గోప్యతా విధానము
ఈ గోప్యతా విధానము, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (“IndiaFirst”) యొక్క ఈ వెబ్‌సైట్ (www.indiafirstlife.com) వాడకమును శాసిస్తుంది.
దయచేసి ఈ వినియోగపు షరతులను జాగ్రత్తగా చదవండి. ఈ వెబ్‌సైట్ మరియు దీని పేజీల (సంఘటితంగా, ఈ "వెబ్‌సైట్") ను అందుబాటు చేసుకోవడం మరియు ఉపయోగించుకోవడం ద్వారా, మీరు షరతులు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నారు మరియు వాటిని పూర్తిగా స్వీకరిస్తున్నారు. ఇండియాఫస్ట్ వాడకపు షరతులను సమయానుగతంగా మార్చవచ్చు మరియు అట్టి మార్పులు ఈ వెబ్‌సైట్ పై తెలియజేయబడతాయి. ఏవైనా అట్టి మార్పులు ముద్రించబడిన తర్వాత ఈ వెబ్‌సైట్ యొక్క వాడకమును కొనసాగించడం ద్వారా, మీరు అట్టి మార్పులను స్వీకరించినట్లుగా భావించబడుతుంది. వెబ్‌సైట్ పై వివరించబడిన ఉత్పాదనలు మరియు సేవలకు వినియోగదారులు అందరూ అర్హత కలిగి ఉండరు, మరియు ఏదేని ఉత్పాదన లేదా సేవకు మీ అర్హతను నిర్ణయించే హక్కును మేము కలిగి ఉంటాము.
మీ సమాచారమును మేము ఎలా సేకరిస్తాము మరియు అందులో ఏమి ఉంటుంది?
మా వెబ్‌సైట్ పై మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు, మా వార్తాలేఖకు చందా చేసుకున్నప్పుడు, ఒక సర్వేకి స్పందించినప్పుడు, లేదా ఒక ఫారమును నింపేటప్పుడు మీ నుండి మేము సమాచారము సేకరించుకుంటాము.
మీరు ఇంటర్నెట్ ను అందుబాటు చేసుకునే డొమైన్ లేదా ఆతిథ్య సైట్, మీరు ఉపయోగిస్తున్న కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ ప్రదాత యొక్క ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా, అనామధేయ గణాంక సంబంధిత డేటా నుండి మరియు అందుకు సంబంధించి మీ నుండి అవసరమైన వివరాలను ఏవైనా లేదా అన్నింటి సమాచారము కూడా మేము సేకరించవచ్చు.
ఒకవేళ మీరు ఇండయాకు ఆవలినుండి మా వెబ్‌సైట్ ని సందర్శిస్తున్నట్లయితే, మీ సందర్శన తప్పనిసరిగా అంతర్జాతీయ సరిహద్దుల వ్యాప్తంగా సమాచార బదిలీగా ఫలితం పొందుతుంది, మా వెబ్‌సైట్ ఉపయోగించడం ద్వారా అందుకు మీరు సమ్మతిస్తారు, మరియు సమ్మతి ఇచ్చినట్లుగా భావించబడుతుంది.
మీచే ఇవ్వబడిన సమాచారము మరియు డాక్యుమెంటేషన్ అంతయునూ నిజమైనది, కచ్చితమైనది మరియు సంపూర్ణమైనదిగా భావించబడుతుంది మరియు ఇండియాఫస్ట్ లైఫ్ అలాగే పరిగణిస్తుంది. ఒకవేళ మీరు మా వెబ్‌సైట్ ని అనామధేయంగా సందర్శించాలని అనుకుంటే, మా వెబ్‌సైట్ లోని అన్ని కార్యవిధులూ మీకు అందుబాటులో ఉండకపోవచ్చు.
మేము మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము?
మీ నుండి మేము సేకరించిన సమాచారము ఏదైనా ఈ క్రింది విధానాలలో ఏదో ఒక విధానములో ఉపయోగించబడవచ్చు:
మీ అనుభవాన్ని వ్యక్తిగతీకృతం చేసుకొనుట: మీ వ్యక్తిగత అవసరాలకు మెరుగ్గా స్పందించడానికై మీ సమాచారము మాకు సహాయపడుతుంది.
వెబ్‌సైట్ మెరుగుపరచుకొనుట: మీ నుండి అందుకున్న సమాచారము మరియు ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మేము నిరంతరమూ మా వెబ్‌సైట్ అందజేతలను మెరుగుపరచుకోవడానికి పాటుపడతాము.
కస్టమర్ సేవను మెరుగుపరచుట: మీ కస్టమర్ సేవా అభ్యర్థనలకు సమర్థవంతంగా స్పందించడానికి మరియు అవసరాలకు తోడ్పడేందుకు మరియు అవసరమైనట్లుగా మీతో అనుసంధానం అయ్యేందుకు మీ సమాచారము మాకు సహాయపడుతుంది.
లావాదేవీలను ప్రక్రియ జరుపుట: మీ సమాచారము బహిరంగమైనదైనా లేదా గోప్యమైనది అయినా, కొనుగోలు చేయబడిన ఉత్పాదన లేదా సేవా అభ్యర్థనను అందజేయుటకై గట్టిగా వ్యక్తీకరించబడిన ఆవశ్యకతకు కాకుండా మీ సమ్మతి లేనిదే ఏది ఏమైనా ఏ కారణము చేతనైనా సరే అమ్మబడదు, మార్పిడి చేయబడదు, బదిలీ చేయబడదు లేదా మరే ఇతర కంపెనీకి ఇవ్వబడదు.
ఒక పోటీ, ప్రోత్సాహచర్య, సర్వే లేదా ఇతర సైట్ అంశమును తెలియజేయడానికి.
కాలానుగుణమైన ఇమెయిల్స్ పంపించుటకు:(a) ఒక ఆర్డరును ప్రక్రియ జరపడానికై మీరు మాకు ఇచ్చిన ఇమెయిల్, దానికి సంబంధించిన సమాచారము మరియు ఆధునీకరణలను మీకు పంపించుటకు మాత్రమే ఉపయోగించబడుతుంది.
(b) ఒకవేళ మీరు మా మెయిలింగ్ జాబితాలో చేరాలని నిర్ణయించుకున్నట్లయితే, కంపెనీ వార్తలు, ఆధునీకరణలు, సంబంధిత ఉత్పాదన లేదా సేవ సమాచారము మొదలైనవి కలిగియుండే ఇమెయిల్స్ మీరు అందుకుంటారు.
ఒకవేళ మీరు భవిష్యత్తులో ఇమెయిల్స్ అందుకోవడం నుండి చందా విరమించుకోదలిస్తే, అలా చందా విరమించుకోవడానికి దయచేసి మా ఇమెయిల్స్ క్రింద కనిపించే సవివరమైన సూచనలను చదవండి.
మేము మీ సమాచారాన్ని ఎలా పరిరక్షిస్తాము?
మీరు ఒక ఆర్డరును చేసినప్పుడు లేదా మా వెబ్‌సైట్ పై మీ వ్యక్తిగత వివరాలను అందుబాటు చేసుకునేటప్పుడు, మీ వ్యక్తిగత సమాచారము యొక్క రక్షణను నిర్వహించుట కొరకు మేము రకరకాల భద్రతా చర్యలను అమలు చేస్తాము.
మేము ఒక సురక్షిత సర్వర్ యొక్క వాడకమును అందజేస్తాము.సరఫరా చేయబడిన సున్నితమైన/క్రెడిట్ సమాచారము సెక్యూర్ సాకెట్ లేయర్ (ఎస్.ఎస్.ఎల్) గుండా ప్రసారం అవుతుంది మరియు ఆ తదుపరి అట్టి సిస్టమ్ లకు ప్రత్యేక అందుబాటు హక్కులతో అధీకృతం కలిగియుండే మా చెల్లింపు మార్గ ప్రదాతల డేటాబేస్ లోనికి మాత్రమే ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది మరియు వారు ఆ సమాచారమును గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.
ఒక లావాదేవీ తర్వాత, మీ ప్రైవేటు సమాచారము (క్రెడిట్ కార్డులు, సామాజిక భద్రతా నంబర్లు, ఆర్థిక వ్యవహారాలు మొ.) మా సర్వర్లలో నిల్వ చేయబడదు.
మేము కుకీలను ఉపయోగిస్తామా?
ఔను, మేము ఉపయోగిస్తాము. కుకీలు అనేవి ఒక సైట్ లేదా దాని సేవాప్రదాత మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ కి మీ వెబ్ బ్రౌజరు ద్వారా (మీరు సమ్మతిస్తే) బదిలీ చేసే చిన్న ఫైళ్ళు, అవి సైట్లు లేదా సేవా ప్రదాతల సిస్టమ్ లు మీ బ్రౌజరును గుర్తించేందుకు మరియు కొంత నిర్దిష్ట సమాచారాన్ని గ్రహించి జ్ఞాపకం పెట్టుకునేందుకు వీలు కలిగిస్తాయి.
మీ షాపింగ్ కార్ట్ లోని వస్తువులను గుర్తుంచుకొని ప్రక్రియ జరుపుటలో సహాయపడేందుకు, భవిష్యత్ సందర్శనల కొరకు మీ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి మరియు సైట్ మరియు దాని ప్రతిచర్యల గురించిన స్వల్ప డేటాను క్రోడీకరించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము, తద్వారా మేము భవిష్యత్తులో మెరుగైన అనుభవాలు మరియు సాధనాలను అందించగలుగుతాము.
మా సైట్ సందర్శకులకు మెరుగైన అవగాహన నిమిత్తము మాకు సహాయపడేందుకై మేము మూడో పక్షపు సేవా ప్రదాతలను సంప్రదించవచ్చు. మా వ్యాపార నిర్వహణకు మరియు మెరుగుదలకు మాకు సహాయపడేందుకు తప్ప ఈ సేవా ప్రదాతలు మా తరఫున సేకరించబడిన సమాచారమును ఉపయోగించుకోవడానికి అనుమతించబడలేదు.
ఒకవేళ మీరు ప్రాధాన్యమిస్తే, ఒక కుకీ పంపించబడిన ప్రతిసారీ మీ కంప్యూటర్ హెచ్చరిక చేసే విధంగా మీరు ఎంచుకోవచ్చు, లేదా మీ బ్రౌజర్ సెట్టింగుల ద్వారా మీరు కుకీలు అన్నింటినీ ఆపు చేసేలా ఎంచుకొనవచ్చు. అనేక వెబ్‌సైట్ల లాగానే, మీరు గనక కుకీలను ఆఫ్ చేసినట్లయితే, మా సేవలలో కొన్ని సరిగ్గా పని చేయకపోవచ్చు. అయినప్పటికీ, మా వెబ్‌సైట్ మీద గల సంప్రదింపు పేజీ ద్వారా మా కస్టమర్ సేవా విభాగమును సంప్రదించి మీరు ఇంకనూ ఆర్డర్లను ఉంచవచ్చు.
మా వెబ్‌సైట్ మీద ఉంచబడిన కుకీలలో ఎటువంటి వ్యక్తిగత సమాచారమూ సేకరించబడదు లేదా నిల్వ చేయబడదు, మరియు దాని ఫలితంగా ఎవ్వరూ మూడో పక్షాలకు చొరబడజాలరు.
మేము బయటి పక్షాలకు ఏదైనా సమాచారమును వెల్లడిస్తామా?
వ్యక్తిగతంగా గుర్తించబడే మీ సమాచారమును మేము బయటి పక్షాలకు విక్రయించము, వర్తకం చేయము లేదా ఇతరత్రా బదిలీ చేయము.మా వెబ్‌సైట్ నిర్వహణలో, మా వ్యాపార నిర్వహణలో, లేదా మీకు సేవ చేయుటలో మాకు సహకరించే విశ్వసనీయమైన మూడో పక్షాలు ఈ సమాచారమును గోప్యంగా ఉంచుటకు అంగీకరించినంత కాలమూ ఆ పక్షాలు ఇందులో చేరి ఉండరు.
ఈ షరతులు మరియు నిబంధనలు మరియు గోప్యతా విధానమును అంగీకరించడం ద్వారా మీరు, మీకు మరింత మెరుగ్గా సేవ చేయడానికై, సేకరించబడిన సమాచారమును ప్రక్రియ జరపగల ఒక మూడో పక్షానికి మీ సమాచారము పంచుకొనుటకు మాకు అధికారం ఇస్తున్నారు. ఈ క్రింది విధమైనటువంటి చర్య ఆవశ్యకంగా చేయవలసి వస్తే తప్ప మేము బయటి పక్షాలకు మీ సమాచారమును వెల్లడించబోము:
- మా హక్కులు, ఆసక్తులు, ప్రతిష్ట లేదా ఆస్తిని రక్షించుకొనుట; లేదా
- వర్తించు చట్టాలతో సమ్మతి వహింపు; లేదా
- ఒకవేళ అట్టి సమాచారము ఏదైనా న్యాయపరమైన లేదా మధ్యవర్తిత్వ ప్రకటన లేదా ఉత్తర్వు క్రింద ఆవశ్యకమైతే; లేదా
- మా ఉత్పాదనలు లేదా సేవల యొక్క షరతులు మరియు నిబంధనలను లేదా మా షరతులు మరియు నిబంధనలను అమలు చేయుటకు.
మీరు వ్యక్తిగతంగా గుర్తించబడే సమాచారమును పరిరక్షించడానికి సముచితమైన మరియు సహేతుకమైన చర్యలు అన్నింటినీ మేము తీసుకుంటాము, మరియు మా వెబ్‌సైట్ గుండా మాకు ప్రసారం చేయబడిన ఏదేని సమాచారము మూడో పక్షము జోక్యం చేసుకోనంతగా సురక్షితంగా ఉండకపోవచ్చుననీ మరియు అట్టి జోక్యానికి మేము బాధ్యులు కాబోమనీ మరియు బాధ్యులు అగునట్లుగా భావించబడమనీ మీరు వ్యక్తీకరించి తెలియజేస్తున్నారు మరియు అంగీకరిస్తున్నారు.
మూడో పక్షముతో మీ సమాచారమును పంచుకోవద్దని పేర్కొంటూ మీరు ఏ సమయములోనైనా ఇమెయిల్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వ్యక్తిగతంగా గుర్తించబడని సందర్శకుల సమాచారమును మేము మా విచక్షణను బట్టి మార్కెటింగ్, వ్యాపార ప్రకటనలు, లేదా ఇతర వాడకముల కొరకు ఇతర పక్షాలతో పంచుకోవచ్చు.
అనుమతించబడిన వెల్లడి
పైన వివరించబడిన పరిస్థితులకు అదనంగా, చట్టము, కోర్టు ఉత్తర్వు, ఇతర ప్రభుత్వము లేదా చట్టమును అమలు చేయు ప్రాధికారముచే అలా చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడినచో, లేదా అట్టి వెల్లడింపు మంచి విశ్వాసముతో ఇతరత్రా అవసరమని లేదా చేయదగినదని భావించినచో, ఎటువంటి పరిమితి లేకుండా వీటితో సహా, మాయొక్క, లేదా ఎవరేని లేదా అందరు అనుబంధకులు, సహాయకులు, ఉద్యోగులు, డైరెక్టర్లు లేదా అధికారుల హక్కులు లేదా ఆస్తులు రక్షించుకొనుటకు, లేదా ఉద్దేశ్య పూర్వకంగా గానీ లేదా ఇతరత్రా గానీ మా హక్కులు లేదా ఆస్తులతో జోక్యం చేసుకోవడానికి కారణమవుతున్న ఎవరినైనా గుర్తించుటకు, సంప్రదించుటకు లేదా వారిపై చట్టపరమైన చర్య తీసుకోవడానికి సమాచారము యొక్క వెల్లడింపు అవసరమని విశ్వసించడానికి మాకు కారణం ఉన్నప్పుడు, లేదా మరెవరైనా చేసే చర్యలచే ఎవరికైనా హాని జరగవచ్చునని భావించబడినప్పుడు ఇండియాఫస్ట్ తన సభ్యుల సమాచారమును వెల్లడించవచ్చు. అదనంగా, ఒకవేళ ఇండియాఫస్ట్ లైఫ్ లేదా గణనీయంగా దానియొక్క ఆస్తులు అన్నియునూ స్వాధీనం చేసుకోబడితే, వాడుకదారుచే ఇవ్వబడిన వ్యక్తిగత సమాచారము కూడా అట్టి స్వాధీనతతో అనుసంధానమై బదిలీ చేయబడవచ్చు.