ఇది ప్రత్యేకంగా మీ అవసరాలకు అనుగుణంగా రూపొందినట్లుగా చూసుకోవడానికి పాలసీలో మీకు బహుళ ఎంపికలు ఉన్నాయి. ఎంచుకోవడానికి వివిధ పాలసీ నిబంధనలు, ప్రీమియం చెల్లింపు నిబంధనలు, ఫండ్ ఎంపికలు మరియు పెట్టుబడి వ్యూహాలు ఉండటం మాత్రమే కాకుండా, మీ ఆర్థిక ప్రణాళిక మీ ఆర్థిక లక్ష్యాలతో సింక్ అవుతున్నట్లుగా చూసుకోవడానికి మీరు స్విచ్చింగ్, పాక్షిక ఉపసంహరణలు వంటి ఎంపికలను కూడా ఉపయోగించుకోవచ్చు.
A. స్విచ్చింగ్ అంటే ఏమిటి?
పాలసీ వ్యవధి సందర్భంగా మీ ఫండ్స్ ని ఎన్నిసార్లయినా మార్చడం ద్వారా మీరు ఒక ఫండ్ నుండి మరొక ఫండ్‌కు మారవచ్చు.
స్విచ్చింగ్ కోసం ఏవైనా పరిమితులు ఉన్నాయా?
మార్పిడి క్రింద మీరు మీ యూనిట్లలో కొన్ని లేదా అన్నింటినీ ఒక యూనిట్ అనుసంధానిత ఫండ్ నుండి మరొక దానికి బదిలీ చేయవచ్చు..
| కనీస స్విచ్చింగ్ మొత్తము | రూ. 5,000 లు |
|---|
| గరిష్ట స్విచ్చింగ్ మొత్తము | ఫండ్ విలువ |
ఫండ్స్ మధ్యన మారడానికి ఏయే ఛార్జీలు ఉంటాయి?
మీరు ఒక క్యాలెండర్ నెలలో అపరిమితమైన సంఖ్యలో మార్పిడులు చేయడానికి అనుమతించబడతారు. ఈ మార్పిడులు ప్రస్తుతం ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితం. అయినప్పటికీ, ఐ.ఆర్.డి.ఎ.ఐ వారి ముందస్తు ఆమోదాలకు లోబడి, మేము రుసుములను ప్రవేశపెట్టే హక్కు కలిగి ఉంటాము. ఇది ఒక్కో లావాదేవీకి రు. 500 కు మించకూడదు.
B. పాక్షిక ఉపసంహరణలు అనేవి ఏవి? అవి అనుమతించబడతాయా?
మీ ఐదవ పాలసీ సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే ఏదైనా అత్యవసర పరిస్థితిలో పాక్షికంగా ఉపసంహరించుకోవడం ద్వారా మీ డబ్బును తీసుకోవడానికి మీ పాలసీ మీకు వెసులుబాటును కల్పిస్తుంది.
పాక్షిక ఉపసంహరణ మొత్తాలపై ఏవైనా పరిమితులు ఉన్నాయా?
| కనీస ఉపసంహరణ మొత్తము | రూ. 10,000 లు |
|---|
| పరిమిత ప్రీమియం | ఉపసంహరణ తర్వాత మీ ఫండ్ విలువ ఒక పూర్తి సంవత్సరం ప్రీమియంలో కనీసం 110% ఉంటే మాత్రమే పాక్షిక ఉపసంహరణ సమయంలో గరిష్ట ఉపసంహరణ మొత్తం ఫండ్ విలువలో 20% వరకు ఉంటుంది. |
ఉదాహరణ: ఒకవేళ మీరు రూ. 15,000 వార్షిక ప్రీమియం చెల్లించి, కొన్ని సంవత్సరాలలో రూ. 80,000 ఫండ్ విలువను (ఫండ్ విలువలో 20%) కూడగట్టుకున్నట్లయితే మీరు రూ. 16,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
C. ప్రీమియం మళ్ళింపు (రీడైరెక్షన్) అంటే ఏమిటి?
మాకు వ్రాతపూర్వక నోటీసును ఇవ్వడం ద్వారా మీరు ప్రీమియంను ఒక ఫండ్ నుండి మరొక ఫండ్‌కు మళ్ళించే ఆప్షన్ ఉంటుంది.
D. ఈ పాలసీలో అనుమతించబడే మార్పుచేర్పులు ఏవి?
మీరు మీ పాలసీలో ఈ క్రింది మార్పుచేర్పులు చేయడానికి అనుమతించబడతారు –
- ప్రీమియం చెల్లింపు వ్యవధి సందర్భంగా ఎటువంటి ఛార్జీలు/ ఫీజులు లేకుండా ప్రీమియం అంతరాన్ని మార్చుకునే ఆప్షన్ మీకు ఉంటుంది.
- బోర్డుచే ఆమోదించబడిన పూచీకత్తు విధానానికి అనుగుణంగా, ప్రీమియం చెల్లింపు వ్యవధి లేదా పాలసీ వ్యవధిలో వరుసగా ప్రీమియం చెల్లింపు వ్యవధిని లేదా పాలసీ వ్యవధిని పెంచుకునే ఒక ఆప్షన్ మీకు ఉంటుంది. ఒకసారి ప్రీమియం చెల్లింపు వ్యవధి లేదా పాలసీ వ్యవధి పెరిగిన తర్వాత, దానిని తరువాత తగ్గించడానికి వీలు ఉండదు. ప్రీమియం చెల్లింపు వ్యవధి మరియు/లేదా పాలసీ వ్యవధి పెంపుదల కోసం అభ్యర్థనను పాలసీదారు వార్షిక పాలసీ వార్షికోత్సవానికి కనీసం ఒక నెల ముందుగా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది.
- పాలసీ వ్యవధి సందర్భంగా బకాయీ ఉన్న అన్ని ప్రీమియంలు చెల్లించబడి ఉంటే, బీమా సొమ్మును తగ్గించుకునే ఆప్షన్ మీకు ఉంటుంది. బీమా సొమ్ములో తగ్గుదల అనేది ఈ పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియమును మార్చబోదు. బీమా సొమ్ములో తగ్గుదల అనేది ఈ పాలసీ క్రింద అనుమతించబడే కనీసమొత్తం వరకూ అనుమతించబడుతుంది. బీమా సొమ్ములో తగ్గుదల అనేది అనేక పరిమితుల కనీస బీమా సొమ్ముకు లోబడి ఉంటుంది.