సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
చిన్న వయసు వ్యక్తుల ఆర్థికపరమైన పోర్ట్‌ఫోలియోకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు చాలా ముఖ్యమైన జోడింపుగా ఉంటాయి. అంతేకాకుండా, తక్కువ ప్రీమియం మొత్తాన్ని పొందడానికి గాను సాధ్యమైనంత త్వరగా టర్మ్ ఇన్సూరెన్స్ కొనాలని కూడా సలహా ఇవ్వబడుతుంది. ఈ స్టేట్మెంట్లు చాలావరకు కచ్చితమైనవే అయినప్పటికీ, సీనియర్ సిటిజెన్లకు టర్మ్ ఇన్సూరెన్స్ అందుబాటు లేదనీ లేదా పదే పదే అందుబాటు ఉందని ఊహించడం తప్పు అవుతుంది.
ఇండియాలో, "సీనియర్ సిటిజెన్" అనే పదబంధం 60 ఏళ్ళ వయసు పైబడిన వ్యక్తులను సూచించడానికి ఉపయోగించబడుతుంది. ఈ వ్యక్తులు రిటైర్ అయినవారు, నెలవారీ జీతం వంటి ప్రాథమిక ఆదాయ మూలము కంటే పెన్షన్ లేదా పెట్టుబడి నుండి వచ్చిన ఆదాయంపై జీవిస్తుంటారని సాధారణంగా ఊహించబడుతుంది.
సీనియర్ సిటిజెన్లకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రత్యేకించి వృద్ధుల యొక్క ఆర్థికపరమైన ఆవశ్యకతలను తీరుస్తుంది. ఇది ముందుగా నిర్ణయించబడిన కాలావధి పాటు కవరేజీని అందిస్తుంది, పాలసీని కొనుగోలు చేసే సమయంలో సీనియర్ సిటిజెన్ వయస్సు మరియు వారి వాస్తవ రిటైర్మెంట్ వయస్సు ఆధారంగా దీనిని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ నామినీ/లబ్ధిదారుకు మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది, దీనిని ఏవైనా బకాయి ఉన్న అప్పులు లేదా ఖర్చులను (అంత్యక్రియల ఖర్చులు వంటివి) భరించడానికి ఉపయోగించుకోవచ్చు.
సీనియర్ సిటిజెన్ల కొరకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వారిపై ఆధారపడిన వారికి వారసత్వాన్ని వదిలి వెళ్ళడానికి ఒక మార్గం. ఇది వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు అయినా, వారి బాధ్యతలు ఏవైనా వారి ప్రియమైనవారికి, అవి భారంగా మారకుండా చూసుకోగలుగుతుంది.
అధిక భరోసా సొమ్ముతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం చూస్తున్నారా? మా ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు మరియు మరిన్నింటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?
సీనియర్ సిటిజెన్ల కోసం ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సహేతుకంగా సాధారణ టర్మ్ ప్లాన్ల మాదిరిగానే పనిచేస్తుంది. వారు దానికి అర్హులు అయి ఉంటే మాత్రం వృద్ధుల కోసం మీరు ఏదైనా రెగ్యులర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఒక సాధారణ ఆందోళన ఏమిటంటే వారు పాలసీ కోసం వయో అర్హత ప్రాతిపదికను తీర్చలేకపోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా పరిగణించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈ ప్లానులు నిర్దిష్ట వయస్సు దాటిన వారికి, సాధారణంగా 65 సంవత్సరాలు దాటిన వారి కోసం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండకపోవచ్చు. అయినప్పటికీ వివిధ ప్లానుల వ్యాప్తంగా ఈ ప్రాతిపదిక వ్యత్యాసంగా ఉండవచ్చు. ప్లాన్ యొక్క ప్రత్యేకతలను బట్టి, అందించబడే కవరేజ్ వ్యవధి 75 సంవత్సరాల వయస్సు సమీపం వరకూ పొడిగించబడవచ్చు.
ఒక సీనియర్ సిటిజెన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినప్పుడు, వారు తమపై ఆధారపడిన వారి కోసం ఒక ఆర్థిక సహాయ మూలమును అందిస్తున్నారన్నమాట. జీవిత బీమా చేయబడిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో, వారి నామినీ మరణ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు మరియు జీవిత బీమా చేయబడిన వ్యక్తి వదిలివెళ్ళిన బాధ్యతలను భరించడానికి కొంత మొత్తాన్ని అందుకోవచ్చు.
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యము?
వృద్ధులకు సర్వసాధారణంగా జీవిత బీమా పై అతి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అయినప్పటికీ, 65 ఏళ్ళ వయస్సు పైబడిన సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ముఖ్యమైనది కావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఆధారపడియున్నవారి పట్ల శ్రద్ధ తీసుకోవడం
మీరు మీ జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు లేదా మనవలు వంటి ఆధారపడిన ఇతరులతో కలిసి నివసిస్తుంటే, మీరు లేనప్పుడు వారి ఆర్థిక భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందవచ్చు. వృద్ధులైన వారి కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది దీనిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
ఒక వారసత్వాన్ని సృష్టించడం
ఒకవేళ పెద్దవయసు వ్యక్తి గనక తమ కుటుంబ సభ్యుల కోసం తన వెనక ఏదైనా వదిలివెళ్ళాలనుకుంటే, వారు టర్మ్ ఇన్సూరెన్స్ ని ఉపయోగించుకోవచ్చు మరియు అనేకమంది నామినీలను పేర్కొనవచ్చు.
రైడర్ల ద్వారా ఆరోగ్య మద్దతు
మీరు ఇప్పటికే ఉన్నదానికంటే ఎక్కువగా ఇతరులపై ఆధారపడేలా చేసే జీవిత అనిశ్చితులకు క్లిష్టమైన అనారోగ్యం మరియు ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్య ప్రయోజనం వంటి రైడర్లు టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక మద్దతును ఏర్పాటు చేయడంలో మీకు సహాయపడగలుగుతాయి.
ఒకవేళ మీరు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌తో టర్మ్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకుంటే, వర్తించే ఛార్జీలను తగ్గించుకొని మీరు ప్లాన్‌కి చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని కూడా మీరు ఆశించవచ్చు.
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అంశాలు
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు, మీ పాలసీలో ఉండగలిగినట్టి కొన్ని ముఖ్య ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి.
పాలసీ క్రింద బీమా చేయబడిన వ్యక్తికి జీవిత రక్షణ అనేది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క ప్రాథమిక ఫీచర్ అయి ఉంటుంది. ఇది జీవిత బీమా పొందిన వ్యక్తి జీవించియున్న వారి కోసం వదిలివేస్తున్న అప్పుల గురించి చింతించకుండా ఉండడానికి వీలు కలిగిస్తుంది.
ఒకవేళ పాలసీదారు గనక పాత పన్ను వ్యవస్థ ప్రకారం పన్ను చెల్లింపుదారు అయి ఉంటే, వారు చెల్లించిన ప్రీమియములకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోగలుగుతారు. పాలసీ నుండి అందుకున్న ప్రయోజనాలు ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను నిబంధనల ప్రకారం మినహాయింపులకు కూడా అర్హత కలిగి ఉండవచ్చు.
నిర్వచించబడిన కవరేజ్ వ్యవధి
టర్మ్ ప్లాన్లు అనేవి పాలసీదారు ఎంచుకున్న పరిమిత కాలావధికి కవరేజీని అందించడానికి పేరు గాంచాయి. కాబట్టి, జీవిత బీమా చేయబడిన వ్యక్తికి ఒక నిర్దిష్ట కాలానికి గనక కర్తవ్య బాధ్యతలు ఉంటే, వారు తదనుగుణంగా కవరేజీని ఎంచుకోవచ్చు.
లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది నేడు అత్యంత సరసమైన జీవిత కవర్ ఎంపికలలో ఒకటిగా పరిగణించబడుతోంది. పరిమితమైన ఆదాయ మూలములపై జీవిస్తున్న సీనియర్ సిటిజెన్లు, తక్కువ ఖర్చుతో కూడుకున్న రేట్లకు ముఖ్య కవరేజీని అందించే ప్లానులను ఎంచుకోవడం మంచిది.
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
సీనియర్ సిటిజెన్లకు టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
సంపూర్ణ జీవిత బీమాతో పోలిస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత సరసమైనది, ఇది సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంటుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ముక్కుసూటి స్వభావం - మరణ ప్రయోజనంతో నిర్దిష్ట కాలానికి కవరేజ్ - అర్థం చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి సులభతరం చేస్తుంది.
ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఏదీ ఉండదు
కొన్ని ఇతర జీవిత బీమా పాలసీలుమాదిరిగా టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఎలాంటి మార్కెట్-అనుసంధానిత ఇన్వెస్ట్మెంట్లు ఉండవు, రిస్క్ తగ్గుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ దిశగా చెల్లించబడిన ప్రీమియంలు అదనపు ఆర్థికపరమైన ఊరటను అందిస్తూ వర్తించే పన్ను చట్టాల క్రింద పన్ను మినహాయింపులకు అర్హమైనవిగా ఉండవచ్చు.
పాలసీదారు తాను లేనప్పుడు తమ ప్రియమైనవారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరనే ఒక రకమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు.
సరియైన సీనియర్ సిటిజెన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎలా?
ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం చూస్తున్న పెద్ద వయస్సు వ్యక్తి అయి ఉంటే, మనసులో ఉంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
కవరేజీ అవసరాలను మదింపు చేసుకోండి
కవరేజ్ మొత్తాన్ని ఎంచుకునేటప్పుడు ఇప్పటికే ఉన్న అప్పులు, ఆర్థిక బాధ్యతలు మరియు ఆధారపడిన వారి జీవనశైలి అవసరాలను పరిగణన లోనికి తీసుకోండి.
పాలసీ కాలావధి మీ వయస్సు మరియు ఆరోగ్య స్థితికి అనువుగా ఉండేలా నిర్ధారించుకోండి. పెద్ద వయస్సు వ్యక్తులకు తక్కువ కాలావధులు మరింత సముచితంగా ఉండవచ్చు.
విభిన్న బీమాదారు సంస్థల నుండి ప్రీమియములను పోల్చి చూసుకోవడానికై టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలికులేటర్ ని ఉపయోగించండి మరియు మీ బడ్జెట్‌కు సరిపోయే ఒకదానిని ఎంపిక చేసుకోండి.
బీమాదారు సంస్త్ఘ యొక్క పేరుప్రతిష్టలను విశ్లేషించుకోండి
విశ్వసనీయతను నిర్ధారించుకోవడానికి మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మరియు సానుకూల కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఉన్న బీమాదారు సంస్థను ఎంచుకోండి.
కొన్ని పాలసీలకు వైద్య పరీక్ష అవసరం కావచ్చు, మరికొన్ని పాలసీలు అది లేకుండానే కవరేజ్‌ను అందించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఈ ఎంపికలను మదింపు చేసుకోండి.
మీ కవరేజీని పెంపొందించుకోవడానికి గాను, క్లిష్టమైన అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు మరణ ప్రయోజనం వంటి అదనపు రైడర్ల కోసం చూడండి.
సీనియర్ సిటిజెన్ల కొరకు టర్మ్ ఇన్సూరెన్స్ తో అందుబాటులో ఉన్న రైడర్లు ఏవేవి?
-
- క్లిష్టమైన అనారోగ్యం రైడర్: పాలసీదారుకు గనక క్యాన్సర్ లేదా గుండె జబ్బు వంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు వ్యాధినిర్ధారణ అయితే, ఒక ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.
- ప్రమాద మరణం రైడర్: పాలసీదారు ప్రమాదం కారణంగా మరణిస్తే ఒక అదనపు మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది.
- వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్: ఒకవేళ పాలసీదారు శాశ్వతంగా వైకల్యానికి గురైతే లేదా తీవ్ర అనారోగ్యానికి గురైతే భవిష్యత్ ప్రీమియంలను మాఫీ చేస్తుంది.
- ఆదాయ ప్రయోజన రైడర్: పాలసీదారు మరణం తర్వాత ఒక నిర్దిష్ట కాలం పాటు కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తుంది.
- ఆసుపత్రి నగదు రైడర్: వైద్య ఖర్చులను భరించడంలో సహాయపడుతూ, ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారీ నగదు ప్రయోజనాలను అందిస్తుంది.
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన విషయాలు ఏవేవి?
మా ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌తో ప్రీమియం అంచనాలను పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనడానికి గరిష్ట వయస్సు ఏది?
ఇది సాధారణంగా బీమాదారు సంస్థను బట్టి 65 నుండి 75 సంవత్సరాల వ్యాప్తిలో ఉంటుంది.
అవసరమైన జీవిత వర్తింపును మీరు ఎలా నిర్ణయిస్తారు?
ఇది మీ ఆర్థికపరమైన కర్తవ్య బాధ్యతలు, ఉన్న అప్పులు మరియు మీపై ఆధారపడిన వారి భవిష్యత్తు అవసరాలపై ఆధారపడి ఉండాలి. సముచితమైన భరోసా సొమ్మును అంచనా వేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించాల్సిందిగా సలహా ఇవ్వబడుతుంది.
సీనియర్ సిటిజెన్ల కొరకు అత్యుత్తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా కొనుగోలు చేయాలి?
ప్రీమియం, కవరేజ్, పాలసీ కాలవ్యవధి మరియు అదనపు ప్రయోజనాల ఆధారంగా వివిధ ప్లానులను పోల్చుకోండి. సమగ్రమైన మదింపు కోసం ఆన్లైన్ పోలిక సాధనాలను ఉపయోగించడాన్ని పరిగణించండి.
సీనియర్ సిటిజెన్ల కొరకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమును ప్రభావితం చేసే కొన్ని కీలక కారకాంశాలు ఏమిటి?
ముఖ్యమైన కారకాంశాలలో వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి అలవాట్లు (ధూమపానం వంటివి) మరియు ఎంచుకున్న భరోసా సొమ్ము ఇమిడి ఉంటాయి. ఒక వైద్య పరీక్ష కూడా ప్రీమియమును ప్రభావితం చేయవచ్చు
సీనియర్ సిటిజెన్ టర్మ్ ప్లానులు రెగ్యులర్ ఆదాయ చెల్లింపు ఎంపికతో వస్తాయా?
అవును, కొన్ని సీనియర్ సిటిజెన్ టర్మ్ ప్లానులు రెగ్యులర్ ఆదాయ చెల్లింపు ఎంపికను అందిస్తాయి, ఇది వాయిదాలలో మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది, లబ్ధిదారులకు నిరంతర ఆర్థిక సహాయం ఉండేలా చూసుకుంటుంది.
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పొందడానికి అత్యంత పెద్ద వయస్సు ఏది?
సీనియర్ సిటిజెన్ల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పొందడానికి అత్యంత పెద్ద వయస్సు మామూలుగా దాదాపు 75 సంవత్సరాలు, అయినా ఇది బీమాదారును బట్టి మారవచ్చు.