విజన్
‘‘కస్టమరును నిజంగా సంతోషపెట్టేందుకు తన వాటాదారులందరికీ గణనీయమైన విలువ అందించే జీవిత బీమా మరియు పెన్షన్ బిజినెస్ లీడర్ కావడం’’

మా గురించి
2010లో అప్పటి భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, భారతదేశంలోని అత్యంత యువ జీవిత బీమా కంపెనీల్లో ఒకటి. ముంబయిలో ప్రధాన కార్యాలయం గల ఈ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా 1000కి పైగా నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా (44% వాటా), ఆంధ్రా బ్యాంక్ (30% వాటా) మరియు యుకెలోని అగ్రగామి రిస్కు, వెల్త్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ లీగల్ మరియు జనరల్ గ్రూప్ (26% వాటా) మధ్య జాయింట్ వెంచర్. మా ప్రమోటర్లు 300 సంవత్సరాలకు పైగా ప్రపంచం యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుతోంది మరియు మాకు 8000+ బ్రాంచిలతో కూడిన నెట్వర్కుకు మరియు భారతదేశ వ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా కస్టమర్లతో యాక్సెస్ కల్పిస్తోంది.

మమ్మల్ని భిన్నంగా చేసేది ఏమిటి?
బ్యాంకింగ్, వెల్త్ మరియు ఆర్థిక మేనేజ్మెంటులో మాకు గల అపార అనుభవం కస్టమర్ల యొక్క అవసరాలను లోతుగా అర్థంచేసుకునేందుకు మాకు వీలు కల్పిస్తోంది. ఆరోగ్యం, రక్షణ, రిటైర్మెంట్, సేవింగ్స్ మరియు సంపద లాంటి ఈ నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రొడక్టులను అభివ్రుద్ధి చేసేందుకు ఇది మాకు సహాయపడింది. క్రెడిట్ లైఫ్, టర్మ్ మరియు ఉద్యోగుల బాధ్యత (గ్రాట్యుటి మరియు సెలవులు నగదులోకి మార్చుకోవడం) ప్లాన్స్ లాంటి గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రొడక్టుల శ్రేణిని కూడా మేము అందిస్తాము. మా ప్రొడక్టులను అర్థంచేసుకోవడం సులభం మరియు పోటీ ధర నిర్ణయించబడింది. సంస్క్రుతి

సంస్క్రుతి

ఉత్తమమైన వాటిపై నమ్మకం
మేము ఉత్తమమైనవి హైర్ చేసుకుంటాము దీనివల్ల మేము మా కస్టమర్లకు ఉత్తమమైనవి అందిస్తాము. వినూత్నమైన ఆర్థిక పరిష్కారాలు అందించేందుకు కొలాబరేట్ చేసే విభిన్న నేపథ్యాలు గల మేధావులు మా టీములో ఉన్నారు. వ్యక్తి యొక్క అనుభవం కంటే అతనిలో/ఆమెలో ఉన్న శక్తిసామర్థ్యాలను మేము నమ్ముతాము. ఇది పనిచేసే వాతావరణాన్ని ఉద్దీపనం చేస్తుంది.

ముఖ్యమైన పనులు మేము చేస్తాము
మా మనుగడలో ప్రజలు (అంతర్గతంగా మరియు బాహ్యంగా) కేంద్ర బిందువుగా ఉంటారు. మా హెచ్ ఆర్ పాలసీలు మరియు ప్రక్రియలు ‘ఉద్యోగులు మొదట’ వైఖరి కేంద్రంగా రూపొందించబడ్డాయి. కంపెనీ ప్రారంభించబడిన మొదటి సంవత్సరంలో ఐఎస్ఒ 9001:2008 సర్టిఫికేషన్ పొందడానికి ఈ ప్రక్రియలు మాకు సహాయపడ్డాయి.