మెచ్యూరిటీ వయస్సు
- Answer
-
పిటి 10 సంవత్సరాలు: 55 సంవత్సరాలు
పిటి 15 సంవత్సరాలు: 65 సంవత్సరాలు
మీకు సరియైన సమయమేదో మాకు తెలియజేయండి.
జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి
మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.
మగ
ఆడ
ఇతరము
మీ వివరాలను సమర్పించినందుకు ధన్యవాదాలు
మా సేవలను మెరుగుపరచడానికి మరియు పెంపొంచడానికి మాకు సహాయపడటంలో మీ సలహాసూచనలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.
మీ ప్లాన్‌ని దర్శించండి
పిటి 10 సంవత్సరాలు: 55 సంవత్సరాలు
పిటి 15 సంవత్సరాలు: 65 సంవత్సరాలు
పిటి 10 సంవత్సరాలు: 45 సంవత్సరాలు
పిటి 15 సంవత్సరాలు: 50 సంవత్సరాలు
*పిటి - కాలవ్యవధి
18 సంవత్సరాలు
10/15 సంవత్సరాలు
5 సంవత్సరాలు
₹1000
₹10,000 నుండి ₹2 లక్షలు*
*బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ ప్రకారము
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
అంతరాయం లేని ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ నుండి సమీకృతమైన వైద్య పరీక్షల వరకూ, నాకు అంతరాయం లేని ప్రయాణం జరిగేలా ఇండియాఫస్ట్ లైఫ్ చూసుకొంది. నేను కొనుగోలు చేసిన ప్లాన్ యొక్క ఫీచర్లు భవిష్యత్తు కోసం నాకు మనశ్శాంతిని అందిస్తూ నా ఆకాంక్షల మేరకు ఉన్నాయి
మోహిత్ అగర్వాల్
(ముంబా, 21వ తేదీ, మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవం
ఇండియాఫస్ట్ లైఫ్ వారి జీవిత-బీమా పాలసీ కొనుగోలు చేయడం అనేది నాకు ఆహ్లాదకరమైన ప్రయాణముగా ఉండినది. కంపెనీ ప్రతినిధితో విసుగు లేని స్వభావముతో కూడిన సంభాషణ ఒక గొప్ప అనుభూతి మరియు అది వారి పాలసీ ప్లానులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫీచర్లను కలిగి ఉంది
సత్యం నాగ్వేకర్
(ముంబై, 22వ తేదీ మార్చ్ 2024)
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందారు
నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడు
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క రేడియంట్ స్మార్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ పూర్తిగా నా హృదయాన్ని గెలుచుకొంది! అది నా ఆర్థిక ప్రయాణములో నమ్మకమైన తోడును కలిగి ఉన్నట్లనిపించింది. దీని అనుకూలమైన నిధి మార్పిడి ఐచ్చికాలతో, నేను నా పెట్టుబడులను నేను ఊహించిన విధంగా రూపొందించుకోగలిగాను. కేవలం ఒక సంవత్సరంలోనే, నేను నా పెట్టుబడులపై గణనీయంగా 20% రాబడులను చూడగలిగాను. ఆన్‌బోర్డింగ్ బృందము నుండి నాకు లభించిన మద్దతు, నన్ను నిజంగా పట్టించుకొని తోడ్పాటు అందించినట్లు అనిపించేలా ఎంతో అద్భుతంగా ఉండినది
పౌలోమీ బెనర్జీ
కోల్‌కతా 21వ త్యేదీ మార్చ్ 2024)
ఔను, ఈ ప్లాన్ క్రింద మీరు ఒక లోన్ సౌకర్యము నుండి ప్రయోజనం పొందవచ్చు.
ఏ సమయములోనైనా మీరు పొందగలిగిన లోన్ మొత్తము అప్పటి సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులోని సరెండర్ మొత్తంలో 90% వరకూ మీరు ఒక లోన్ మొత్తాన్ని పొందవచ్చు. కనీస లోన్ మొత్తము రు.1,000 లుగా ఉండాలి. మేము సంవత్సరానికి 9% రేటుతో వడ్డీని విధిస్తాము, అది ఐఆర్‌డిఎఐ ఆమోదానికి లోబడి మాచే ఎప్పటికప్పుడు సమయానుగుణంగా మార్పు చేయబడవచ్చు. కూడగట్టుకుపోయిన వడ్డీతో కూడిన ఋణం సరెండర్ విలువను మించిపోయినప్పుడు, పాలసీ ముందస్తుగా ముగించబడుతుంది మరియు వడ్డీతో పాటు బాకీ పడిఉన్న ఋణం సరెండర్ రాబడి నుండి వసూలు చేసుకోబడుతుంది. వడ్డీతో పాటు బాకీ పడిఉన్న ఋణం, ఒకవేళ ఏదైనా ఉంటే, మరణం లేదా మెచ్యూరిటీ లోపున తిరిగి చెల్లించబడనప్పుడు అది మరణం/ మెచ్యూరిటీ రాబడుల నుండి వసూలు చేసుకోబడుతుంది.
మేము మీకు కారుణ్య వ్యవధిని అందిస్తాము, అది ప్రీమియం గడువు తేదీ నుండి ప్రీమియం చెల్లింపు కోసం అందించబడిన సమయం, ఆ సమయంలో పాలసీ రిస్క్ కవర్ తో సహా అమలులో ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఈ పాలసీ, సాంవత్సరిక, అర్ధ సంవత్సర మరియు మూడు నెలల అంతరాల కొరకు ప్రీమియం గడువు తేదీ నుండి 30 రోజులు, మరియు నెలసరి అంతరాలకు 15 రోజుల కారుణ్య వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ వ్యవధి సందర్భంగా ఒకవేళ జీవిత భరోసా పొందిన వ్యక్తి గనక మరణించిన పక్షములో, మరణం సంభవించడానికి ముందు బాకీ పడి ఉన్న ప్రీమియములను మినహాయించుకొని కరణ ప్రయోజనం నామినీ (లు)/అపాయింటీ/వారసులకు చెల్లించబడుతుంది.
చెల్లించిన ప్రీమియములు మరియు అందుకోదగిన ప్రయోజనాలపై ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుబాటులో ఉండవచ్చు. ప్రభుత్వ పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందుగా దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.
ఇది పరిమిత ప్రీమియం చెల్లింపు, పాల్గొంటున్న ప్లాన్, ఇది 5 సంవత్సరాల తక్కువ చెల్లింపు నిబద్ధతను అందించడమే కాకుండా, ఒకే పాలసీలో మీకు పొదుపు మరియు రక్షణను కూడా అందిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నప్పటికీ సైతమూ, మీ జీవిత వర్తింపు ప్రయోజనం కొనసాగేలా మా పాలసీ చూసుకుంటుంది, అలా ప్రీమియం చెల్లింపు చేయనప్పటికీ జీవిత వర్తింపుతో మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది. ఈ పాలసీ, దీని ఋణ సదుపాయం ద్వారా మీ లిక్విడిటీ అవసరాలను కూడా చూసుకుంటుంది. మీ సౌకర్యం మేరకు ఈ పాలసీని కొనుగోలు చేయడం కూడా ఒక సాధ్యత, ఎందుకంటే దీనిని ఆన్‌లైన్ కూడా కొనుగోలు చేయవచ్చు.
ఒకవేళ పాలసీ చెల్లించబడే-విలువను పొందినట్లయితే మీ పాలసీ జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
ఈ ప్రయోజనం క్రింద; మీ పాలసీ పెయిడ్-అప్ విలువను సాధించిన తర్వాత ఒక పాలసీ సంవత్సరానికి మీరు ప్రీమియం చెల్లించడం తప్పినట్లయితే; అమలులో ఉన్న పాలసీ ప్రకారం "మొదటి చెల్లించని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం పాటు పాలసీ క్రింద మరణ ప్రయోజనాలు కొనసాగుతాయి. ఈ కాలవ్యవధిలో ఆ సంవత్సరానికి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం బాకీపడి చెల్లించబడని సంవత్సరం పాటు సాధారణ రివర్షనరీ బోనస్ చెల్లించబడదు.
కస్టమరు "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం లోపు వర్తించే వడ్డీతో సహా ప్రీమియమును చెల్లిస్తే, "జీవిత వర్తింపు కొనసాగుదల ప్రయోజనం" యొక్క ప్రయోజనాన్ని మరింత పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అట్టి చెల్లింపుపై, సవరించబడిన "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి ఒక సంవత్సరం పాటు జీవిత వర్తింపు కొనసాగే ప్రయోజనం వర్తిస్తుంది. బాకీ పడిన ప్రీమియమును మీరు చెల్లించిన సంవత్సరానికి మీరు రివర్షనరీ బోనస్ ఏదైనా ఉంటే, దానిని కూడా అందుకుంటారు. ఒకవేళ మీరు "మొదటి చెల్లించబడని ప్రీమియం" తేదీ నుండి 12 నెలల లోపున ప్రీమియమును చెల్లించకపోతే, అప్పుడు తగ్గించబడిన పెయిడ్-అప్ విలువ మేరకు మరణ ప్రయోజనం తగ్గిపోతుంది.
ఔను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం (డబ్ల్యుఓపి) రైడర్ (UIN:143B017V01) ఎంచుకునే ఒక ఆప్షన్ కలిగి ఉన్నారు. ఈ రైడర్ ని మీరు ఎంచుకున్నప్పుడు, ఒకవేళ పాలసీదారు / బీమా పొందిన వ్యక్తి గనక రైడర్ ఐచ్ఛికం క్రింద పేర్కొనబడినట్లుగా మరణం, ప్రమాద కారణంగా సంపూర్ణ శాశ్వత అంగ వైకల్యం లేదా క్లిష్ట అస్వస్థతను అనుభవించిన పక్షములో, మీ బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములు మాఫీ చేయబడటం ద్వారా మీకు మద్దతును ఇస్తుంది. పాలసీదారు/ జీవిత భరోసా పొందిన వ్యక్తి కొరకు ఆప్షన్లు ఈ దిగువ కనబరచిన విధంగా ఉన్నాయి.
ఆప్షన్ | ప్రయోజనము |
---|---|
మరణంపై ప్రీమియం వైవర్ | ఈ ఆప్షన్, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, పాలసీదారు యొక్క మరణంపై బేస్ పాలసీ కింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది (బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులు అయినప్పుడు మాత్రమే). |
ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థత (రోగ నిర్ధారణ) పై ప్రీమియం యొక్క వైవర్ | ఈ ఆప్షన్, ఈ క్రింది ఘటనలలో ఏదైనా ఒకటి లేదా ఏకకాలంలో జరగడంపై బేస్ పాలసీ క్రింద బాకీ పడిన మరియు చెల్లించాల్సిన అన్ని భవిష్యత్ ప్రీమియంలను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది; రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్న రైడర్ జీవిత భరోసా పొందిన వ్యక్తి యొక్క నిర్ధారిత రోగనిర్ధారణ. |
మరణం లేదా ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం లేదా క్లిష్టమైన అస్వస్థతపై ప్రీమియం యొక్క వైవర్ | ఈ ఆప్షన్ ఈ క్రింది ఘటనలలో దేనిలోనైనా ముందుగా జరిగే మరియు చెల్లించవలసిన అన్ని భవిష్యత్ ప్రీమియమ్‌లను వేవ్ చేయడం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది - జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క మరణం లేదా జీవిత భరోసా పొందిన రైడర్ యొక్క ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం ధృవీకరించబడిన నిర్ధారణపై, రైడర్ మరియు బేస్ పాలసీ అమలులో ఉన్నందుకు లోబడి, రైడర్ క్రింద కవర్ చేయబడే ఏదైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో భరోసా ఇవ్వబడుతుంది. ఈ ఆప్షన్ కొరకు ఎంచుకోవడానికి, బేస్ పాలసీ క్రింద జీవిత భరోసా పొందిన వ్యక్తి మరియు పాలసీదారు వేర్వేరు వ్యక్తులై ఉండాలి |
పాలసీలో మెచ్యూరిటీపై భరోసా ఇవ్వబడిన సొమ్ము పాలసీ యొక్క ప్రారంభంలో మీరు ఎంచుకున్నట్లుగా ఉంటుంది మరియు అది మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన కనీస ప్రయోజనంగా ఉంటుంది. మెచ్యూరిటీ నాటికి మెచ్యూరిటీపై భరోసా సొమ్ము ఇంకా కూడగట్టిన రివర్షనరీ బోనస్ మరియు ఏదైనా ఉంటే టెర్మినల్ బోనస్ కూడా మీరు అందుకుంటారు.
భరోసా ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము | భరోసా ఇవ్వబడే గరిష్ట ప్రాథమిక మొత్తము |
---|---|
రు. 10,000 | బోర్డు ఆమోదిత పాలసీ ప్రకారము రు. 2,00,000 |
పెంపొందిత ప్రయోజనం కోసం మీరు వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కొరకు కూడా ఎంచుకోవచ్చు. సదరు రైడర్ పైన మరిన్ని వివరాల కోసం దయచేసి ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ బ్రోచరును చదవండి.
ఆమోదించబడిన బోనస్ పాలసీ ప్రకారం వర్తించబడే విధంగా మీ పాలసీ సింపుల్ రివర్షనరీ బోనస్ మరియు టెర్మినల్ బోనస్, ఏదైనా ఉంటే, వాటికి అర్హత కలిగి ఉంటుంది.
కవర్ ఆప్షన్ | రిస్క్ కవరేజీ | ప్రయోజన వివరాలు |
---|---|---|
లైఫ్ ఆప్షన్ | మరణము | మరణంపై హామీ ఇవ్వబడిన భరోసా సొమ్ము (వార్షిక ప్రీమియం యొక్క 10 రెట్లు) + కూడగట్టుకున్న బోనస్‌లు (ఏవైనా ఉంటే) మరియు టెర్మినల్ బోనస్, ఏదైనా ఉంటే, చెల్లించబడుతుంది. కనీస మరణ ప్రయోజనము, కనీసంగా మరణించిన తేదీ నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియముల యొక్క 105% గా ఉంటుంది. |
అదనపు లైఫ్ ఆప్షన్ | మరణం మరియు ప్రమాద సంబంధిత మరణం | పైన కనబరచినట్లుగా మరణ ప్రయోజనం + ప్రమాద మరణంపై అదనపు మరణ ప్రయోజనం, అది మరణంపై హామీ ఇవ్వబడిన భరోసా సొమ్ముకు సమానమైన సొమ్ము చెల్లించబడుతుంది. |
మీరు ఈ క్రింది వాటిని మెచ్యూరిటీ ప్రయోజనముగా అందుకుంటారు:
మెచ్యూరిటీ ప్రయోజనం యొక్క చెల్లింపు మీదట, పాలసీ రద్దు అవుతుంది, మరియు ఇక ఎటువంటి ప్రయోజనాలూ చెల్లించబడవు. మెచ్యూరిటీ పైన హామీతో కూడిన భరోసా సొమ్ము అనేది, పాలసీ కాలావధి లోపున ప్రమాదం జరిగిన తేదీ ఉంటే పాలసీ అవధి ప్రారంభములో పాలసీదారుచే ఎంచుకోబడిన ప్రాథమిక భరోసా సొమ్ము అయి ఉంటుంది.
పాలసీ యొక్క అవధి సందర్భంగా జీవిత భరోసా కల్పించబడిన వ్యక్తి యొక్క దురదృష్టకర మరణం సంభవించిన సంఘటనలో, నామినీకి చెల్లించబడే మరణ ప్రయోజనం ఒక ఏకమొత్తం రూపములోనైనా ఉండవచ్చు లేదా తర్వాతి 5 సంవత్సరాల పాటు నెలసరి ఆదాయముగానైనా ఉండవచ్చు.
ఘటనలు | ప్రయోజనాలు ఎలా మరియు ఎప్పుడు చెల్లించబడతాయి | అట్టి ప్రయోజనాల పరిమాణం |
---|---|---|
మరణము | పాలసీ అమలులో ఉంటే పాలసీ కాలావధి సందర్భంగా మరణంపై చెల్లించబడుతుంది | మరణంపై హామీ ఇవ్వబడిన భరోసా సొమ్ము + కూడగట్టుకున్న సింపుల్ రివర్షనరీ బోనస్ (ఏదైనా ఉంటే) మరియు టెర్మినల్ బోనస్ (ఏదైనా ఉంటే). అయినప్పటికీ, కనీస మరణ ప్రయోజనము, మరణించిన తేదీ నాటికి చెల్లించబడిన మొత్తం ప్రీమియముల యొక్క కనీసం 105% గా ఉంటుంది. |
ప్రమాదకారణంగా మరణము | పాలసీ అమలులో ఉండి మరియు ప్రమాదకారణంగా మరణ ప్రయోజనమును ఎంచుకొని ఉంటే పాలసీ కాలావధి సందర్భంగా ప్రమాదకారణంగా మరణముపై చెల్లించబడుతుంది. | మరణ ప్రయోజనం మీద మరియు ఆ పైన అదనపు ప్రయోజనంగా మరణంపై హామీ ఇవ్వబడిన భరోసా సొమ్ము. |
మరణం మీదట భరోసా ఇవ్వబడిన హామీ సొమ్ము వార్షికం చేయబడిన ప్రీమియం కంటే 10 రెట్లు ఉంటుంది
వాయిదాలలో మరణ ప్రయోజనం చెల్లింపు విషయంలో; మరణ ప్రయోజనాన్ని యాన్యువిటీ కారకాంశముచే గుణించడం ద్వారా నెలసరి వాయిదా మొత్తం లెక్కించబడుతుంది, ఇక్కడ మరణించిన తేదీ నాటికి ఉన్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఆధారంగా యాన్యువిటీ కారకాంశం వస్తుంది. ఒకసారి వాయిదా చెల్లింపు మొదలయిందంటే, వాయిదా కాలవ్యవధి అంతటా ఈ చెల్లింపు అదే మట్టములోనే నిలిచి ఉంటుంది. ప్రస్తుతమున్న ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆఖరున జరిగే సమీక్షకు లోబడి ఉంటుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రతి సంవత్సరమూ మార్చి 31 నాడు నిర్ణయించబడుతుంది.
నిర్వచనములు
“యాక్సిడెంట్ (ప్రమాద ఘటన)” అనగా, హింసాత్మకమైన, అనూహ్యమైన, అసంకల్పిత, స్వాభావికంగా బాహ్య మరియు కనిపించే ఒక ఘటన లేదా ఘటనల వరుస శ్రేణి అని అర్థం, అది శారీరకంగా గాయపరుస్తుంది. “శారీరకంగా గాయపడటం” అనగా, మునిగిపోవడం మరియు అంతర్గత గాయం వంటి సందర్భాలలో తప్ప, కణుపు, చర్మ గాయం మరియు గాయం కలగడం వంటి బాహ్య చిహ్నాలతో గాయాలు నిరూపణ కావడమని అర్థం. “ప్రమాద సంబంధిత మరణం” అనగా, ఈ క్రింది రకాల మరణము:
a. ఒక యాక్సిడెంట్ కారణంగా శారీరకంగా గాయపడి కలిగినది, మరియు
b. సదరు శారీరకంగా గాయపడటం కారణంగా సంపూర్ణంగా, నేరుగా మరియు ఏదైనా ఇతర కారణాలు కాకుండా స్వతంత్రంగా కలిగినది, మరియు
c. అట్టి యాక్సిడెంట్ జరిగిన 180 రోజుల లోపున గడువు తీరినదానితో సంబంధం లేకుండా జరిగినది.
మన కలలకు మద్దతు ఇవ్వడానికై మనకు గనక రెండవ ఆదాయ మార్గం ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ? మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది, అందులో మీరు 1 వ నెల ఆఖరి నుండే ఆదాయం సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు.
మీ పెట్టుబడులపై 7x రాబడులు పొందడానికి మార్గమేమైనా ఉందా అని యోచిస్తున్నారా? మీ శోధన ఇక్కడితో ముగుస్తుంది! ఈ సింగిల్ చెల్లింపు ప్లానుతో, మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు.
విజ్ఞాన కేంద్రము
అన్నింటినీ వీక్షించండి