కారుణ్య వ్యవధి లోపున పాలసీ క్రింద చెల్లించాల్సిన ప్రీమియములను చెల్లించని పక్షంలో, పాలసీ గనక గ్యారంటీడ్ సరెండర్ విలువను పొందక పోయి ఉంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. రిస్క్ కవర్ ఆపివేయబడుతుంది మరియు ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో తదుపరి ప్రయోజనాలు ఏవీ చెల్లించబడవు.
ఒకవేళ రెండు పూర్తి సంవత్సరాల కంటే తక్కువ కాలానికి ప్రీమియములు చెల్లించబడకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అయినప్పటికీ, పునరుద్ధరణ వ్యవధి లోపున మీరు మీ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పాలసీ ల్యాప్స్ అయి మరియు పునరుద్ధరించబడకపోతే, పునరుద్ధరణ వ్యవధి ముగిసిన తర్వాత ఎటువంటి ప్రయోజనాన్ని చెల్లించకుండానే అది ముందస్తుగా ముగింపు చేయబడుతుంది. పునరుద్ధరణపై మరింత సమాచారం కోసం మీరు ఈ దిగువ విభాగాన్ని చూడవచ్చు.
కనీసం రెండు (2) పూర్తి సంవత్సరాల ప్రీమియం చెల్లించి, మరియు తదుపరి బకాయి ప్రీమియంలు ఏవైనా చెల్లించనట్లయితే, మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి కారుణ్య వ్యవధి గడువు ముగిసిన తర్వాత పాలసీ పెయిడ్-అప్ విలువను పొందుతుంది.
గమనిక:
• తగ్గించబడిన ఒక పెయిడ్-అప్ పాలసీని షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదు సంవత్సరాల లోపున (అసలు ప్రయోజనాలకు) పునరుద్ధరించవచ్చు.
• తగ్గించబడిన పెయిడ్-అప్ రూపంలో ఉన్న పాలసీని పునరుద్ధరణ వ్యవధి సందర్భంగా పునరుద్ధరించకపోతే, అది పాలసీ యొక్క మెచ్యూరిటీ లేదా మరణం లేదా సరెండర్ వరకూ తగ్గించబడిన పెయిడ్- అప్ రూపంలోనే కొనసాగుతుంది.
• పాలసీ యొక్క అవధి సందర్భంగా చెల్లించాల్సిన ప్రీమియములు అన్నీ చెల్లించబడితే పాలసీ పూర్తిగా పెయిడ్-అప్ గా మారుతుంది మరియు చెల్లించదగిన ప్రయోజనాలు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఉంటాయి.
ఒకసారి పాలసీ పెయిడ్-అప్ గా మారినదంటే:
• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద మరణ ప్రయోజనం: పాలసీ కాలావధి సందర్భంగా మరణించినప్పుడు, మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది మరియు పాలసీ రద్దు చేయబడుతుంది.
మరణ ప్రయోజనం మరణంపై పెయిడ్-అప్ భరోసా సొమ్ముగా ఉంటుంది, ఇక్కడ మరణంపై పెయిడ్-అప్ భరోసా సొమ్ము అనేది మరణంపై భరోసా సొమ్ము* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) ప్లస్ ఒకవేళ ప్రకటించి ఉంటే టెర్మినల్ బోనస్
• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద జీవించియున్న ప్రయోజనం: పాలసీ తగ్గించబడిన పెయిడ్-అప్ స్థితిలో ఉన్నప్పుడు జీవిత భరోసా పొందిన వ్యక్తి జీవించి ఉండటంపై, ప్రీమియం చెల్లింపు అవధి ముగింపు నుండి మెచ్యూరిటీ వరకూ ఈ క్రింది ప్రయోజనం చెల్లించబడుతుంది: పెయిడ్-అప్ హామీతో కూడిన జీవించియున్న ప్రయోజనం అనేది హామీతో కూడిన జీవించియున్న ప్రయోజనం* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) ప్లస్ ఒకవేళ ప్రకటించి ఉంటే నగదు బోనస్ కలిపినదిగా పేర్కొనబడుతుంది.
ఒకవేళ పాలసీదారు మొదట్లో జీవించియున్న ప్రయోజనం(లు)ని డిఫర్ చేయాలని ఎంచుకుని, ఆ తర్వాత పాలసీ గనక తగ్గించబడిన పెయిడ్-అప్ గా మారినట్లయితే, అప్పుడు పాలసీదారు పెయిడ్-అప్ గ్యారెంటీ సర్వైవల్ ప్రయోజనాలు ప్లస్ ఒకవేళ ప్రకటించి ఉంటే నగదు బోనస్‌ను కూడా పొందుతారు. వడ్డీతో సహా సదరు ప్రయోజనాలను కూడగట్టడం, ఏదైనా ఉంటే, పాలసీ రద్దు చేయబడిన సమయంలో మరణం, సరెండర్ లేదా మెచ్యూరిటీ రూపంలో, ఏది ముందుగా వస్తే దాని ప్రకారం చెల్లించబడుతుంది
• తగ్గించబడిన పెయిడ్-అప్ పాలసీ క్రింద మెచ్యూరిటీ ప్రయోజనం: పాలసీ కాలావధి ముగిసే వరకు జీవించి ఉంటే, ఈ క్రింది ప్రయోజనం చెల్లించబడుతుంది:
మెచ్యూరిటీ ప్రయోజనం మెచ్యూరిటీపై పెయిడ్-అప్ భరోసా సొమ్ముగా ఉంటుంది, ఇక్కడ మెచ్యూరిటీపై పెయిడ్-అప్ భరోసా సొమ్ము అనేది మెచ్యూరిటీపై గ్యారంటీడ్ భరోసా సొమ్ము* (చెల్లించిన ప్రీమియంల మొత్తం సంఖ్య)/(పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంల సంఖ్య) ప్లస్
టెర్మినల్ బోనస్ గా పేర్కొనబడుతుంది,
ఒకవేళ ప్రకటించబడి ఉంటే, ఎటువంటి సందర్భంలోనూ పైన కనబరచినట్లుగా మరణం లేదా మెచ్యూరిటీ విషయంలో చెల్లించబడే మొత్తం ప్రయోజనాలు ఈ పాలసీ క్రింద చెల్లించిన మొత్తం ప్రీమియంల కంటే తక్కువగా ఉండకూడదు.