ఆత్మహత్య మినహాయింపు
పాలసీ క్రింద రిస్క్ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపున ఆత్మహత్య లేదా ప్రాణాంతక అనారోగ్యం కారణంగా మరణం విషయంలో, వర్తించే విధంగా, పాలసీ అమలులో ఉన్నట్లయితే మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలు లేదా మరణించిన తేదీ నాటికి అందుబాటులో ఉన్న సరెండర్ విలువ ఏది ఎక్కువ అయితే అందులో 80% పొందడానికి పాలసీదారు యొక్క నామినీ లేదా లబ్ధిదారు అర్హులు అవుతారు.
ప్రమాదకారణంగా సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము కొరకు మినహాయింపులు:
ఈ క్రింది వాటిలో ఏదైనా కారణం చేత ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ వైకల్యం సంభవించినట్లయితే, ఆ వైకల్యము సందర్భోచితంగా, వేగమైన లేదా తీవ్రతరమైనదిగా అయినట్లయితే, సంపూర్ణ మరియు శాశ్వత వైకల్యం (ప్రమాదం కారణంగా) ప్రయోజనం చెల్లించబడదు:
1. జీవిత భరోసా పొందిన వ్యక్తి వైద్యపరంగా తెలివిగా ఉన్నా లేదా పిచ్చిగా ఉన్నా ఆత్మహత్య లేదా స్వయంగా చేసుకున్న గాయం.
2. యుద్ధం, ఉగ్రవాదం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్య, శత్రుత్వం, పౌర అంతర్యుద్ధం, యుద్ధ కళలు, తిరుగుబాటు, విప్లవం, తిరుగుబాటు, సైనిక లేదా దోపిడీ అధికారం, పౌర కల్లోలం. యుద్ధం అనగా ప్రకటిత లేదా అప్రకటితమైన ఏదైనా యుద్ధం అని అర్థం.
3. సాయుధ దళాలలో సేవ, యుద్ధంలో ఏదైనా దేశం తరఫున లేదా అంతర్జాతీయ సంస్థ యొక్క ఏదైనా దళంలో సర్వీసు
4. శాంతి నెలకొన్న సమయంలో ఏదైనా నావికా, సైనిక లేదా వాయుసేన కార్యకలాపాలలో పాల్గొనడం.
5.నేరపూరిత ఉద్దేశ్యంతో దాడికి, క్రిమినల్ నేరానికి, చట్టవ్యతిరేక చర్య లేదా ఏదైనా చట్ట ఉల్లంఘనకు పాల్పడడం.
6. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క న్యాయబద్ధమైన నిర్దేశాలు మరియు ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుని ఉంటే తప్ప, మద్యము లేదా ద్రవపదార్థాల దురుపయోగము లేదా మత్తు మందులు, మద్యము, నార్కోటిక్స్ లేదా సైకోట్రోపిక్ పదార్థాలు తీసుకోవడం
7. విషం, వాయువు లేదా పొగలు (స్వచ్ఛందంగా లేదా అసంకల్పితంగా, ప్రమాదవశాత్తూ లేదా ఇతరత్రా తీసుకోవడం, వేయడం, గ్రహించడం లేదా పీల్చుకోవడం).
8. బీమా చేయబడిన వ్యక్తి క్రమం తప్పని మార్గాలలో మరియు షెడ్యూల్ చేయబడిన కాలనిర్ణయ పట్టికలో గుర్తింపు పొందిన విమానయాన సంస్థకు చెందిన గౌరవనీయ, ఛార్జీలు చెల్లించే ప్రయాణికుడు, పైలట్, వాయుయాన సిబ్బందిగా తప్ప, ఏదైనా విమానయాన చర్యలో పాల్గొనడం.
9. వృత్తిపరమైన క్రీడ(లు) లేదా ఏవైనా సాహసోపేతమైన పనులు లేదా అభిరుచులలో పాల్గొనడం. "సాహసోపేతమైన అలవాట్లు లేదా అభిరుచులు" లో ఏదైనా రకమైన రేసింగ్ (కాలినడక లేదా ఈత కొట్టడం కాకుండా), గెంతులు వేయడం, కొండలు ఎక్కడం (మానవ నిర్మిత గోడలపై తప్ప), వేట, పర్వతారోహణ లేదా ఎక్కడానికి తాళ్లు లేదా గైడ్‌లు అవసరం వాడుకోవడం, ఏదైనా నీటి అడుగున కార్యకలాపాలు, నీటి అడుగున శ్వాస ఉపకరణాన్ని ఉపయోగించడం, సముద్రపు లోతుకు దూకడం, ఆకాశపు డైవింగ్, క్లిఫ్ డైవింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్, హ్యాండ్ గ్లైడింగ్ మరియు పారాచూటింగ్ వంటివి చేరి ఉంటాయి.
10. కవర్ అమలు లోనికి వచ్చిన తేదీకి ముందు మరియు/లేదా ఆ తర్వాత ఏదైనా రకమైన అనారోగ్యం, వ్యాధి కారణంగా కలిగిన ఏదైనా వైకల్యం; ఇప్పటికే ఉన్న ఏదైనా బాహ్యంగా పుట్టుకతో వచ్చిన క్రమరాహిత్యం కవర్ చేయబడదు మరియు బాహ్యంగా పుట్టుకతో వచ్చిన క్రమరాహిత్యాలను కలిగి ఉన్నట్టి సభ్యుల కోసం పాలసీ జారీ చేయబడదు. బాహ్యంగా పుట్టుకతో వచ్చిన క్రమరాహిత్యాలు కాకుండా, పుట్టుకతో వచ్చిన వేరే క్రమరాహిత్యం కవర్ చేయబడుతుంది. ఇక్కడ బాహ్యంగా పుట్టుకతో వచ్చిన క్రమరాహిత్యం అంటే ఒక పరిస్థితి, ఇందులో శరీరంలోని కనిపించే మరియు అందుబాటులో ఉండే భాగాలు మరియు పుట్టినప్పటి నుండి ఉండేవి, మరియు అవి రూపం, నిర్మాణం లేదా స్థానమునకు సంబంధించి అసాధారణంగా ఉంటాయి.
11. అణు కాలుష్యం; అణు ఇంధన పదార్థాల రేడియో- ధార్మికత, ప్రేలుడు లేదా ప్రమాదకర స్వభావం లేదా అణు ఇంధన పదార్థాల ద్వారా కలుషితమైన అణు ఇంధన సామాగ్రి లేదా ఆస్తి లేదా అటువంటి స్వభావం నుండి ఉత్పన్నమయ్యే ప్రమాదం.
కీలకమైన అనారోగ్యాలు/డీజెనరేటివ్ వ్యాధుల కోసం మినహాయింపులు:
నిర్వచనాలలో పేర్కొనబడిన పరిస్థితికి నిర్దిష్టమైన మినహాయింపుతో పాటుగా అదనంగా, ఈ క్రింది కారణాలలో దేని వల్లనైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పన్నమయ్యే ఏ క్లెయిమునూ మేము చెల్లించబోము:
1. ముందుగానే ఉన్న వ్యాధులు:
ముందుగానే ఉన్న వ్యాధి అనగా, ఏదైనా ఒక వైద్యస్థితి, రుగ్మత, గాయము లేదా వ్యాధి అని అర్థం:
a. అంటే బీమాదారుచే జారీ చేయబడిన పాలసీ యొక్క ప్రభావవంతమైన తేదీకి 48 నెలలలోపు వైద్యునిచే నిర్ధారణ చేయబడినది లేదా
b. పాలసీ యొక్క ప్రభావవంతమైన తేదీ లేదా దాని పునరుద్ధరణకు మునుపు 48 నెలల లోపున ఒక వైద్యునిచే వైద్య సలహా లేదా చికిత్స సిఫార్సు చేయబడినది లేదా అందుకోబడినది
పాలసీ జారీ చేయబడిన లేదా దాని పునరుద్ధరణ జరిగిన తేదీ నుండి 48 నెలలు పూర్తయిన తర్వాత, ఆయా సందర్భాన్ని బట్టి, వ్యాధి ముందుగా ఉన్నందుకు మినహాయింపు క్లాజు వర్తించదు
2. తెలిసి గానీ లేదా మానసిక స్థితి బాగా లేనప్పుడు గానీ ఉద్దేశపూర్వకంగా స్వయంగా-చేసుకున్న గాయం, ఆత్మహత్యాయత్నం.
3. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క న్యాయబద్ధమైన నిర్దేశాలు మరియు ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుని ఉంటే తప్ప, మద్యము లేదా ద్రవపదార్థాల దురుపయోగము లేదా మత్తు మందులు, మద్యము, నార్కోటిక్స్ లేదా సైకోట్రోపిక్ పదార్థాలు తీసుకోవడం.
4. యుద్ధం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్య, విరోధాలు (యుద్ధం ప్రకటించినా లేదా ప్రకటించకపోయినా), సాయుధ లేదా నిరాయుధ సంధి, పౌరయుద్ధం, ఎదురుతిరగడం, ఎదురుదాడి, విప్లవం, తిరుగుబాటు, సైనిక చర్య లేదా అధికార స్వాధీనత, పౌర కల్లోలం, సమ్మెలు.
5. శాంతి నెలకొన్న సమయంలో ఏదైనా నావికా, సైనిక లేదా వాయుసేన కార్యకలాపాలలో పాల్గొనడం.
6. బీమా చేయబడిన వ్యక్తి క్రమం తప్పని మార్గాలలో మరియు షెడ్యూల్ చేయబడిన కాలనిర్ణయ పట్టికలో గుర్తింపు పొందిన విమానయాన సంస్థకు చెందిన గౌరవనీయ, ఛార్జీలు చెల్లించే ప్రయాణికుడు, పైలట్, వాయుయాన సిబ్బందిగా తప్ప, ఏదైనా విమానయాన చర్యలో పాల్గొనడం
7. బీమా చేయబడిన వ్యక్తి ఒక నేరపూరితమైన ఉద్దేశ్యముతో నేరపూరిత చర్యలు లేదా చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొనడం.
8. వృత్తిపరమైన క్రీడ(లు) లేదా ఈతకొట్టడం/డైవింగ్ లేదా స్వారీ లేదా ఏదైనా రకమైన సాహస సవారీతో సహా అయితే వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఏవైనా ప్రమాదకర సాధనలలో పాల్గొనడం; శ్వాస ఉపకరణం ఉపయోగించి గానీ లేదా ఉపయోగించకుండా గానీ నీటి అడుగున కార్యకలాపాలు; యుద్ధ కళలు; వేటాడటం; పర్వతారోహణ; పారాచూటింగ్; బంగీ-జంపింగ్ వంటి వాటిలో పాల్గొనడం.
9. ఏదైనా బాహ్యమైన పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యం ఇందులో కవర్ చేయబడదు మరియు పుట్టుకతో బాహ్యంగా వచ్చే క్రమరాహిత్యం ఉన్న అటువంటి వ్యక్తుల కోసం పాలసీ జారీ చేయబడదు. ఇక్కడ బాహ్యంగా పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యం అంటే ఒక పరిస్థితి, ఇందులో శరీరంలోని కనిపించే మరియు అందుబాటులో ఉండే భాగాలు మరియు పుట్టినప్పటి నుండి ఉండేవి, మరియు అవి రూపం, నిర్మాణం లేదా స్థానమునకు సంబంధించి అసాధారణంగా ఉంటాయి.
10. అణు కాలుష్యం; అణు ఇంధన పదార్థాల రేడియోధార్మిక, పేలుడు లేదా ప్రమాదకర స్వభావం లేదా అణు ఇంధన పదార్థాల ద్వారా కలుషితమైన ఆస్తి లేదా అటువంటి స్వభావం నుండి ఉత్పన్నమయ్యే ప్రమాదం, కీలకమైన అనారోగ్యాలపై మినహాయింపుల గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి ముఖ్యమైన నిర్వచనాల విభాగాన్ని చూడండి.