Menu
close
ఒక నిపుణుడిని అడగండి arrow
search
mic
close-search

No results for

Check that your search query has been entered correctly or try another search.

జీవిత బీమా కొనడానికి ఒక నిపుణుడిని అడగండి

మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అత్యుత్తమ బీమా ప్లానును కనుక్కోవడంలో మా జీవిత బీమా నిపుణుడు మీకు సహకరిస్తారు. ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడానికై, దయచేసి ఈ క్రింది వివరాలలో కొన్నింటిని తెలియజేయండి.

right-icon-placeholder
right-icon-placeholder
male male

మగ

male male

ఆడ

male male

ఇతరము

నమ్మకమే మా పునాది.

ముంబైలో ప్రధాన కార్యాలయం రూ. 754.37 కోట్ల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌తో ఉంది, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఇండియాఫస్ట్ లైఫ్) 2023 ఆర్థిక సంవత్సరంలో న్యూ బిజినెస్ IRP పరంగా భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లలో ఒకటి. అందుబాటు ధరలలో లభించే మా సరళమైన మరియు సులభంగా అర్థం చేసుకోగల మా ఉత్పత్తులు మా విజయానికి పునాది.

ఇండియాఫస్ట్ లైఫ్‌లో, ప్రతి భారతీయ కుటుంబానికి భీమాను సులభంగా అందుబాటులో ఉంచడానికి మేము కట్టుబడి ఉన్నాము. నవంబర్ 2009 నుండి, అందుబాటు ధరలలో లభించే సరళమైన, సులభంగా అర్థం చేసుకోగల ఉత్పత్తులను అందిస్తున్నాము. అప్పటి నుండి మేము వెనుతిరిగి చూడలేదు. ఇప్పుడు భారతదేశంలోని ప్రైవేట్, లైఫ్ ఇన్సూరెన్స్‌ కంపెనీలలో 10వ స్థానంలో ఉన్నాము. మార్చి 31, 2023 నాటికి, మా న్యూ బిజినెస్ IRP రూ. 1,709 కోట్ల వద్ద ఉంది మరియు మేము ఆర్ధిక సంవత్సరం 2022-23ని మొత్తం ప్రీమియంలో రూ. 6,075 కోట్లు మరియు AUM రూ. 21,683 కోట్లతో బలమైన స్థానంలో ముగించాము. 2023 ఆర్థిక సంవత్సరంలో మా 5 సంవత్సరాల CAGR 24.3% కొత్త వ్యాపార IRP వద్ద ఉంది, ఇది మా కస్టమర్లకు సాధ్యమైనంత ఉత్తమమైన సేవను అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం.

మా తొలి వాటాదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్ (ఇప్పుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), మరియు లీగల్ & జనరల్ మిడిల్ ఈస్ట్ లిమిటెడ్. ఫిబ్రవరి 2019లో, లీగల్ & జనరల్ తమ వాటాను కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించింది, ఇది భారతదేశ చట్టాల ప్రకారం విలీనం చేయబడిన మరియు వార్‌బర్గ్ పింకస్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏప్రిల్ 2020లో, ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడింది. మా ప్రస్తుత వాటా హోల్డింగ్ విధానం ఈ క్రింది విధంగా ఉంది:


బ్యాంక్ ఆఫ్ బరోడా - 65%
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 9%
కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 26%.

about-us-image2

అనుభవమే వ్యత్యాసము

సెప్టెంబర్ 30, 2023 నాటికి, మేము కస్టమర్ల యొక్క రక్షణ, పొదుపులు మరియు రిటైర్‌మెంట్ అవసరాలను తీర్చడానికై 30 రిటైల్ ఉత్పత్తులు, 13 గ్రూప్ ఉత్పత్తులు మరియు 6 రైడర్లను (రిటైల్ మరియు గ్రూప్ పోర్ట్‌ఫోలియోల వ్యాప్తంగా) అందజేశాము. మేము PMJJBY పథకం కింద పాలసీలను కూడా అందిస్తున్నాము, బహుళ పంపిణీ సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ, మరియు వివిధ పెట్టుబడి ఎంపికలను మెరుగుపరుస్తాము.


మేము ఈ క్రింది వర్గాల క్రింద పూర్తి ఆఫర్‌ల జాబితాను పొందుపరుస్తున్నాము: పార్టిసిపేటింగ్ ప్లాన్‌లు, నాన్-పార్టిసిపేటింగ్ సేవింగ్స్ ప్లాన్‌లు, నాన్-పార్టిసిపేటింగ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, గ్రూప్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, కార్పొరేట్ ఫండ్స్ ప్లాన్‌లు, రైడర్లు మరియు PMJJBY. ఈ ప్లాన్లు మా కస్టమర్‌లు జీవితంలోని నిశ్చయతలకు సిద్ధం కావడానికి సహాయపడే సమగ్ర ఆఫర్‌ల జాబితాను వివరిస్తాయి. మా ఉత్పత్తులు అర్థం చేసుకోవడం సులభం మరియు అభివృద్ధి చెందిన సమగ్ర రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్/పాలసీతో ఉత్తమ ధరకు లభిస్తాయి. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించడం ద్వారా, మా కస్టమర్‌లు వారి అవసరాలు మరియు బడ్జెట్‌కు బాగా సరిపోయే ప్లాన్‌ను ఎంచుకునే విధంగా మేము సహాయం అందిస్తాము.

ప్రజలే ముఖ్యం

ఎల్లప్పుడూ భవిష్యత్తుపై దృష్టి సారించే ఇండియాఫస్ట్ లైఫ్, వారి ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం నిరంతర సంరక్షణ, అభ్యాసం మరియు అభివృద్ధి అవకాశాల కోసం శ్రమిస్తుంది. మేము మా ఉద్యోగి విలువ ప్రతిపాదన ("EVP") ను ఉద్యోగి 'ఇవ్వడం' మరియు 'పొందడం' మధ్య సమతుల్యతగా నిర్దేశించాము, మా సంస్థ లో  ఉద్యోగి మనకు 'కొత్తగా ఆలోచించడం, సహాయకారిగా ఉండడం, నిజాయితీగా ఉండడం మరియు మరిన్ని కొత్త పనులు చేయడం' అనే కీలక విలువలను 'ఇస్తాడు' మరియు ప్రతిగా, ఉద్యోగికి ఆదరణ లభిస్తుంది, ఇందులో విజయాలను ఆనందించడం, ఉద్యోగం లో ఎదుగుదల, సాధించిన విజయాలను గుర్తించడం మరియు ఉద్యోగులను శక్తివంతం చేయడం వంటివి ఉంటాయి.

మేము జీవిత భీమా రంగంలో అత్యుత్తమ సేవలు మరియు  శ్రేష్ఠతను అందించగలుగుతున్నాము అంటే మా సమర్ధవంతమైన ఉద్యోగుల ప్రతిభను గుర్తించడం, వారిని ఎదుగుదల వైపు ప్రోత్సాహించడం  మరియు మద్దతు ఇవ్వడం వల్లే సాధ్యం. ఆ లక్ష్యంతో, ఇండియాఫస్ట్ లైఫ్ తన ఉద్యోగుల కోసం గణనీయమైన పెట్టుబడులు పెడుతుంది, తద్వారా వారు తమ ఉద్యోగాలను అద్భుతంగా నిర్వహించగలరు మరియు వృత్తిపరంగా ఎదగడానికి అవకాశాలను కలిగి ఉంటారు. మా నిరంతర ప్రయత్నాల ఫలితంగా, ఉద్యోగి యొక్క పని మరియు వారి దైనందిన జీవనానికి సమతుల్యతను, మా వృత్తిపరమైన విధానాన్ని గుర్తించడం చేత, గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ సర్వే, 2021లో 'భారతదేశంలో పని చేయడానికి టాప్ 100 కంపెనీలు'లో మేము స్థానం పొందాము. 2020 మరియు 2021కి 'భారతదేశంలో పని చేయడానికి ఉత్తమ కంపెనీలు BFSI' జాబితాలోలో కూడా మేము స్థానం పొందాము. జూన్ 30, 2022 నాటికి, మాకు 3,433 మంది ఫుల్ టైం ఉద్యోగులు ఉన్నారు.

సహ ఉద్యోగులందరూ తమ పూర్తి సామర్ధ్యం మేర పనిచేయడానికి  ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని సృష్టించి మరియు వారి సేవలు గుర్తిస్తూ, వారిని ఎల్లప్పుడు ప్రోత్సాహించడంలో మేము ఎప్పుడూ ముందు వుంటాం. మా ఉద్యోగులను నిత్యం కొత్త ఒరవడి వైపు అడుగులను బలోపేతం చేస్తూ, వారికి అన్ని విధాలా మద్దతు ఇవ్వడం మరియు కొత్త ప్రతిభను గుర్తించడం పై కూడా మేము సమానంగా దృష్టి పెడతాము. నియామక నాణ్యతను మెరుగుపరచడానికి ('PMaps', అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్ మరియు 'PATCH ఆప్టిమైజేషన్' మోడల్ ద్వారా) మరియు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు క్రమపద్ధతిలో అమలు చేయడానికి మేము 'HR టెక్'ను విస్తృతంగా ఉపయోగిస్తాము. ఉద్యోగుల అసంతృప్తిని గుర్తించడానికి మరియు ఉద్యోగుల నైతికత మరియు పని చేయుటకు ప్రేరణను సానుకూలంగా ప్రభావితం చేయడానికి చురుకైన చర్యలు తీసుకోవడానికి మేము మా 'AMBER' మరియు 'HR కనెక్ట్' కార్యక్రమాల ద్వారా ఉద్యోగి అభిప్రాయం వ్యక్తపరచటానికి అవకాశాన్ని అందిస్తాము.

మెరుగైన ఉత్పాదకత కోసం మరియు ఊహించదగిన వ్యాపారాన్ని నిర్మించడానికి BDMలకు సమర్థవంతమైన పర్యవేక్షక ఇన్‌పుట్ కోసం మేము AI-ఆధారిత నమూనాను అభివృద్ధి చేసాము. నిత్యం నూతన ఉత్తేజంతో సమర్థవంతమైన కార్పొరేట్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా విస్తృతమైన శిక్షణను అందిస్తూ, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాలకు మద్దతు ఇచ్చే పని వాతావరణం ద్వారా మేము మా ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలను బలోపేతం చేయడం పై దృష్టి కేంద్రికరిస్తాం . సామర్థ్యం మరియు నాయకత్వ అభివృద్ధిని నిర్ధారించడానికి మేము వర్క్‌షాప్‌లు, మార్గదర్శకత్వం, కోచింగ్, ఆన్-ది-జాబ్ శిక్షణ మరియు క్రియాత్మక మరియు క్రాస్-ఫంక్షనల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తాము.

2020, 2021, 2022 ఆర్థిక సంవత్సరం మరియు జూన్ 30, 2022తో ముగిసిన మూడు నెలలకు వరుసగా, సంబంధిత వ్యవధి ముగింపులో ఉద్యోగుల సంఖ్యతో భాగించబడినప్పుడు, మా కొత్త వ్యాపార IRP ఒక్కో ఉద్యోగికి INR 3.07 మిలియన్లు, INR 2.88 మిలియన్లు, INR 4.11 మిలియన్లు మరియు INR 0.86 మిలియన్లుగా ఉంది. దీర్ఘకాలిక ప్రతిభ నిలుపుకోవడం, చేత సమతుల్యమైన ఉత్పాదకత-కేంద్రీకృత వాతావరణాన్ని మేము ప్రోత్సహిస్తాము అందుచేత మా విజయాల పట్ల మేము గర్విస్తున్నాము.

పేర్కొనడానికి మరికొన్ని, ఇండియాఫస్ట్ లైఫ్‌ను గ్రేట్ ప్లేస్ టు వర్క్® ఇన్స్టిట్యూట్ 2021 సంవత్సరానికి భారతదేశంలోని ఉత్తమ భీమా కార్యాలయాలలో ఒకటిగా, 2021 సంవత్సరానికి భారతదేశంలోని ఉత్తమ పని ప్రదేశాలలో ఒకటిగా మరియు భారతదేశంలో మహిళలకు ఉత్తమ కార్యాలయాలలో టాప్ 100లో ఒకటిగా  గుర్తించబడినది. ఈ గుర్తింపులు ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క కేంద్రబిందువైన మా ప్రధాన సూత్రాలు - #కస్టమర్‌ఫస్ట్ మరియు #ఎంప్లాయీఫస్ట్ - ప్రకారం జీవించే మా సంస్థ మరియు ఉద్యోగుల నిబద్ధతకు నిదర్శనం. మా ఉద్యోగులు మాకు కీలక శక్తి, మా ప్రధాన బలం, మమ్మల్నివిభిన్న నిలిపే వారు, మరియు మా బ్రాండ్ అంబాసిడర్లు. మా #ఎంప్లాయీఫస్ట్ అనే మంత్రం మా #కస్టమర్‌ఫస్ట్ లక్ష్యాలను మెరుగ్గా సాధించడంలో మాకు సహాయపడింది.

about-us-image2
about-us-image2

మా సిద్ధాంతము - కస్టమర్ ఫస్ట్

సంపూర్ణంగా వాల్యూ చైన్ అంతటా మేము అగ్రగామి డిజిటలైజేషన్ చొరవ కార్యక్రమాల ద్వారా విలువను అందజేస్తాము, అది మా #కస్టమర్‌ఫస్ట్ భావజాలము నుండి పుట్టుకువస్తుంది. మా కస్టమర్లను మేము చూసుకుంటున్న సిద్ధాంతము అయిన మా "విశ్వసనీయత వృత్తము” ప్రతిపాదన, మాకు మేము ఎలా నిర్వహించుకుంటున్నాము అనేందుకు ఒక వెలుగురేఖగా పనిచేస్తుంది అని మేము నమ్ముతాము: ప్రతి ప్రవర్తన, విశ్వాసమును ఆర్జించాలనే ఒక తపనచే దిశానిర్దేశం చేయబడుతుంది.

మీకు సేవ అందించడానికి మేము ఎల్లప్పుడు సిద్దం మరియు మీకు సదా విజయం చేకూరాలని ఆశిస్తున్నాము. మరియు 

మీరు విజయవంతం కావడం చూస్తామని నిశ్చయంతో ఉన్నాము.

*గమనిక: ఈ మూల్యాంకనము (ర్యాంకింగ్) ప్రైవేటు రంగమునకు సంబంధించినది (ఎల్ఐసి మినహాయించి).

about-us-image2

ఎక్కువగా శోధించబడిన పదాలు

1800 209 8700

కస్టమర్ కేర్ నంబరు

whatsapp

8828840199

ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు కొరకు

call

+91 22 6274 9898

వాట్సాప్ పై మాతో చాట్ చేయండి

mail