ఒక జీవిత బీమా పాలసీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి అది అత్యుత్తమ ఆర్థిక రక్షణగా ఉంటుంది.
ఆర్థిక భద్రత మీరు తగినంత పరిమాణములో జీవిత వర్తింపును కొనుగోలు చేస్తే, మీ ఆకస్మిక మరణం జరిగిన పక్షములో అది మీపై ఆధారపడి ఉన్నవారికి టోకుగా పెద్ద మొత్తపు మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది వారికి సౌకర్యవంతంగా సహాయపడగలుగుతుంది, ప్రత్యేకించి వారికి ఆదాయ వనరు లేకుంటే, మరియు చిన్నపిల్లలు లేదా వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే.
సంపదను సృష్టించుట: కొన్ని జీవిత బీమా ప్లానులు మదుపు మరియు బీమా యొక్క రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. మీ నిధులు పెరగడానికి గాను బీమాదారు ప్రీమియం చెల్లింపులలో కొంత భాగాన్ని ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి చేస్తారు, మిగతా భాగం జీవిత వర్తింపు వైపుకు వెళుతుంది.
ప్రతి జీవిత దశకూ రక్షణ: అది మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఆర్థిక భద్రత కోసమైనా, సంపాదనాకర్త మరణం తదనంతరం నిలకడైన ఒక ఆదాయ వనరుగా అయినా, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అయినా లేదా కేవలం దీర్ఘకాలిక పొదుపు అయినా ప్రతి అవసరానికీ ఒక జీవిత బీమా పాలసీ ఉంది.
పన్ను ఆదాలు: ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 80C ప్రీమియం చెల్లింపులను పన్ను-రహితం చేస్తుంది, అది పన్ను వేయదగిన మీ ఆదాయాన్ని తగ్గిస్తుంది. పైపెచ్చుగా, చెల్లింపులు కూడా పన్ను-రహితంగానే ఉండేలా సెక్షన్ 10(10D) చూసుకుంటుంది. ఈ పన్ను చట్టాలు జీవిత బీమాను ఒక విలువైన పెట్టుబడిగా చేస్తాయి.
రిటైర్‌మెంట్ ప్లానింగ్: మీ ఉద్యోగ జీవితం ముగిసిపోవచ్చు, అయితే మీ జీవన ఖర్చులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. రిటైర్‌మెంట్ జీవిత బీమా పాలసీ అనేది కవరేజీని మరియు నిలకడైన ఆదాయ వనరును అందజేస్తుంది, అది రోజువారి ఖర్చులకు, చిన్న వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి లేదా ఇతర ఆర్థిక సాధనాల్లో తిరిగి పెట్టుబడి చేయడానికి తోడ్పడుతుంది.
సురక్షితమైన పెట్టుబడి మార్కెట్ అనుసంధానిత రాబడులను అందించే ఆర్థిక ఉత్పాదనలు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి, అవి వాటిని ముప్పుకు గురి చేయవచ్చు. అయినప్పటికీ జీవిత బీమా, మీకు ప్రీమియం చెల్లింపులకు మార్పిడిగా భరోసాతో కూడిన ప్రయోజనాలను అందిస్తుంది.
లోన్ ఐచ్ఛికాలు: ఒకవేళ ఊహించని ఆర్థిక సంక్షోభం సంభవించిన పక్షములో, పాలసీ షరతులు మరియు నిబంధనలపై ఆధారపడి భరోసా మొత్తము నుండి కొన్ని నిధులను అప్పుగా తీసుకోవడానికి జీవిత బీమా మీకు వీలు కలిగిస్తుంది.
రైడర్లు: రైడర్లు అనేవి, మీ జీవిత బీమా పాలసీని బలమైనదిగా చేసుకోవడానికి మీరు కొనుగోలు చేయగల అదనపు ప్రయోజనాలు. క్లిష్టమైన అస్వస్థత, ఆకస్మిక మరణము, లేదా సంపూర్ణ/పాక్షిక వైకల్యము వంటి ఆదాయాన్ని కోల్పోగల అనిశ్చితుల నుండి రైడర్లు మిమ్మల్ని కాపాడతాయి.