స్వయం-ఉపాధి వ్యక్తుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఇది ఒక నిర్దిష్ట అవధి లేదా కాలవ్యవధి పాటు కవరేజీని అందించే ఒక రకమైన జీవిత బీమా అయి ఉంటుంది. కొన్ని ఇతర రకాల జీవిత వర్తింపుల మాదిరిగా కాకుండా, లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు నగదు విలువ భాగాన్ని అందించవు. అందుకు బదులుగా, పాలసీ వ్యవధిలో పాలసీదారు గనక మరణిస్తే లబ్ధిదారులకు మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు, ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతూ మరియు స్థిరమైన ఆదాయం లేని వ్యక్తులకు టర్మ్ ఇన్సూరెన్స్‌ను తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపికగా చేస్తుంది. పాలసీదారు జీవించి లేనప్పుడు కూడా, పాలసీదారుపై ఆధారపడినవారు ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూసుకోవడమే దీని ప్రాథమిక ఉద్దేశ్యం.
స్వయం-ఉపాధి వ్యక్తుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు ముఖ్యమైనదో అనేందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఇవి:
కుటుంబం కోసం ఆర్థికపరమైన రక్షణ
మీరు ఇకపై వారికి తోడుగా ఉండడానికి ఇంట్లో లేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా సుస్థిరంగా ఉండేలా టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. యజమాని అందించే జీవిత బీమా ప్రయోజనాలు లేకుండా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఇది చాలా కీలకమైనది.
సంపూర్ణ జీవిత బీమా ప్లానులుతో పోలిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ముఖ్యంగా తక్కువ ప్రీమియములను కలిగి ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారికి మరియు ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండే వారికి ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక అవుతుంది.
బిజినెస్ ఋణాల కొరకు కవరేజీ
స్వంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే వ్యక్తులకు ఋణాలు వంటి వ్యాపార సంబంధిత కర్తవ్యబాధ్యతలు ఉండవచ్చు. స్వేచ్ఛా జీవులకు వ్యక్తిగతమైన బాధ్యతలు ఉండవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు, టర్మ్ ఇన్సూరెన్స్ ఈ అప్పులను తిరిగి చెల్లించడంలో సహాయపడే కవరేజీని అందిస్తుంది, మీ కుటుంబంపై మీ ఆర్థిక బాధ్యతల భారం పడకుండా చూసుకుంటుంది.
భవిష్యత్తు గురించి తక్కువ ఆందోళనలు
మీరు అకాల మరణం చెందితే మీ ప్రియమైన వారు జాగ్రత్తగా చూసుకోబడతారని మీరు తెలుసుకోవడం మీకు అపారమైన మనశ్శాంతిని అందిస్తుంది. స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎక్కువ అనిశ్చితులను ఎదుర్కొనే వ్యక్తులకు ఇది ప్రత్యేకించి చాలా ముఖ్యం.
అనుకూలమైన కవరేజ్ ఐచ్ఛికాలు
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు వివిధ కవరేజ్ ఎంపికలను అందిస్తాయి, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు తమ నిర్దిష్ట అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవడానికి ఇవి వీలు కల్పిస్తాయి. మీ జీవనశైలి మరియు అవసరాలను బట్టి, ఒకవేళ మీరు మీ పిల్లల చదువులకు మద్దతు ఇవ్వాలనుకుంటే, లేదా వారు తమ కెరీర్ కలలను కూడా కొనసాగించడంలో సహాయపడాలనుకుంటే ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి తగిన భరోసా సొమ్మును ఎంచుకోవచ్చు.
అధిక భరోసా సొమ్ముతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం చూస్తున్నారా? మా ₹2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు మరియు మరిన్నింటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్యమైన గుణాలు ఏమిటి?
టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క గమనించుకోదగిన కొన్ని ప్రాథమిక గుణగణాలు ఇవి:
అనుకూలీకృతం చేసుకోదగిన ప్లానులు
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం అనేక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు అనుకూలీకృతం చేసుకోదగిన ఎంపికలను అందిస్తాయి, పాలసీదారులు తమ అవసరాలు మరియు ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా తమ కవరేజీని రూపొందించుకోవడానికి వీలు కల్పిస్తాయి.
తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తరచుగా తక్కువ ప్రీమియంలతో అధిక కవరేజ్ మొత్తాలను అందిస్తాయి. భారీ ఆర్థిక భారం పడకుండా గణనీయమైన రక్షణను కోరుకునే వ్యక్తులకు ఇది ఆకర్షణీయమైన ఎంపిక అవుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంలు అదనపు ఆర్థికపరమైన ఊరటను అందిస్తూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపులకు అర్హమైనవిగా ఉంటాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా క్లిష్టమైన అనారోగ్యం రైడర్లు లేదా ప్రమాదకారణ మరణ ప్రయోజన రైడర్లు వంటి వివిధ రైడర్లను అందిస్తాయి, ఇవి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కొరకు కవరేజీని పెంచుతాయి.
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానుల రకాలు ఏమిటి?
ఇండియాలో వివిధ రకాలైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. బీమా ప్రదాతలను బట్టి వాటి లభ్యత మారే అవకాశం ఉండగా, సమాచారంతో కూడిన ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లు ఈ వివిధ రకాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం అవుతుంది.
ఇది అత్యంత సర్వ సాధారణమైన టర్మ్ ఇన్సూరెన్స్ రకం, ఇందులో బీమా సొమ్ము అనేది పాలసీ వ్యవధి అంతటా స్థిరంగా నిలిచి ఉంటుంది. మీరు గనక స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే, ఈ రకమైన టర్మ్ ఇన్సూరెన్స్ అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు స్థిరమైన కవరేజీని అందిస్తుంది.
పెరుగుతున్న టర్మ్ ఇన్సూరెన్స్
ఈ ప్లానులో, సాధారణంగా ముందుగా నిర్ణయించిన రేటుతో భరోసా సొమ్ము కాలక్రమేణా పెరుగుతుంది. తమ వ్యాపారం ఎదుగుతున్న కొద్దీ ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయని ముందుగా ఊహించే స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
తగ్గుతున్న టర్మ్ ఇన్సూరెన్స్
ఈ రకమైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, తనఖా వంటి తగ్గుతున్న అప్పులు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. తగ్గుతున్న అప్పుకు అనుగుణంగా, భరోసా సొమ్ము కాలక్రమేపీ తగ్గుతూ వస్తుంది. గణనీయంగా అప్పులు ఉన్న స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక.
రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్
ఈ ప్లాన్ క్రింద, పాలసీ కాలవ్యవధిలో చెల్లించిన ప్రీమియములు పాలసీదారు పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత కూడా జీవించి ఉంటే వారికి తిరిగి ఇవ్వబడతాయి. జీవిత కవరేజ్ మరియు పొదుపు మధ్య సమతుల్యతను కోరుకునే స్వయం ఉపాధి వ్యక్తుల కొరకు ఇది మంచి ఎంపిక కావచ్చు.
స్వయం-ఉపాధి వ్యక్తుల కోసం సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకోండి
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కొరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి సరసమైన జీవిత కవరేజీని అందిస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా పరిగణించబడుతూ ఉన్నప్పటికీ, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు అనేది ఉత్తమంగా మీ ప్రియమైన వారిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక నిర్ణయం అవుతుంది.
మీకు బాగా సరిపోయే ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ ఉంది.
మీ ఆర్థిక అవసరాలను అంచనా వేసుకోండి
ఆధారపడినవారు, ఋణాలు మరియు భవిష్యత్తు ఖర్చులతో సహా మీ ఆర్థిక బాధ్యతలను బట్టి మీకు కావలసిన కవరేజ్ మొత్తాన్ని నిర్ణయించండి.
టర్మ్ ఇన్స్యూరెన్స్ క్యాలికులేటర్ ని ఉపయోగించండి
మీ ఆదాయం మరియు ఆర్థిక లక్ష్యాల ఆధారంగా తగిన కవరేజ్ మొత్తం మరియు ప్రీమియమును అంచనా వేయడానికి గాను ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్లను ఉపయోగించండి.
కవరేజ్, ప్రీమియం మరియు రైడర్లు వంటి అదనపు ప్రయోజనాల అత్యుత్తమ కలయికను అందించేదాన్ని కనుగొనడానికి వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చండి.
బీమాదారు యొక్క ప్రతిష్టను పరిశీలించుకోండి.
మీరు ఎంచుకున్న బీమా సంస్థకు మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మరియు బలమైన ఆర్థిక నిలకడ ఉన్నట్లుగా నిర్ధారించుకోండి.
మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే పాలసీ వ్యవధిని ఎంచుకోండి, ఉదాహరణకు నిర్దిష్ట ఋణాన్ని కవర్ చేయడం లేదా మీ పిల్లల చదువును నిర్ధారించుకోవడం.
స్వయం-ఉపాధి వ్యక్తుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనడానికి అవసరమైన డాక్యుమెంట్లు
జీవిత బీమాను కొనుగోలు చేసేటప్పుడు అవసరమైన పత్రాలు, ముఖ్యంగా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు, వ్యక్తి యొక్క గుర్తింపు, చిరునామా, ఆదాయం మరియు వ్యాపార స్థితిని వెరిఫై చేసుకోవడానికి చాలా అవసరం.
డాక్యుమెంట్ రకం
| ఉదాహరణలు
|
గుర్తింపు యొక్క ఋజువు
| పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్
|
చిరునామా ఋజువు
| వినియోగ బిల్లులు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్
|
ఆదాయపు ఋజువు
| ఆదాయపు పన్ను రిటర్నులు, బ్యాంక్ స్టేట్మెంట్లు
|
వ్యాపార ఋజువు
| బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, జిఎస్టి సర్టిఫికెట్
|
వయస్సు ఋజువు
| జనన సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు
|
సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీరు బ్యాంకు ఖాతా నుండి తీసుకోవాల్సిన అవసరం లేకుండా తగినంత కవరేజీని అందించాలి. మీ ప్రీమియమును ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా అంచనా వేసుకోవడానికి గాను న్యావిగేట్-చేయడానికి- సులువైన మా టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలికులేటర్ ఉపయోగించండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
₹ 1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి కనీస ఆదాయం ఎంత అవసరమై ఉంటుంది?
కనీస ఆదాయ ఆవశ్యకత అనేది బీమాదారు సంస్థను బట్టి మారుతుంటుంది. సాధారణంగా, ₹1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి కనీసం ₹6-7 లక్షల వార్షికాదాయం అవసరమవుతుంది.
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు టర్మ్ ఇన్సూరెన్స్‌తో పన్ను ప్రయోజనాలను పొందవచ్చునా?
అవును, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించే ప్రీమియంలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C క్రింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
మరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల బిజినెస్ అప్పులను టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ చేయగలుగుతుందా?
అవును, మీరు లేనప్పుడు మీ కుటుంబం ఆర్థిక బాధ్యతలతో భారం మోయకుండా చూసుకోవడానికై, బిజినెస్ అప్పులను కవర్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొరకు నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీరు ఆదాయపు ఋజువు, గుర్తింపు మరియు బిజినెస్ రిజిస్ట్రేషన్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అందించడం ద్వారా ఆన్లైన్లో గానీ లేదా బీమా ఏజెంట్ ద్వారా గానీ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఖరీదైనదిగా ఉంటుంది?
స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ఖరీదు అనేది భరోసా సొమ్ము, పాలసీ వ్యవధి, వయస్సు, ఆరోగ్యం మరియు ఎంచుకున్న ప్లాన్ రకం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.