వెబ్‌సైట్ ట్రేడ్ మార్క్ లు మరియు కాపీరైటులు ఉపయోగించుటకు లైసెన్స్
- Answer
-
ఇతరత్రా పేర్కొనబడి ఉంటే తప్ప, మేము లేదా మా అనుమతిదారులు వెబ్‌సైట్ లో మేధోసంపత్తి హక్కులు మరియు వెబ్‌సైట్ పై గల పఠనా సామగ్రి యొక్క స్వంతదారులై ఉంటారు. ఈ వెబ్‌సైట్ యందు కలిగియున్నది ఏదీ, ఈ వెబ్‌సైట్ పై ప్రదర్శించబడిన ఏదేని ట్రేడ్‌మార్కు ఉపయోగించుటకు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఇక నుండీ "ఇండియాఫస్ట్ లైఫ్” గా పేర్కొనబడుతుంది) లేదా ఈ వెబ్‌సైట్ పై ప్రదర్శించబడిన ట్రేడ్‌మార్కుల యొక్క స్వంతదారు అయినట్టి మూడో పక్షము యొక్క లిఖిత పూర్వక అనుమతి లేనిదే విధింపుగా, ప్రతిబంధకంగా, లేదా ఇతరత్రా ఏదేని లైసెన్సు లేదా హక్కుగా మంజూరు చేయబడినట్లుగా భావించకూడదు. ఈ వెబ్‌సైట్ పై ప్రదర్శించబడిన చిత్రాల యొక్క ఏదేని అనధికారిక వాడకము కాపీరైటు చట్టాలు, ట్రేడ్‌మార్కు చట్టాలు, గోప్యతా చట్టాలు మరియు ఐ.ఆర్.డి.ఎ.ఐ వ్యాపార ప్రకటనా నిబంధనలు మరియు సమాచార వినిమయ నిబంధనలు మరియు చట్టబద్ధతలను ఉల్లంఘించవచ్చు.
ఇంకా, ఈ దిగువన గల లైసెన్సును బట్టి, వెబ్‌సైట్ లో గల మేధోసంపత్తి హక్కులు మరియు వెబ్‌సైట్ పై గల రచనాసామగ్రి హక్కులు రిజర్వు చేసుకోబడ్డాయి. "ఈ దిగువన మరియు ఈ షరతులు మరియు నిబంధనల్లో ఎక్కడైనా సరే ఏర్పరచబడిన నిర్బంధాలకు లోబడి మీరు గ్రాహ్యత ఆవశ్యకతల కొరకు మాత్రమే వీక్షించవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, మరియు మీ స్వంత వ్యక్తిగత వాడకము కొరకు మాత్రమే వెబ్‌సైటు నుండి పేజీలను ప్రింటు చేసుకోవచ్చు."
మీరు ఇలా చేయకూడదు:
- ఈ వెబ్‌సైట్ నుండి సామాగ్రిని పునఃప్రచురణ చేయుట (మరొక వెబ్‌సైట్ పై పునఃప్రచురణతో సహా);
- వెబ్‌సైట్ నుండి సామాగ్రిని అమ్ముట, అద్దెకు ఇచ్చుట లేదా సబ్-లైసెన్స్ ఇచ్చుట;
- వెబ్‌సైట్ నుండి ఏ సామాగ్రినీ బహిరంగంగా చూపుట;
- మా వెబ్‌సైట్ మీద ఉన్న సామాగ్రిని ఒక వాణిజ్యపరమైన ఆవశ్యకత కొరకు పునరుత్పత్తి, నకిలీ ప్రతి, నకలు లేదా ఇతరత్రా దోపిడీ చేయుట;
- వెబ్‌సైట్ నుండి ఏ సామాగ్రినైనా సవరించుట లేదా ఇతరత్రా ఆధునీకరించుట; లేదా
- ఈ వెబ్‌సైట్ నుండి సామాగ్రిని పునఃపంపిణీ చేయుట..