నిబంధనల ప్రకారం, మీరు ఈ క్రింది మార్గాలలో మరణ ప్రయోజనం, వెస్టింగ్ బెనిఫిట్ మరియు సరెండర్ బెనిఫిట్
తీసుకునే అవకాశం ఉంటుంది
– మరణ ప్రయోజనం విషయంలోనైతే, నామినీకి ఈ క్రింది ఐచ్ఛికాలు ఉంటాయి:
ఇండియాఫస్ట్ లైఫ్ నుండి అప్పటికి అమలులో ఉన్న రేటుతో తక్షణ యాన్యువిటీ లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడం కోసం పాలసీ ద్వారా వచ్చిన సంపూర్ణ మొత్తం లేదా దానిలో కొంత భాగాన్ని వినియోగించుకోవడం. అయినప్పటికీ, పాలసీ నికర గణింపు (అనుమతించబడిన గణింపు 60%) యొక్క మొత్తం ఆదాయంలో 50% మేరకు అప్పటికి అమల్లో ఉన్న రేటుతో మరొక బీమాదారు నుండి తక్షణ యాన్యుటీని లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడానికి నామినీకి ఒక ఐచ్ఛికం ఇవ్వబడుతుంది, అందువల్ల ఇతర బీమాదారు నుండి యాన్యుటీని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే సొమ్ము, మొత్తం రాబడిలో 20% ఉంటుంది; లేదా
i) పాలసీ యొక్క మొత్తం రాబడులన్నింటినీ విత్‌డ్రా చేసుకోవడం.
వెస్టింగ్ ప్రయోజనం విషయంలోనైతే, పాలసీహోల్డర్ (పాలసీదారు) కు ఈ క్రింది ఐచ్ఛికాలు ఉంటాయి:
i) దిగువన ఉన్న పాయింట్ నం (iii)కి లోబడి ప్రస్తుత యాన్యువిటీ రేటుతో ఇండియాఫస్ట్ లైఫ్ నుండి తక్షణ లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడానికై మొత్తం రాబడిని వినియోగించుకోవడానికి;
ii) దిగువన ఉన్న పాయింట్ నం (iii)కి లోబడి 60% వరకూ లెక్కించుకొని మరియు మిగిలిన మొత్తాన్ని ప్రస్తుత యాన్యువిటీ రేటుతో ఇండియాఫస్ట్ లైఫ్ నుండి తక్షణ లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడానికై వినియోగించుకోవడానికి,
iii) పాలసీ నికర గణింపు (అనుమతించబడిన గణింపు 60%) యొక్క మొత్తం ఆదాయంలో 50% మేరకు అప్పటికి అమల్లో ఉన్న యాన్యువిటీ రేటుతో మరొక బీమాదారు నుండి తక్షణ యాన్యువిటీని లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడానికి ప్రతి పాలసీదారుకు ఒక ఐచ్ఛికం ఇవ్వబడుతుంది, అందువల్ల ఇతర బీమాదారు నుండి యాన్యువిటీని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే సొమ్ము, మొత్తం రాబడిలో 20% ఉంటుంది
సరెండర్ ప్రయోజనం విషయంలోనైతే, పాలసీహోల్డర్ (పాలసీదారు) కు ఈ క్రింది ఐచ్ఛికాలు ఉంటాయి:
i) దిగువన ఉన్న పాయింట్ నం (iii)కి లోబడి ప్రస్తుత యాన్యువిటీ రేటుతో ఇండియాఫస్ట్ లైఫ్ నుండి తక్షణ లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడానికై మొత్తం రాబడిని వినియోగించుకోవడానికి;
ii) దిగువన ఉన్న పాయింట్ నం (iii)కి లోబడి 60% వరకూ లెక్కించుకొని మరియు మిగిలిన మొత్తాన్ని ప్రస్తుత యాన్యువిటీ రేటుతో ఇండియాఫస్ట్ లైఫ్ నుండి తక్షణ లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడానికై వినియోగించుకోవడానికి; లేదా
iii) పాలసీ నికర గణింపు (అనుమతించబడిన గణింపు 60%) యొక్క మొత్తం ఆదాయంలో 50% మేరకు అప్పటికి అమల్లో ఉన్న యాన్యువిటీ రేటుతో మరొక బీమాదారు నుండి తక్షణ యాన్యువిటీని లేదా డిఫర్డ్ యాన్యువిటీని కొనుగోలు చేయడానికి ప్రతి పాలసీదారుకు ఒక ఐచ్ఛికం ఇవ్వబడుతుంది, అందువల్ల ఇతర బీమాదారు నుండి యాన్యువిటీని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే సొమ్ము, మొత్తం రాబడిలో 20% ఉంటుంది
సింగిల్ ప్రీమియం కొరకు: ప్రీమియమును చెల్లించిన తర్వాత ఏ సమయంలోనైనా సరెండర్ విలువ తక్షణమే చెల్లించబడుతుంది. పాలసీదారు తన పాలసీని సరెండర్ చేసే ఐచ్ఛికాన్ని కలిగి ఉంటారు.
ఒకవేళ సరెండర్ పై గానీ లేదా వెస్టింగ్ ద్వారా గానీ పాలసీ ద్వారా వచ్చిన రాబడి గనక కనీస యాన్యువిటీని (అంటే నెలకు 1000) కొనుగోలు చేయడానికి సరిపోని పక్షములో, పాలసీ ద్వారా వచ్చిన మొత్తాన్ని పాలసీదారు లేదా లబ్ధిదారుకు ఏకమొత్తంగా చెల్లించవచ్చు.