మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?
టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఒక బీమా పాలసీ రూపంలో పొందవచ్చు. బీమా చేయబడిన వ్యక్తి ఊహించని పస్థితుల కారణంగా మరణించిన పక్షములో ఈ పాలసీ కుటుంబానికి మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. మరణ ప్రయోజనం పాలసీ కాలవ్యవధి అనబడే ఒక నిర్దిష్ట కాలానికి చెల్లుబాటు అవుతుంది. పాలసీదారు మరియు జీవిత బీమా పొందిన వ్యక్తి యొక్క జెండర్ తో సంబంధం లేకుండా, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు చాలావరకు ఒకే విధంగా పనిచేస్తాయి. రి
మహిళల కోసం టర్మ్ ప్లాన్ యొక్క ముఖ్యమైన దృష్టిసారింపు జీవిత కవరేజ్ అయి ఉంటుంది. మీరు మహిళల కోసం ఒక టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసినప్పుడు, జీవిత బీమా చేయబడిన వ్యక్తి భవిష్యత్తులో ఎదుర్కొనే అనిశ్చితులకు మీరు ఆర్థిక భద్రతను పొందుతున్నారని అర్థం. ఈ ప్లానుల రూపకల్పనను లెక్కలోనికి తీసుకుంటే, ఇతర రకాల జీవిత బీమా కవరేజీలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ధరకు లభిస్తాయి.
ఉదాహరణకు, మీరు సంబంధిత ప్రీమియం కాలిక్యులేటర్లను ఉపయోగిస్తే, ₹2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం, యులిప్ వంటి ప్లానుకు భరోసా సొమ్ము మరియు వ్యవధి కంటే కొంచెం తక్కువగా ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు.
లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు అరుదుగా అదనపు ప్రధాన ప్రయోజనాలను అందిస్తాయని మరియు రైడర్స్ వంటి ఎంపికల ద్వారా వాటిని పెంపొందించుకోవచ్చునని మనసులో ఉంచుకోవడం కూడా ముఖ్యం. వయస్సు, భరోసా సొమ్ము, కాల వ్యవధి మరియు మరిన్ని రకాల స్పెసిఫికేషన్ల ఆధారంగా ప్రీమియం అంచనాలను పొందడానికి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటరును ఉపయోగించవచ్చు. ఆ తదుపరి మీ సౌలభ్యం మరియు అందుబాటులో ఉన్న ఎంపికల ఆధారంగా మీరు ప్లాన్ కొనుగోలును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. పాలసీ పరిధిలోకి వర్తింపు చేయబడే ఏవైనా సంఘటనలు భవిష్యత్తులో జరిగితే, మీ నామినీ క్లెయిముకు ఉపక్రమించి ప్రయోజనాలను అందుకోవచ్చు.
ప్రీమియముల కోసం డబ్బు ఖర్చు చేయకుండా అధిక బీమా మొత్తం కోసం చూస్తున్నారా? ₹5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ని పొందడానికి మరియు మీ కుటుంబ భవిష్యత్తు గురించి మీ చింతలను తగ్గించుకోవడానికి, తద్వారా మీరు మీ భవిష్యత్తును నిర్మించుకోవడంపై దృష్టి సారించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?
ఎవరైనా గాని టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ని పొందడానికి ప్రధాన ప్రేరణ భవిష్యత్తులో వారి ప్రియమైనవారి ఆర్థిక భద్రతకు భరోసాగా ఉండగలదు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులతో మహిళలు జీవిత కవరేజ్ పొందడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి.
దాదాపు పెద్దవాళ్ళందరూ, మరియు ప్రత్యేకించి మహిళలు టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి గల అతి సరళమైన కారణాలలో ఒకటి, భవిష్యత్తు గురించి వారి ఆందోళనలను తగ్గించుకోవడం. మహిళల కోసం అనేక టర్మ్ ప్లానులను ప్రమాదవశాత్తు వైకల్య ప్రయోజనం మరియు వైవర్ ఆఫ్ ప్రీమియం వంటి రైడర్లతో అనుకూలీకరించుకోవచ్చు. ఇది మీరు అనిశ్చితులను ఎదుర్కొంటున్నప్పుడు మీకు భద్రతా భావనను కలిగిస్తుంది.
ఆధారపడి ఉన్నవారి కోసం ఆర్థిక భద్రత
మీకు పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా జీవిత భాగస్వామి వంటి ఆధారపడినవారు ఉంటే, సరియైన భరోసా సొమ్ముతో సరైన టర్మ్ ప్లాన్ ఎంచుకోవడం వల్ల మీరు ఇక లేని సందర్భంలో వారి భవిష్యత్తు కోసం వారికి ఆర్థిక భద్రతను కల్పించడంలో ఇది మీకు సహాయపడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ చే అందించబడే ప్రయోజనాల ద్వారా వారు మరింత స్వావలంబన పొందడానికి ఇది వీలు కలిగిస్తుంది.
అప్పు బాధ్యతల కొరకు కవరేజీ
ఒకవేళ మీకు ఏదైనా రూపంలో అప్పులు ఉంటే, మీరు మరణించిన సందర్భంలో, అది మీ సమీప బంధువుకు బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు వారికి బదిలీ చేస్తున్న ఆస్తులను ప్రభావితం చేయకుండా ఈ భారం నుండి వారిని రక్షించడానికి గాను, టర్మ్ ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడవచ్చు.
ఇండియాలో పాత వ్యవస్థలో పన్ను చెల్లింపుదారు కోసం, మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం మీరు చెల్లించే ప్రీమియములకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాకుండా, మీ నామినీ గనక ఒక ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకుంటే, వారు పన్ను ప్రయోజనాలను కూడా క్లెయిమ్ చేసుకోగలిగి ఉండవచ్చు.
దేశంలో మహిళలు ఎంచుకోగల జీవిత బీమా ప్లానులు అన్నింటి పైకీ, మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్, దాని ముక్కుసూటి పద్ధతి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న నిర్మాణం కారణంగా ఆదర్శవంతమైన ఎంపికగా ఉద్భవించింది. మీరు ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్వంటి అధిక భరోసా మొత్తం కోసం ఎదురు చూస్తున్న మహిళా ఉద్యోగి అయినా లేదా సరసమైన కవరేజ్ కోసం చూస్తున్న వారైనా సరే, టర్మ్ ఇన్సూరెన్స్ మీకు సరియైన ఎంపిక కావచ్చు.
మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏమి పరిగణన లోనికి తీసుకోవాలి?
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీ కుటుంబంపై తీవ్రమైన ప్రభావాల్ని చూపే సంభావ్యత ఉన్న ఒక గణనీయమైన నిబద్ధత. మహిళలు తమ కోసం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
ఇది అవసరం గానీ లేదా పూర్తిగా సామాన్య విషయం కానీ కాకపోయినా, మహిళల కోసం లక్ష్యంగా చేసుకోబడిన నిర్దిష్ట టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు ఉన్నాయి, వాటి నుండి మీరు ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే రెగ్యులర్ టర్మ్ ప్లానుల కోసం కూడా మీరు ఎంచుకోవచ్చు. ఏ సందర్భంలోనైనా సరే, మీ అవసరాలు మరియు అందుబాటులో ఉన్న ఎంపికలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే పాలసీని ఎంచుకోండి.
కవరేజ్ యొక్క కాలవ్యవధి అనేది ఒక ముఖ్యమైన ఎంపిక, ఎందుకంటే ఇది ప్రీమియం మొత్తాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మీరు ఎంతకాలం కవరేజ్ కలిగి ఉంటారో కూడా నిర్ణయిస్తుంది. మీకు ఏది బాగా సరిపోతుందో దాని ఆధారంగా కాలవ్యవధిని ఎంచుకోండి.
టర్మ్ ఇన్సూరెన్స్ భరోసా సొమ్ము కోసం ఒక సామాన్యమైన అంచనా ఏమిటంటే, అది మీ వార్షిక ఆదాయం మరియు మీరు వదిలివెళ్ళే ఏవైనా అప్పులకు 10 రెట్లు ఎక్కువ విలువ కలిగినదై ఉండాలి. ఉదాహరణకు, ఒకవేళ అలాంటి లెక్కింపు మీకు ₹1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ సరియైనదని నిర్ధారణకు తీసుకువస్తే, అది మీ బడ్జెట్‌కు నిజంగా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి మీరు ఆన్లైన్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
క్లెయిము సెటిల్మెంట్ రేషియో
ఈ రేషియో మీ నామినీ లేదా లబ్ధిదారులు పాలసీతో కలిగి ఉండగల అనుభవాన్ని ప్రభావితం చేసే ఒక పరిగణనగా ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది బీమాదారు సంస్థ క్లెయిమ్ ను విజయవంతంగా సెటిల్ చేసే అవకాశం ఎంత ఉందో అనే ఒక సూచికగా పరిగణించబడే విలువ అయి ఉంటుంది. అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కలిగియున్న బీమా ప్రదాతను ఎంచుకోవడం బాగుంటుందని పరిగణించబడుతుంది.
మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ రకాలు
మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్‌ను అన్వేషిస్తున్నప్పుడు, మీ నిర్దిష్ట అవసరాలు మరియు ఆర్థిక లక్ష్యాలను తీర్చగల ప్లానును కనుక్కోవడం చాలా ముఖ్యం.
మీకు బాగా సరిపోయేదాన్ని కనుగొనడానికి గాను, అందుబాటులో ఉండే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వేరియంట్లను పరిగణించండి.
లెవెల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
పాలసీ వ్యవధి సందర్భంగా మీరు మరణించినట్లయితే, ఈ ప్లానులు మీ లబ్ధిదారులకు భరోసా సొమ్మును అందిస్తాయి. ఇది కాలావధి ఆఖరులో ఎటువంటి అదనపు ప్రయోజనాలు లేకుండా అవసరమైన ఆర్థిక రక్షణను అందించే సూటి అయిన ఎంపికగా ఉంటుంది.
ప్రీమియం తిరిగి రాకతో టర్మ్ ఇన్సూరెన్స్ (TROP)
TROP తో, మీరు కవరేజ్ మాత్రమే పొందడం కాకుండా, మీరు పాలసీ వ్యవధి ముగిసేటంత వరకూ జీవించి ఉన్నట్లయితే చెల్లించిన అన్ని ప్రీమియములు మీకు తిరిగి ఇవ్వబడతాయనే భరోసాను కూడా పొందుతారు. రక్షణ మరియు పొదుపు అంశం రెండింటినీ కోరుకునే మహిళలకు ఈ ప్లాన్ చాలా బాగుంటుంది.
ఉమ్మడి టర్మ్ ఇన్సూరెన్స్ కవర్
తమ భాగస్వామితో పాటు జీవిత కవరేజీ కోరుకునే మహిళల కోసం, ఉమ్మడి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక గొప్ప ఎంపిక అవుతుంది. భాగస్వాములలో ఏ ఒక్కరి మరణము సంభవించినా, జీవించియున్న భాగస్వామి భరోసా సొమ్మును అందుకుంటారు. ఈ ప్లాన్ ఇంటిలోని వ్యక్తులు ఇద్దరికీ సమగ్రమైన కవరేజీని అందజేస్తుంది.
పెరిగిపోయే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్
ఈ ప్లాన్ మీ కవరేజ్ ప్రతి ఏటా పెరిగేలా చూసుకుంటుంది, ద్రవ్యోల్బణం మరియు వృద్ధి చెందుతున్న ఆర్థిక బాధ్యతలతో మీరు ముందడుగు వేసేలా మీకు సహాయపడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయని ఊహించే మహిళలకు ఇది ఒక తెలివైన ఎంపిక అవుతుంది.
తగ్గిపోయే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్
కాలక్రమేపీ మీ ఆర్థిక బాధ్యతలు తగ్గిపోతాయని మీరు ఆశించిన పక్షములో, ఉదాహరణకు తనఖా చెల్లించడం వంటివి, తగ్గిపోయే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ మీకు సరియైనదిగా ఉండవచ్చు. ఈ ప్లాన్ మీ తగ్గుతున్న అవసరాలకు అనుగుణంగా, ముందుగా నిర్ణయించిన రేటుకు తగ్గే హామీ ఇవ్వబడే కవరేజ్ మొత్తాన్ని అందిస్తుంది.
మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఎవరు కవర్ చేయబడాలి?
తమ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును భద్రపరచుకోవాలనుకునే మహిళలందరికీ దాదాపుగా టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. వారి కుటుంబాలకు వారి దోహదం ఎల్లప్పుడూ ఆర్థికంగానే ఉండకపోవచ్చు, అయితే వారు నిస్సందేహంగా తమ ప్రియమైనవారి జీవితాలలో కీలక పాత్రను పోషిస్తారు.
ఈరోజుల్లో జీవిత బీమా కొంటున్న మహిళల సంఖ్య ఏ విధంగా చూసినా తక్కువేమీ కాదు. 2022-23 సంవత్సరానికి IRDAI వార్షిక నివేదిక ప్రకారం, ఇండియాలోని మహిళల కోసం దాదాపు 97.38 లక్షల జీవిత బీమా పాలసీలు జారీ చేయబడ్డాయి. ఈ రంగంలోని మొత్తం అమ్మకాలలో ఈ వాటా దాదాపు 34.2% గా లెక్క అవుతుంది, ఇది దాదాపు 2.84 కోట్ల జీవిత బీమా ప్లానులుగా ఉంది. అందువల్ల, తమ జెండర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఇప్పుడు జీవిత కవరేజ్ యొక్క ప్రాముఖ్యత గురించి గొప్ప అవగాహన ఉంది.
మహిళలకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని ఎవరు పరిగణించాలో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనగగిన స్థోమత ఉందా లేదా అని ఆందోళన పడుతున్నారా? మీరు కోరుకునే కవరేజీకి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి మా ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలికులేటర్ ని చూడండి
మహిళలు మరియు పురుషుల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ మధ్య వ్యత్యాసాలు
పురుషుల కోసం కొనుగోలు చేయగలిగిన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను మహిళల కోసం కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రాథమిక స్థాయిలో, జీవిత బీమా చేయబడిన వ్యక్తి యొక్క జెండర్ ఆధారంగా పాలసీ ఫీచర్ల మధ్య పెద్దగా తేడా ఉండదు. అయినప్పటికీ, మహిళల కోసం ప్రీమియం మొత్తము వంటి పాలసీ వివరాలు మారవచ్చు. సాధారణంగా, పురుషులతో పోలిస్తే మహిళలకు ఎక్కువ ఆయుర్దాయం ఉంటుందని భావించబడుతుంది, దీనివల్ల వారికి ప్రీమియం రేట్లు తక్కువగా ఉండవచ్చు. మీరు ప్రీమియం రేట్లను పోల్చుకోవాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌తో అంచనాలను పొందడం మంచిది.
పైపెచ్చుగా, ఒకవేళ ప్రత్యేకించి రైడర్లు చేర్చబడి ఉన్నప్పుడు గర్భధారణ చిక్కుసమస్యలు వంటి మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన మరింత నిర్దిష్టమైన పరిస్థితులు పాలసీచే కవర్ చేయబడవచ్చు. ఇది పాలసీల వ్యాప్తంగా మారుతూ ఉండొచ్చు; కాబట్టి, మీ బీమా ప్రదాతతో కనుక్కోవడం మంచిది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఏ వయస్సులో మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్ కొనాలి?
మహిళలు సాధ్యమైతే 18 సంవత్సరాల వయస్సు నుండే టర్మ్ ఇన్సూరెన్స్ కొనడం ప్రారంభించవచ్చు, అయితే వారు అర్హత ప్రాతిపదికలకు అనుగుణంగా ఉండి, దానిని వారి ఆర్థిక ప్రణాళికల లోనికి చేర్చుకోగలిగితే మాత్రమే. తక్కువ ప్రీమియం రేట్లు పొందడంలో సహాయపడవచ్చు కాబట్టి జీవితంలో చాలా చిన్న వయస్సులోనే టర్మ్ ప్లానులను కొనుగోలు చేయాలని సిఫార్సు చేయబడుతుంది.
మహిళలకు ఎంతమొత్తం టర్మ్ ఇన్సూరెన్స్ కావలసి ఉంటుంది?
మీకు అవసరమైన భరోసా సొమ్ము బహుశా మీకు విశిష్టమైన పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. ఆదర్శవంతంగా భరోసా సొమ్మును లెక్కించడానికి ఒక సాధారణ పద్ధతి {(మీ వార్షిక ఆదాయం x 10) + అప్పుబాధ్యతలు}. ఈ అంచనాలను పొందడానికి మీరు హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలికులేటర్ ని ఉపయోగించవచ్చు లేదా ఆర్థిక నిపుణుడిని సంప్రదించవచ్చు.
మరి మహిళల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని రకాల క్యాన్సర్‌ను కవర్ చేస్తుందా?
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానులు ఆరోగ్య బీమా కంటే కూడా జీవిత కవరేజీ పైననే నిర్మించబడ్డాయి. క్యాన్సర్ కారణంగా జీవిత బీమా చేయబడిన వ్యక్తి మరణాన్ని ఈ ప్లానుల క్రింద కవర్ చేయవచ్చు. ఒకవేళ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ చేర్చబడి ఉంటే, రైడర్ కింద కవర్ చేయబడిన క్రిటికల్ ఇల్నెస్ జాబితాను చెక్ చేసుకోండి.
నా భార్య కోసం నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా?
మీ భార్య అనే వ్యక్తి, కుటుంబంలో సంపాదిస్తున్న సభ్యురాలు అయినా కాకపోయినా, మీ జీవితంలో, మీ కుటుంబ సభ్యుల జీవితంలో కూడా ఆమె ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మీ కుటుంబాన్ని బాగా చూసుకోవడానికి గాను, మీరు ఆమెకు జీవిత కవరేజ్ తీసుకోవడం సముచితం కావచ్చు.
మహిళలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియములపై డబ్బును ఎలా ఆదా చేసుకోగలరు?
తక్కువ ప్రీమియం ఉండేలా చూసుకోవడానికి గాను సులభమైన మార్గాలలో ఒకటి చిన్న వయసులోనే పాలసీని కొనుగోలు చేయడం. పైపెచ్చుగా, ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది మీకు తక్కువ ప్రీమియములను పొందడంలో కూడా సహాయపడగలుగుతుంది.