Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

మమ్మల్ని సంప్రదించండి

మీ పాలసీ సంబంధిత ప్రశ్నలకు జవాబులు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. త్వరిత సమాధానాల కోసం చాట్ బోట్ మరియు వాట్సాప్ చాట్ వంటి మా స్వయం-సహాయ సేవా ఛానళ్ళను ఉపయోగించుకోండి. తదుపరి వివరాల కోసం మీరు కాల్ పైన లేదా ఇమెయిల్ పైన మా సర్వీస్ బృందమును చేరుకోవచ్చు.

ఒక ప్రశ్న ఉందా? మాట్లాడుకుందాం

whatsapp

వాట్సాప్ పై చాట్ చేయండి

మా నిపుణులు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉన్నారు

పై హై చెప్పండి.
whatsapp

మాకు కాల్ చేయండి:

సోమవారము నుండి శనివారము - ఉ. 9 నుండి రా. 9 వరకు.

టోల్ ఫ్రీ నంబర్

(ఐవిఆర్ భాషణం)

ఇండియా బయటి నుండి కాల్ చేసేవా
whatsapp

మాకు ఇమెయిల్ చేయండి

24x7 సహాయపడేందుకు మేము ఇక్కడ ఉన్నాము

సర్వీస్ అభ్యర్థన
క్లెయిముల కొరకు
whatsapp

పాలసీ ఆన్‌లైన్ కొనండి

Monday - Saturday, 9AM - 7PM

సహాయం కోసం మాకు పై కాల్ చేయండి
whatsapp

మాకు వ్రాయండి

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్

whatsapp

సంప్రదించు వివరాలు - ఎన్ఆర్ఐ

సోమవారము నుండి శనివారము - ఉ. 9 నుండి రా. 9 వరకు.

మాకు దీనిపై కాల్ చేయండి

మేము మీకు ఎలా సహాయపడగలము?

View All FAQ’s

ఇ-బీమా అంటే ఏమిటి?

Question
ఇ-బీమా అంటే ఏమిటి?
Answer

ఇ-బీమా అనగా మనకు తెలిసినది ఏమిటి?


ఇ-బీమా అనేది, ఒక బీమా రిపోజిటరీతో ఒక డీమ్యాట్ ఖాతా ఉన్నదానితో సరిసమానమైన బీమా. అది మీ బీమా పాలసీలు అన్నింటినీ ఒక ఎలక్ట్రానిక్ / డీమెటీరియలైజ్డ్ రూపములో ఉంచే ఒక విశ్వసనీయమైన సౌకర్యాన్ని అందిస్తుంది. మీరు అత్యంత సౌకర్యముతో బీమా పాలసీలో మార్పులు చేసుకోవడానికి మీకు వీలు కల్పించే ఒక ఏకైక వేదిక. మీరు చేయవలసిందల్లా, ఒక ఇ-బీమా ఖాతాను తెరవడం మరియు మీ బీమా పాలసీలు అన్నింటినీ ఆ ఖాతాకు ట్యాగ్ చేయడం మాత్రమే.

ఒక ఇ-బీమా ఖాతా ఉచితం, తెరవడం మరియు నిర్వహణ చేయడం సులభం, అత్యంత భద్రత కలిగినది మరియు ఆన్‌లైన్ లో లభిస్తుంది. మీరు బీమాదారులందరి యొక్క మీ జీవిత బీమా పాలసీలు అన్నింటినీ ఒకే ఒక్క ఇ-బీమా ఖాతా క్రింద నిర్వహణ చేసుకోవచ్చు. ఇది, మీరు ఆ తదుపరి మీ బీమా విభాగమును వాస్తవ సమయములో ట్రాక్ చేసుకోవడానికి మరియు నిర్వహణ చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఒక ఇ-బీమా ఖాతాతో మీరు ప్రతి కొనుగోలుకూ కేవైసీ (చిరునామా మరియు గుర్తింపు ఋజువు వంటి) నియమాలకు అతీతంగా పనులు చేసుకోవచ్చు.
 

ఒక ఇ-బీమా ఖాతా యొక్క ప్రయోజనాలు ఏవేవి?

  • భద్రత: ఒక ఇ-బీమా ఖాతాతో ఎటువంటి ముప్పు లేదా నష్టము జరగదు కాబట్టి, పాలసీలు భద్రంగా నిక్షిప్తమయ్యేట్లుగా ఎలక్ట్రానిక్ రూపము నిర్ధారిస్తుంది.
  • సౌకర్యత: ఒక ఏకైక ఇ-బీమా ఖాతా క్రింద బీమా పాలసీలు అన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపములో ఫైల్ చేసుకోవచ్చు. పాలసీ యొక్క ఒక కాపీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, బీమా రిపోజిటరీ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ లోనికి లాగిన్ కావడం ద్వారా ఏ సమయములోనైనా పాలసీలలో దేని వివరాలనైనా అందుబాటు చేసుకోవచ్చు.
  • ఏకైక సేవా కేంద్రము: విభిన్న బీమాదారుల వ్యాప్తంగా ఉన్న పాలసీలకు ఒకే ఒక్క అభ్యర్థన సరిపోతుంది. బీమా రిపోజిటరీ యొక్క సేవా పాయింట్లలో దేనియందైనా సేవా అభ్యర్థనలను సమర్పించవచ్చు. ఉదాహరణకు, బీమా రిపోజిటరీకి చేసుకోబడిన చిరునామా మార్పు యొక్క ఒకే ఒక్క అభ్యర్థన పలు బీమాదారులచే జారీ చేయబడిన పాలసీలను ఆధునీకరించగలుగుతుంది. సేవా అభ్యర్థన కొరకు విడి విడి బీమాదారుల యొక్క వివిధ కార్యాలయాల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు.
  • సమయం ఆదా చేసుకోండి హరితంగా వెళ్ళండి: ఒక కొత్త పాలసీ తీసుకున్న ప్రతిసారీ మీరు కేవైసీ వివరాలను సమర్పిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. మీ లావాదేవీలు అన్నీ కాగిత రహితం అయినందువల్ల, మీరు పర్యావరణానికి కూడా దోహదపడినవారవుతారు.
  • ఖాతా యొక్క స్టేట్‌మెంట్: కనీసం సంవత్సరానికి ఒకసారి, బీమా రిపోజిటరీ మీ పాలసీలన్నింటి వివరాలతో ఖాతా యొక్క ఒక స్టేట్‌మెంట్ పంపిస్తారు.
  • ఏకైక వీక్షణ: ఇ-బీమా ఖాతాదారు యొక్క మరణము సంభవించిన పక్షములో, ఒక అధీకృత వ్యక్తికి పాలసీలు అన్నింటి యొక్క ఏకైక వీక్షణ అందుబాటు చేయబడుతుంది.
Tags

eIA అంటే ఏమిటి మరియు ప్రయోజనాలు ఏవేవి?

Question
eIA అంటే ఏమిటి మరియు ప్రయోజనాలు ఏవేవి?
Answer

eIA అనగా పూర్తి వివరణ ‘ఇ-ఇన్స్యూరెన్స్ అకౌంట్’ లేదా  ‘ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ అకౌంట్.’ వాటాలు, బాండ్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ వంటి సెక్యూరిటీల సర్టిఫికెట్ల లాగానే, దీనిని ఎలక్ట్రానిక్ రూపములో సృష్టించి మరియు ఒక వ్యక్తి యొక్క డీమ్యాట్ ఖాతాలో భద్రపరచుకోవచ్చు, బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపములో నిల్వ చేసుకోవచ్చు మరియు వాటిని ఒకరి ఇ-బీమా ఖాతా (eIA) లో ఒక బీమా రిపోజిటరీతో ఉంచవచ్చు.

నేను ఒక eIA (ఇ-బీమా ఖాతా)ని ఎందుకు తెరవాలి?

మీ బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపములో ఏ మాత్రం అదనపు ఖర్చు లేకుండా సులువుగా, సురక్షితంగా మరియు కాగిత రహిత పద్ధతిలో భద్రపరుస్తుంది కాబట్టి మీరు ఒక eIA ఖాతాను తెరవాలి. ఒక eIA తో, ఒక బీమా పాలసీని కొనుగోలు చేసే ప్రతిసారీ మీరు కేవైసీ ప్రక్రియ గుండా వెళ్ళనవసరము లేదు. బీమా రిపోజిటరీ మీకు ఒక విశిష్ట eIA ఖాతా నంబరు ఇస్తారు, దాని క్రింద మీరు జీవిత, ఆరోగ్య, మోటారు మరియు గ్రూపు వర్తింపులతో సహా మీ బీమా పాలసీలు అన్నింటినీ భద్రపరచుకోవచ్చు.

ఒక eIA ఖాతా తెరవడానికి ఏయే రుసుములు ఉంటాయి?

ఒక eIA తెరవడం ఉచితం. బీమా రిపోజిటరీతో అనుబంధం ఉన్న ఏ ఒక్కరికీ మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒక వ్యక్తి / పాలసీదారు ఒకటికి మించి ఇ-బీమా ఖాతాను తెరవగలుగుతారా?

లేదు. ఒక వ్యక్తి / పాలసీదారు ఒక బీమా రిపోజిటరీతో కేవలం ఒకే ఒక్క eIA ఖాతా కలిగియుండవచ్చు. మీరు విభిన్న బీమా రిపోజిటరీలతో ఒకటికంటే ఎక్కువ  eIA ఖాతాను తెరవజాలరు. మీరు ఒకసారి ఒక eIA ఖాతా తెరచారంటే, మీ వివరాలు బీమా రిపోజిటరీలందరితోనూ పంచుకోబడతాయి.

ఒక eIA దరఖాస్తు ఫారము అంటే ఏమిటి?

ఒక eIA దరఖాస్తు ఫారము అనగా, మీచే అనగా పాలసీదారుచే ఒక ఇ-బీమా ఖాతా తెరవడానికి గాను బీమా రిపోజిటరీతో చేసుకునే ఒక దరఖాస్తు ఫారము. బీమా కంపెనీ లేదా ఏదైనా బీమా రిపోజిటరీతో ఈ ఫారము లభిస్తుంది.

ఒక eIA ఖాతా తెరవడానికి అవసరమైన ప్రాథమిక ఆవశ్యకతలు ఏవేవి?

ఒక eIA ఫారమును నింపి మరియు మీ ఫోటో ఐడి, పాన్ / ఆధార్ కార్డు యొక్క నకలు, మరియు చిరునామా ఋజువుతో పాటుగా బీమా కంపెనీకి లేదా బీమా రిపోజిటరీ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.

ఒక పాలసీ లేకుండానే నేను ఒక eIA ఖాతా తెరవగలుగుతానా?

ఔను, మీకు ఎటువంటి బీమా పాలసీ లేకుండానే మీరు ఒక eIA ఖాతాను తెరవవచ్చు

అవసరమైన ఔపచారిక లాంఛనాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత ఒక eIA ఖాతా తెరవడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటుంది?

మీ eIA ఖాతా 7 పనిదినముల లోపున (గరిష్టంగా) తెరవబడుతుంది మరియు మీరు రిపోజిటరీ నుండి మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు మరియు ఇమెయిల్ ఐడి పై ఒక నిర్ధారణ SMS మరియు ఇమెయిల్ అందుకుంటారు. అంతే కాకుండా eIA బ్రోచరు, లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్(ఆన్‌లైన్ లో కూర్పు చేసి ఉండకపోతే) తో కూడిన స్వాగత కిట్ మీ ఉత్తరప్రత్యుత్తర చిరునామాకు కొరియర్ ద్వారా పంపించబడుతుంది. ఈ వివరాలను ఉపయోగించి మీరు మీ ఇ-బీమా ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఒక అధీకృత ప్రతినిధి అంటే ఎవరు?

ఒక అధీకృత ప్రతినిధి అంటే ఒక eIA ఖాతా తెరచే సమయములో మీ (పాలసీదారు) చే నియమించబడిన ఒక వ్యక్తి. ఒకవేళ మీ దురదృష్టకర మరణము లేదా సామర్థ్యలోపము సంభవించిన పక్షములో, ఈ వ్యక్తి eIA ఖాతాను నిర్వహిస్తారు. అతడు మీ మరణము గురించి చెల్లుబాటయ్యే మరణ ఋజువుతో బీమా రిపోజిటరీకి తెలియజేస్తారు మరియు ఏదైనా క్లెయిము ఉన్నచో దాని పరిష్కారము తర్వాత మీ ఖాతాను స్థంభింపజేయమని ఒక అభ్యర్థన సమర్పిస్తారు.

నా ఇ-బీమా ఖాతాలో నేను ఏయే వివరాలను చూడవచ్చు?

బీమా రిపోజిటరీ మీకు ఒక విశిష్ట ఖాతా నంబరు ఇస్తారు. ఇందులో అన్ని రకాల పాలసీలు, అనగా., జీవిత, ఆరోగ్య, మోటారు మరియు గ్రూపు వర్తింపు పాలసీలు చేరి ఉంటాయి. రిపోజిటరీచే నిర్వహణ చేయబడే డేటాలో మీ క్లెయిముల చరిత్ర చేరి ఉంటుంది, మరియు లబ్దిదారులు, అసైనీలు మరియు మీరు కనబరచియున్న నామినీల పేర్లు కూడా చేరి ఉంటాయి.

ఒక పాలసీదారుకు మరియు బీమాదారుకు బీమా రిపోజిటరీ నుండి కలిగే మొత్తంమీద ప్రయోజనాలు ఏవేవి?

ఒక eIA ఖాతా తెరవడమనేది అత్యంత ప్రయోజనకరమైన చర్యలలో ఒకటి, అది సమర్థత మరియు మెరుగైన కస్టమర్ సేవ ఉండేలా చూసుకుంటుంది. ఒక సింగిల్ ఖాతా క్రింద ఉండే పాలసీలన్నింటినీ రిపోజిటరీ సంగ్రహం చేస్తారు కాబట్టి, ఒకవేళ అత్యవసర పరిస్థితి తలెత్తిన పక్షములో మీచే కొనుగోలు చేయబడిన పాలసీలు అన్నింటినీ నామినీ అందుబాటు చేసుకుంటారు. అటువంటి మౌలిక సదుపాయము అమలులో ఉండటం వల్ల, మీ అధీకరణ మరియు బీమాతనము సైతమూ బీమాదారులచే సులభంగా సరిచూసుకోబడవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మీ పాలసీలను కొనుగోలు చేసేటప్పుడు మీరు సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియలను ఆనందించవచ్చు.

Tags

ఇప్పటికే ఉన్న కస్టమరు కొరకు ప్రక్రియ పద్ధతి ఏది?

Question
ఇప్పటికే ఉన్న కస్టమరు కొరకు ప్రక్రియ పద్ధతి ఏది?
Answer

ఒకవేళ మీరు ఇదివరకే ఒక ప్రస్తుత పాలసీదారుగా ఉండి, ఒక eIA ఖాతా తెరవాలని ఆసక్తితో ఉంటే, ఈ క్రింది దశలను పాటించడం ద్వారా మీరు అలా చేయవచ్చు:

మెయిల్/కొరియర్


ఇండియాఫస్ట్ లైఫ్ సంబంధిత రిపోజిటరీతో మీ వివరాలు మరియు పత్రాలను పంచుకుంటుంది. ఆ తదుపరి, రిపోజిటరీ ఒక eIA తెరుస్తారు. మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబరుపై మీ eIA నంబరు, లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ ని మీకు పంపిస్తారు. మా రికార్డులలో దానిని అప్‌డేట్ చేసుకోవడానికి గాను రిపోజిటరీ మీ eIA నంబరును ఇండియాఫస్ట్ లైఫ్ కు కూడా పంపిస్తారు. మీ eIA జారీ చేయబడిన అనంతరం మీ పాలసీ eIA కి ఇ-జమ చేయబడుతుంది.
 

విచ్చేయండి

ఆన్‌లైన్ – రిపోజిటరీల ద్వారా

ఒక eIA ఖాతా కొరకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఈ క్రింది బీమా రిపోజిటరీల వెబ్‌సైట్లలో దేనినైనా సందర్శించవచ్చు:

  1. ఎన్.ఎస్.డి.ఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్.
  2. సిఐఆర్ఎల్ సెంట్రల్ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
  3. కార్వీ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
  4. సిఎఎంఎస్ రిపోజిటరీ & సర్వీసెస్ లిమిటెడ్.
     

ఒక EIA ఖాతా తెరవడానికై స్వీకరించదగిన చిరునామా ఋజువుల కొరకు అనుబంధము.

మీరు ఈ క్రిందివాటిలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించవచ్చు:

  • రేషన్ కార్డు
  • పాస్ పోర్ట్
  • ఆధార్ కార్డు
  • వోటరు గుర్తింపు కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • జాతీయం చేయబడిన బ్యాంక్ పాస్‌బుక్ స్టేట్‌మెంట్ (6 నెలలకు మించిన పాతది కాదు)
  • సరిచూసుకోబడిన వీటి కాపీలు:
    • విద్యుత్తు బిల్లు (6 నెలలకు మించిన పాతది కాకుండా)
    • నివాస టెలిఫోన్ బిల్లులు (6 నెలలకు మించిన పాతవి కాదు)
    • రిజిస్టర్ చేయబడిన అద్దె మరియు లైసెన్స్ ఒప్పందపత్రము
Tags

కొత్త కస్టమరు కొరకు జరిపే ప్రక్రియ ఏది?

Question
కొత్త కస్టమరు కొరకు జరిపే ప్రక్రియ ఏది?
Answer

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి ఒక బీమా పాలసీ కొరకు దరఖాస్తు చేసుకోదలచిన కొత్త కస్టమర్లు ఒక eIA (ఇ-బీమా ఖాతా) ఖాతాను తెరవడాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఈ క్రింది విధంగా ఉంటుంది:

ఆఫ్‌లైన్ (సహాయత ఇవ్వబడే అమ్మకాలు):

పాలసీ కొనుగోలు చేసే సమయములో, బీమా ప్రతిపాదన ఫారమును నింపేటప్పుడు, ఒక eIA ఖాతా తెరిచే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మీరు ఈ క్రింది రిపోజిటరీలలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది:

  1. ఎన్ఎస్‌డిఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్.
  2. సిఐఆర్ఎల్ సెంట్రల్ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
  3. కార్వీ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
  4. సిఎఎంఎస్ రిపోజిటరీ & సర్వీసెస్ లిమిటెడ్.
     

ఆన్‌లైన్

ఆన్‌లైన్ లో పాలసీ కొనుగోలు చేసే సమయములో, ఇండియాఫస్ట్ లైఫ్ వెబ్‌సైట్ పై బీమా ప్రతిపాదన ఫారమును నింపేటప్పుడు, ఒక eIA ఖాతా తెరిచే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మీరు ఈ క్రింది రిపోజిటరీలలో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.

  1. ఎన్ఎస్‌డిఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్.
  2. సిఐఆర్ఎల్ సెంట్రల్ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
  3. కార్వీ ఇన్స్యూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్.
  4. సిఎఎంఎస్ రిపోజిటరీ & సర్వీసెస్ లిమిటెడ్.

ఒక eIA తెరవడానికి, మీ పాన్ నంబరు లేదా ఆధార్ కార్డు నంబరు, చెల్లుబాటయ్యే ఒక ఇమెయిల్ ఐడి మరియు సంప్రదింపు నంబరును ఇవ్వడం తప్పనిసరి.

ఇండియాఫస్ట్ లైఫ్ సంబంధిత రిపోజిటరీతో మీ వివరాలు మరియు పత్రాలను పంచుకుంటుంది. ఆ తదుపరి, రిపోజిటరీ ఒక eIA తెరుస్తారు మరియు మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబరుపై మీ eIA నంబరు, లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ ని మీకు ఇమెయిల్ మరియు SMS ద్వారా పంపిస్తారు. మా రికార్డులలో దానిని అప్‌డేట్ చేసుకోవడానికి గాను రిపోజిటరీ మీ eIA నంబరును ఇండియాఫస్ట్ లైఫ్ కు కూడా పంపిస్తారు. మీ eIA జారీ చేయబడిన అనంతరం మీ పాలసీ eIA కి ఇ-జమ చేయబడుతుంది.

ఒకవేళ మీకు ఇదివరకే ఒక eIA ఖాతా ఉన్నట్లయితే, ప్రతిపాదన ఫారము నింపేటప్పుడు దయచేసి eIA ఖాతా నంబరు మరియు రిపోజిటరీ పేరును కనబరచండి. రిపోజిటరీ నుండి మదింపు చేయబడి నిర్ధారించబడిన తర్వాత, మీ పాలసీ eIA ఖాతాకు అనుసంధానం చేయబడుతుంది.

Tags

స్టెప్ 1: మమ్మల్ని సంప్రదించండి

Question
స్టెప్ 1: మమ్మల్ని సంప్రదించండి
Answer

ఆన్ లైన్:

  • కస్టమర్ పోర్టల్ లోనికిలాగిన్ అవండి. మీకు గనక లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ లేకుంటే, మీరు ఇక్కడఏర్పాటు చేసుకోవచ్చు.
  • క్యు.ఆర్.సి (ఆరాలు, అభ్యర్థనలు మరియు ఫిర్యాదులు) విభాగానికి వెళ్ళండి మరియు అభ్యర్థన/ఫిర్యాదు లేవనెత్తండి.
     

మాకు ఇమెయిల్ చేయండి:

జీవిత బీమా పాలసీ కొరకు:

ఇమెయిల్ ఐడి: customer.first@indiafirstlife.com
 

మాకు కాల్ చేయండి:

  • సోమవారము నుండి శనివారము వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-8700 పై కాల్ చేయండి.
  • మా ఇండియాఫస్ట్ లైఫ్ శాఖలలో దేనికైనా విచ్చేయండి. మీకు అతి సమీపములోని శాఖను ఇక్కడకనుగొనండి.

మమ్మల్ని సందర్శించండి:

మా ఇండియాఫస్ట్ లైఫ్ ఇండియాఫస్ట్ లైఫ్ శాఖలలో దేనికైనా విచ్చేసి, మీ వినతులను సమర్పించండి.

మీ నగరములోని మా విజ్ఞప్తుల అధికారులను సంప్రదించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మెయిల్/కొరియర్:

ఈ దిగువ కనబరచిన చిరునామాపై మాకు వ్రాయండి:

కస్టమర్ కేర్, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్,
12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,
నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,
గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063

మేము మీ ఫిర్యాదును అందుకున్న తర్వాత, అది అందిన 15 క్యాలెండర్ దినముల లోపున దానిని పరిష్కరిస్తూ గానీ తిరస్కరిస్తూ గానీ అందుకు కారణాలతో సహా మేము మీకు తిరిగి వ్రాస్తాము.

మీరు మా విజ్ఞప్తి పరిష్కార పాలసీని ఇక్కడచూడవచ్చు.

Tags

స్టెప్ 2: మీ విజ్ఞప్తిని ముందుకు తీసుకువెళ్ళండి

Question
స్టెప్ 2: మీ విజ్ఞప్తిని ముందుకు తీసుకువెళ్ళండి
Answer

విజ్ఞప్తి అందిన 15 (పదిహేను) రోజుల లోపున విజ్ఞప్తిని పరిష్కరించడానికి గానీ లేదా తిరస్కరించడానికి గానీ కారణాలను ఇస్తూ ఒక లిఖితపూర్వక సమాచారము మీకు పంపించబడుతుంది. మా సమాధానము మీకు అందిన తేదీ నుండి 8 వారాల లోపున గనక మీ నుండి మేము ప్రత్యుత్తరమును అందుకొనని యెడల, ఆ ఫిర్యాదు మూసివేయబడినట్లుగా మేము భావిస్తాము.

అయినప్పటికీ, మాచే ఇవ్వబడిన తీర్మానము పట్ల మీరు సంతృప్తి చెందని పక్షములో లేదా 15 (పదిహేను) రోజుల లోపున ఎటువంటి ప్రత్యుత్తరమునూ అందుకోని యెడల, మీరు మా శాఖలలో దేనియందైనా మా విజ్ఞాపన పరిష్కార అధికారిని ఆశ్రయించవచ్చు లేదా మా విజ్ఞాపన పరిష్కార అధికారికి grievance.redressal@indiafirstlife.comపై వ్రాయవచ్చు

అందుకోబడిన అట్టి విజ్ఞప్తులన్నింటికీ విజ్ఞప్తి అందిన 3 (మూడు) పనిదినముల లోపున ఒక అక్నాలెడ్జ్‌మెంట్ పంపించబడుతుంది.

ప్రత్యామ్నాయంగా, మీరు ఈ క్రింది దశలను కూడా అనుసరించవచ్చు:

మెయిల్/కొరియర్:

ఈ దిగువ కనబరచిన చిరునామాపై మాకు వ్రాయండి:

రజనీష్ కుమార్, విజ్ఞప్తి పరిష్కార అధికారి, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, 12 మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4, నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్, వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063

Email: grievance.redressal@indiafirstlife.com

దయచేసి మీ ఫిర్యాదు/సేవా అభ్యర్థన ఐడి ని కనబరచండి. మీ ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేయు స్టెప్ 1 లో ఇది మీకు ఇవ్వబడి ఉంటుంది.

Tags

స్టెప్ 3: ఐ.ఆర్.డి.ఎ.ఐ విజ్ఞాపన విభాగమును ఆశ్రయించండి

Question
స్టెప్ 3: ఐ.ఆర్.డి.ఎ.ఐ విజ్ఞాపన విభాగమును ఆశ్రయించండి
Answer

ఒకవేళ అయినా మీరు ఆ సమాధానముతో సంతృప్తి చెందకపోయినా, లేదా మానుండి మీకు 15 రోజుల లోపున ఎటువంటి సమాధానమూ అందకపోయినా, మీరు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డి.ఎ.ఐ) యొక్క విజ్ఞాపనల విభాగమును ఈ దిగువ ఇవ్వబడిన సంప్రదింపు వివరాలపై ఆశ్రయించవచ్చు:

ఐ.ఆర్.డి.ఎ.ఐ గ్రీవెన్స్ కాల్ సెంటర్ (ఐజిసిసి) టోల్ ఫ్రీ నం: 18004254732 ఇమెయిల్ ఐడి: complaints@irda.gov.in

మీరు మీ ఫిర్యాదును: http://www.igms.irda.gov.in/వద్ద ఆన్‌లైన్ రిజిస్టర్ కూడా చేయవచ్చు.

ప్రత్యామ్నాయంగా, మీరు ఈ క్రింది దశలను కూడా అనుసరించవచ్చు:

మెయిల్/కొరియర్:

ఈ దిగువ కనబరచిన చిరునామాపై మీ ఫిర్యాదులను తెలియబరుస్తూ మాకు వ్రాయండి:

వినియోగదారు వ్యవహారాల విభాగము, ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సర్వే నం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్ గూడ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500032, తెలంగాణ

ఫ్యాక్స్:

సంఖ్య: 91- 40 – 6678 9768

Tags

స్టెప్ 4: బీమా అంబుడ్స్ మన్ ను ఆశ్రయించండి

Question
స్టెప్ 4: బీమా అంబుడ్స్ మన్ ను ఆశ్రయించండి
Answer

ఒకవేళ మీరు ఆ పరిష్కారముతో అసంతృప్తితో ఉన్నా, లేదా మీ సమస్య అలాగే నిలిచి ఉన్నా, అప్పుడు మీరు నేరుగా బీమా అంబుడ్స్ మన్ ను ఆశ్రయించవచ్చు. చిరునామా కనుక్కోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ ఫిర్యాదును లిఖితపూర్వకంగా కస్టమరు/ఫిర్యాదుదారు లేదా అతని/ఆమె యొక్క చట్టబద్ధ వారసులు సంతకం చేసి ఫిర్యాదు యొక్క పూర్తి వివరాలు మరియు కస్టమరు / ఫిర్యాదుదారు యొక్క సంప్రదింపు సమాచారముతో పాటుగా ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రజా వినతుల పరిష్కారము యొక్క నియమాలు 1998 లోని నిబంధన 13(3) ప్రకారము, అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయవచ్చు

  • బీమాదారు యొక్క విజ్ఞప్తుల పరిష్కార యంత్రాంగముచే ఒకవేళ విజ్ఞప్తి తిరస్కరించబడిన పక్షములో మాత్రమే
  • బీమాదారుచే తిరస్కరించబడిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపున
  • ఒకవేళ అది ఏకకాలములో ఏదైనా వ్యాజ్యం అయి ఉండకపోతే
Tags

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail