read the sales brochure carefully before concluding the sale. Tax benefits are subject to changes in the tax laws.