ప్రవేశ వయస్సు (చివరి జన్మదినం నాటికి)
- Answer
-
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 65 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
పాలసీ అవధికి సమానం
పాలసీ మొదట్లో ఒక్క-సారి ప్రీమియం
సంవత్సరం వారీ, అర్ధ సంవత్సరం వారీ, నెలవారీ, సింగిల్
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది, ఏవైనా అనూహ్య సంఘటనలు జరిగిన పక్షములో మీ కుటుంబ ఆర్థిక శ్రేయస్సును పదిలపరచడం గురించి అనుసంధానితం-కాని, నాన్- పార్టిసిపేటింగ్, వ్యక్తిగతమైన ఒక శుద్ధ అవధి బీమా పాలసీ. జీవన్ సరల్ బీమా క్రింద కవర్ చేయబడి ఉన్న మీకు ఏదైనా జరిగితే, మీ ప్రియమైన వారికి అవసరమైనట్టి ఆర్థిక సహాయాన్ని వారికి అందేలా చూసుకుంటూ ఏకమొత్తంలో ప్రయోజనం వారికి అందుతుంది.
ప్రమాద సంఘటన కారణంగా మరణం సంభవించి ఉంటే తప్ప, రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి 45 రోజుల వేచి ఉండే వ్యవధి ఉంది. వేచి ఉండే వ్యవధిలో ప్రమాద సంఘటన కారణంగా జీవిత బీమా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో, కనబరచిన మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది.
వేచి ఉండే వ్యవధిలో ప్రమాద సంఘటన కారణంగా కాకుండా ఇతరత్రా జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణం సంభవించినట్లయితే, పన్నులు ఏవైనా ఉంటే మినహాయించి అన్ని ప్రీమియంలలో 100%కి సమానమైన మొత్తం మరణ ప్రయోజనంగా చెల్లించబడి మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.
i) వేచి ఉండే వ్యవధిలో జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించినప్పుడు మరియు పాలసీ అమలులో ఉన్న పక్షములో, ఏకమొత్తంగా చెల్లించదగిన మరణ ప్రయోజనం ఇలా ఉంటుంది:
(1) ప్రమాదసంఘటనలో మరణించిన సందర్భంలో, రెగ్యులర్ ప్రీమియం లేదా పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీ కోసం, మరణంపై భరోసా సొమ్ముకు సమానంగా, దీనికి అత్యధికమైనదిగా ఉంటుంది:
(a) వార్షికం చేయబడిన ప్రీమియంకి 10 రెట్లు, లేదా
(b) మరణించిన తేదీ నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియముల యొక్క 105%, లేదా
(c) పాలసీ యొక్క ప్రారంభంలో పాలసీదారుచే ఎంచుకోబడినట్లుగా మరణంపై భరోసా ఇవ్వబడిన సంపూర్ణ మొత్తము
(2) ప్రమాదసంఘటనలో మరణించిన సందర్భంలో, సింగిల్ ప్రీమియం పాలసీ కోసం, మరణంపై భరోసా సొమ్ముకు సమానంగా, దీనికి అధికమైనదిగా ఉంటుంది:
(a) సింగిల్ ప్రీమియం యొక్క 125% లేదా
(b) పాలసీ యొక్క ప్రారంభంలో పాలసీదారుచే ఎంచుకోబడినట్లుగా మరణంపై భరోసా ఇవ్వబడిన సంపూర్ణ మొత్తము
(3) ప్రమాద సంఘటనలో కాకుండా ఇతరత్రా కారణాల వల్ల మరణిస్తే, పన్నులు మినహా చెల్లించిన అన్ని ప్రీమియంల యొక్క 100%కి మరణ ప్రయోజనం సమానంగా ఉంటుంది.
ii) వేచి ఉండే వ్యవధి గడువు ముగిసిన తర్వాత, అయితే మెచ్యూరిటీ యొక్క నిర్ణీత గడువు తేదీకి ముందు మరియు పాలసీ అమలులో ఉండగా, జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణించిన పక్షములో, ఒక ఏకమొత్తంగా చెల్లించాల్సిన మరణ ప్రయోజనం మొత్తము:
(1) రెగ్యులర్ ప్రీమియం లేదా పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీ కోసం, "మరణంపై భరోసా సొమ్ము", దీనికి అత్యధికమైనదిగా ఉంటుంది:
(a) వార్షికం చేయబడిన ప్రీమియంకి 10 రెట్లు; లేదా
(b) మరణించిన తేదీ నాటికి చెల్లించబడిన మొత్తం the ప్రీమియముల యొక్క 105%; లేదా
(c) పాలసీ యొక్క ప్రారంభంలో పాలసీదారుచే ఎంచుకోబడినట్లుగా మరణంపై భరోసా ఇవ్వబడిన సంపూర్ణ మొత్తము
(2) సింగిల్ ప్రీమియం పాలసీ కోసం, "మరణంపై భరోసా సొమ్ము" కు సమానంగా, దీనికి అధికమైనదిగా ఉంటుంది:
(a) సింగిల్ ప్రీమియం యొక్క 125% లేదా
(b) పాలసీ యొక్క ప్రారంభంలో పాలసీదారుచే ఎంచుకోబడినట్లుగా మరణంపై భరోసా ఇవ్వబడిన సంపూర్ణ మొత్తము, అండర్‌రైటింగ్ నిర్ణయం మరియు రైడర్ ప్రీమియం(లు) ఏవైనా ఉంటే, వాటి కారణంగా పాలసీ క్రింద వసూలు చేయదగిన అదనపు మొత్తాన్ని చేరి ఉండకూడదు.
మరణంపై చెల్లించాల్సిన సంపూర్ణ భరోసా మొత్తము ప్రాథమిక భరోసా మొత్తానికి సమానంగా ఉంటుంది.
లేదు, ఈ పాలసీలో లోన్ అనుమతించబడదు
మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి 5 సంవత్సరాలు పునరుద్ధరణ వ్యవధిగా ఉంటుంది లేదా పాలసీ అవధి గడువు ముగిసే లోపున ఏది రెగ్యులర్/పరిమిత ప్రీమియం పాలసీల క్రింద ముందుగా వస్తే అది.
బోర్డు ఆమోదించిన పూచీకత్తు విధానం ప్రకారం, అవసరమైతే, మొదటి చెల్లించని ప్రీమియం యొక్క గడువు తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున లేదా పాలసీ గడువు ముగిసే లోపున ఏది ముందుగా వస్తే దాని ప్రకారం ఆరోగ్యానికి సంబంధించిన సంతృప్తికరమైన సాక్ష్యాధారాల సమర్పణకు లోబడి, అన్ని బకాయిల ప్రీమియంను ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించడం ద్వారా మీరు పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.
బోర్డు ఆమోదించిన పూచీకత్తు విధానం ప్రకారం పునరుద్ధరణ కొరకు సమర్పించినట్టి అభ్యర్థనలను తిరస్కరించే హక్కు బీమా కంపెనీకి ఎల్లప్పుడూ ఉంటుంది. పూచీకత్తు / మెడికల్స్ యొక్క ఖర్చు, ఏదైనా ఉంటే, దానిని మీరే భరిస్తారు.
గమనిక: పునరుద్ధరణ వడ్డీ రేటు యొక్క లెక్కింపు ప్రాతిపదికలో ఏదైనా మార్పు ఐఆర్‌డిఎఐ నుండి ముందస్తు ఆమోదమునకు లోబడి ఉంటుంది. పాలసీ పునరుద్ధరణపై వేచి ఉండే వ్యవధి వర్తించబోదు. పాలసీ యొక్క పునరుద్ధరణపై వేచి ఉండే వ్యవధి వర్తించదు.
ఔను, మీరు మీ పాలసీని ఫ్రీ-లుక్ వ్యవధి లోపున తిరిగి ఇవ్వవచ్చు.
పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులు వేటినైనా సమీక్షించడానికి గాను పాలసీ డాక్యుమెంటు అందిన తేదీ నుండి మీకు 15 రోజుల (ఎలక్ట్రానిక్ పాలసీలు మరియు సుదూర రూపం ద్వారా పొందబడిన పాలసీల విషయంలో 30 రోజులు) ఫ్రీ-లుక్ వ్యవధి ఉంటుంది, మరియు ఆ నిబంధనలు మరియు షరతులలో మీరు (పాలసీదారు) అంగీకరించని చోట, ఆ అభ్యంతరానికి కారణాలను పేర్కొంటూ, పాలసీని రద్దు చేయడానికి గాను పాలసీని కంపెనీకి తిరిగి ఇచ్చే అవకాశం మీకు ఉంటుంది. ప్రతిపాదకుల యొక్క వైద్య పరీక్ష కోసం కంపెనీ చేసే ఖర్చులు మరియు స్టాంప్ డ్యూటీ ఛార్జీలను మరియు కవర్ కాలానికి దామాషా రిస్క్ ప్రీమియం తగ్గింపుకు లోబడి మాత్రమే చెల్లించిన ప్రీమియంని తిరిగి పొందడానికి మీరు అర్హులుగా ఉంటారు.
పాలసీ యొక్క ఫ్రీ లుక్ రద్దు చేయడం కోసం కంపెనీచే అందుకోబడిన అట్టి అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది మరియు పైన పేర్కొనబడినట్లుగా అభ్యర్థన అందిన 15 రోజుల లోపున ప్రీమియం రీఫండ్ చేయబడుతుంది.
ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత పాలసీ ముగుస్తుంది మరియు ఈ పాలసీ క్రింద ఉన్న అన్ని హక్కులు, ప్రయోజనాలు మరియు ఆసక్తులు నిలిచిపోతాయి. సుదూర మార్కెటింగ్ యందు విజ్ఞాపన యొక్క ప్రతీ చర్య (లీడ్ జనరేషన్‌తో సహా) మరియు ఈ క్రింది రూపాల ద్వారా బీమా ఉత్పత్తుల విక్రయం యొక్క ప్రతి కార్యాచరణ చేరి ఉంటుంది: (i) వాయిస్ రూపం, ఇందులో టెలిఫోన్ చేయడం ఉంటుంది; (ii) సంక్షిప్త సందేశ సేవ (SMS); (iii) ఎలక్ట్రానిక్ రూపం, ఇందులో ఇ-మెయిల్, ఇంటర్నెట్ మరియు ఇంటరాక్టివ్ టెలివిజన్ (DTH); (iv) నేరుగా తపాలా మెయిల్ మరియు వార్తాపత్రిక మరియు మ్యాగజైన్ చేర్పులను కలిగి ఉండే భౌతిక రూపం; మరియు, (v) స్వయంగా కాకుండా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా విజ్ఞాపన.
అవును, మీ పాలసీని రద్దు చేసుకునే వెసులుబాటు మీకు ఉంటుంది. పాలసీ రద్దు అయిన మీదట ఈ క్రింది ప్రయోజనం చెల్లించబడుతుంది:
రెగ్యులర్ ప్రీమియం | పాలసీ రద్దు విలువ ఏదీ చెల్లించబడదు |
---|---|
పరిమిత ప్రీమియం |
|
సింగిల్ ప్రీమియం | సింగిల్ ప్రీమియం పాలసీ కోసం సింగిల్ ప్రీమియం చెల్లించిన తర్వాత (అదనపు ప్రీమియం, ఏదైనా ఉంటే) మరియు మెచ్యూరిటీ యొక్క నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీ, రద్దు విలువను వెంటనే పొందుతుంది. ఇది ఈ క్రింది విధంగా లెక్క కట్టబడుతుంది: 70% X చెల్లించిన సింగిల్ ప్రీమియం X ((గడువు ముగియని అవధి) / (అసలు పాలసీ అవధి) |
**పాలసీ రద్దు విలువ యొక్క లెక్కింపు కోసం చెల్లించిన మొత్తం ప్రీమియంలు, ఏవైనా ఉంటే అదనపు ప్రీమియంలను కలుపుకొని ఉంటాయి.
సిగిల్ ప్రీమియం అనేది ఏదైనా అదనపు ప్రీమియం ఉంటే దానిని కలుపుకొని ఉంటుంది
ఇది ఒక శుద్ధమైన రక్షణ పాలసీ అయినందున, ఈ పాలసీలో ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనం వర్తించదు.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను# చట్టాల ప్రకారము పన్ను# ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. ఈ పాలసీని కొనుగోలు చేసే ముందుగా దయచేసి మీ పన్ను# సలహాదారుడిని సంప్రదించండి.
రెగ్యులర్ ప్రీమియం మరియు పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీల విషయంలో, ఈ పాలసీకి సంబంధించి మొదటి రెండు వరుస పూర్తి సంవత్సరాలకు ప్రీమియం చెల్లించకపోతే, మరియు తదుపరి ఏదైనా ప్రీమియం సక్రమంగా చెల్లించనట్లయితే, మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి కారుణ్య వ్యవధి గడువు ముగిసిన తర్వాత అన్ని ప్రయోజనాలు నిలిపివేయబడతాయి, మరియు ఏమీ చెల్లించబడదు, మరియు అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలు కూడా ఆయా ఉదంతమును బట్టి తిరిగి వాపసు చేయబడవు. వరుసగా రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియంల చెల్లింపు తర్వాత, సెక్షన్ 12లో కనబరచియున్న విధంగా పాలసీ రద్దు విలువ చెల్లించబడుతుంది.
రెగ్యులర్ మరియు పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీల విషయంలో మాత్రమే మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము. ప్రీమియం చెల్లింపు రూపం వార్షికంగా లేదా అర్ధ వార్షికంగా ఉన్నప్పుడు 30 రోజుల కారుణ్య వ్యవధి మరియు నెలవారీ అయితే 15 రోజులుగా, ప్రతి పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు కోసం అనుమతించబడుతుంది. ఒకవేళ కారుణ్య వ్యవధి రోజుల గడువు ముగిసే లోపున ప్రీమియం చెల్లించకపోతే, పాలసీ లాప్స్ అవుతుంది.
కారుణ్య వ్యవధి లోపున, అయితే అప్పటికి బకాయీగా చెల్లించాల్సిన తదుపరి ప్రీమియం చెల్లింపుకు ముందే జీవిత భరోసా పొందిన వ్యక్తి మరణం సంభవించినట్లయితే, పాలసీ అప్పటికీ చెల్లుబాటులో ఉంటుంది మరియు మరణించిన తేదీ నుండి మరియు తదుపరి పాలసీ వార్షికోత్సవానికి ముందు సదరు చెల్లించని ప్రీమియం మరియు బ్యాలెన్స్ ప్రీమియం(లు) ఏవైనా ఉంటే, వాటిని తగ్గించుకున్న తర్వాత ప్రయోజనాలు చెల్లించబడతాయి.
మీ పాలసీ ప్రయోజనాలు అన్నీ ఈ కారుణ్య వ్యవధిలో కొనసాగుతాయి మరియు పాలసీ అమలులో ఉన్నట్లుగానే పరిగణించబడుతుంది.
a) రెగ్యులర్/ పరిమిత చెల్లింపు పాలసీల కొరకు:
జీవిత భరోసా పొందిన వ్యక్తి, జీవన్ సరల్ బీమా క్రింద గనక, రిస్క్ లేదా పునరుద్ధరణ తేదీ ప్రారంభమైన 12 నెలల లోపున ఆత్మహత్యకు పాల్పడితే, మరియు పాలసీ అమల్లోనే ఉంటే, అది శూన్యం అవుతుంది. అటువంటి ఉదంతాలలో, మరణించిన తేదీ వరకు చెల్లించిన 80% ప్రీమియంలను తిరిగి చెల్లించడం మినహా కంపెనీ ఎలాంటి క్లెయిమును ప్రక్రియ జరపదు (అండర్‌రైటింగ్ నిర్ణయాలు, పన్నులు మరియు రైడర్ ప్రీమియంలు ఏవైనా ఉంటే, వాటి కారణంగా అదనపు ఛార్జీలు మినహాయించి). ఈ క్లాజు ల్యాప్స్ అయిన పాలసీలకు వర్తించదు, ఎందుకంటే వాటి కోసం ఎటువంటి చెల్లింపులూ చేయబడలేదు.
b) సింగిల్ ప్రీమియమ్ పాలసీల కొరకు:
రిస్క్ ప్రారంభమైన 12 నెలల లోపున జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక ఆత్మహత్యకు పాల్పడితే ఈ జీవన్ బీమా పాలసీ చెల్లుబాటు కాదు. అటువంటి ఉదంతాలలో, పూచీకత్తు నిర్ణయాలు మరియు రైడర్ ప్రీమియంల కారణంగా ఏవైనా అదనపు ఛార్జీలు మినహాయించి, చెల్లించిన సింగిల్ ప్రీమియంలోని 90% రీఫండ్ చేయడం తప్ప కంపెనీ ఎటువంటి క్లెయిములనూ పట్టించుకోదు.
ఈ దిగువన మేము 25 సంవత్సరాల పాలసీ కాలావధి కోసం కొంత నమూనా వార్షిక ప్రీమియం మొత్తం లెక్కను (రెగ్యులర్ ప్రీమియం) మరియు మీకు సిద్ధంగా ఉండే సూచిక కోసం రు. 10,00,000 భరోసా సొమ్ము లెక్కను ఇచ్చాము –
వయస్సు/పాలసీ అవధి | వార్షిక ప్రీమియం |
---|---|
25 | 3,160 |
30 | 4,040 |
35 | 5,750 |
40 | 8,460 |
45 | 12,620 |
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము 1938 యొక్క సెక్షన్ 45 యొక్క నిబంధనలను అనుసరించి మోసం, తప్పు ప్రకటన అనేదానితో వ్యవహరించబడుతుంది.
ఎప్పటికప్పుడు కాలానుగుణంగా సవరించబడే బీమా చట్టము యొక్క సెక్షన్ 45 ఇలా చెబుతుంది
1) పాలసీ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత, అంటే, పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే దాని నుండి ఎటువంటి జీవిత బీమా పాలసీ ప్రశ్నించబడదు.
2) బీమా యొక్క ఒక పాలసీని మోసము ఆధారంగా పాలసీ యొక్క బీమా తేదీ నుండి లేదా ముప్పు వర్తింపు ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ యొక్క పునరుద్ధరణ తేదీ నుండి లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి ఏది తర్వాత వస్తే అప్పటి నుండి మూడు సంవత్సరాల వ్యవధి లోపున ఏ సమయములోనైనా ప్రశ్నించవచ్చు: అప్పుడు, దేని ఆధారంగా అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
3) సబ్ సెక్షన్ (2)లో ఏది ఎలా ఉన్నప్పటికిన్నీ, బీమా చేసిన వ్యక్తి తనకు అత్యుత్తమంగా తెలిసిన మేరకు మరియు నమ్మకం మేరకు ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా చెప్పడం లేదా అణచివేయడం నిజమని నిరూపించగలిగితే, లేదా వాస్తవాన్ని అణిచివేయడానికి ఏ విధమైన ఉద్దేశపూర్వక ఉద్దేశ్యం లేదని లేదా ఒక వాస్తవిక సత్యాన్ని తప్పుగా పేర్కొనడం లేదా అణచివేయడం బీమాదారుకు తెలిసి జరగలేదని నిరూపితమైనప్పుడు ఏ బీమాదారు కూడా మోసం ఆధారాలపై జీవిత బీమా పాలసీని తిరస్కరించరు: ఒకవేళ మోసం జరిగియున్న పక్షములో, పాలసీదారు జీవించిలేని సందర్భములో, వాటిని తిరస్కరించే బాధ్యత లబ్ధిదారులపై ఉంటుంది.
4) ఒక జీవిత బీమా పాలసీని పాలసీ జారీ చేయబడిన తేదీ లేదా రిస్క్ మొదలైన తేదీ లేదా పాలసీ పునరుద్ధరణ జరిగిన తేదీ లేదా పాలసీకి రైడర్ యొక్క తేదీ నుండి మూడు సంవత్సరాల లోపున ఏది తర్వాత వస్తే దాని ప్రకారం, బీమా చేయబడిన వ్యక్తి యొక్క జీవిత కాలపు అంచనాకు సంబంధించిన ఏదైనా వాస్తవ ప్రకటన లేదా వాస్తవ సత్యం పాలసీ జారీ చేయబడిన లేదా పునరుద్ధరించబడిన లేదా రైడర్ జారీ చేయబడిన ప్రతిపాదన పత్రము లేదా ఇతర పత్రములో తప్పుగా చేయబడిందని లేదా త్రొక్కిపెట్టబడిందనే ఆధారాలతో ఎప్పుడైనా ప్రశ్నార్ధకమవుతుంది: అప్పుడు, దేని ఆధారంగా జీవిత బీమా పాలసీ తిరస్కరించాలనే అటువంటి నిర్ణయం చేయబడిందో అందుకు ఆధారాలు మరియు వస్తుసామాగ్రిని బీమాదారు బీమా చేసిన వ్యక్తికి లేదా చట్టపరమైన ప్రతినిధులకు లేదా నామినీలు లేదా బీమా చేసిన వ్యక్తి యొక్క అసైనీలకు వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది: ఇంకా తదుపరి, మోసం జరిగిందనే ఆధారంగా కాకుండా, తప్పుగా పేర్కొనడం లేదా వాస్తవ సత్యాన్ని త్రొక్కిపెట్టి ఉంచడం వల్ల పాలసీని తిరస్కరించిన పక్షంలో, అలా తిరస్కరించబడిన తేదీ వరకు పాలసీపై వసూలు చేసిన ప్రీమియములు అటువంటి తిరస్కరణ తేదీ నుండి తొంభై రోజుల వ్యవధి లోపున బీమా చేయబడిన వ్యక్తికి లేదా బీమా చేయబడిన వ్యక్తి యొక్క చట్టబద్ధ ప్రతినిధులు లేదా నామినీలు లేదా అసైనీలకు చెల్లించబడతాయి.
5) ఈ విభాగంలోని ఏదీ కూడా, వయస్సు ఋజువు కోసం ఏ సమయంలో అయినా కాల్ చేయడానికి బీమాదారు అర్హత కలిగి ఉన్నట్లయితే, పాలసీని ప్రశ్నించకుండా వారిని నిరోధించదు మరియు పాలసీ నిబంధనల కారణంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క వయస్సును ప్రతిపాదనలో తప్పుగా పేర్కొనబడినట్లు తదనంతర ఋజువుపై సర్దుబాటు చేయబడినంత మాత్రాన ఏ పాలసీ ప్రశ్నార్థకమైనట్లుగా భావించబడదు.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
హామీతో కూడిన ప్రయోజనాలు, తక్కువకాలం చెల్లింపు వ్యవధులు, లైఫ్ కవర్ మరియు అదనపు ప్రయోజనాలతో మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రత కోసం ఒక సమీకృతమైన సేవింగ్స్ ప్లాన్.
అన్నీ వీక్షించండి
Disclaimer
#Tax benefits may be available on the premiums paid and benefits received as per prevailing tax laws.