శ్రీ. నరసింహన్ రాజశేఖరన్
ఇండిపెండెంట్ డైరెక్టర్
శ్రీ. రాజశేఖరన్ గారు 1985 లో గ్లోబల్ బ్యాంకర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు, 39 ఏళ్ల తన కెరీర్ వ్యాప్తిలో, గత 24 సంవత్సరాలుగా 6 దేశాలలో సిటిబ్యాంక్ తో ఉన్నారు. అతను ఇండియాలో ఇండిపెండెంట్ బోర్డు డైరెక్టరుగా ఉన్నారు మరియు సిటి లీగల్ వెహికల్స్ మరియు ఇండస్ట్రీ ఛాంబర్ల బోర్డులలో (ఛైర్మన్ గా సహా) కూడా పనిచేశారు. అతను ఫిన్‌టెక్ సలహాదారుగా ఉన్నారు మరియు పెర్కిన్స్ అంధుల పాఠశాల యొక్క ఇండియా అడ్వైజరీ మండలిలో పనిచేస్తున్నారు. అతను ఇండియా, చైనా, థాయ్‌లాండ్, కొరియా, జపాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక వ్యాప్తంగా కంట్రీ ఫ్రాంచైజీ మరియు వినియోగదారు వ్యాపారాలకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వృద్ధి, డిజిటల్ పరివర్తన, వ్యయ సామర్థ్య మెరుగుదలలు మరియు తీవ్రమైన క్రెడిట్ ఒత్తిడులను ఎదుర్కొంటున్న విభాగాల ఫలితాల రాక కోసం వ్యూహాలను అనువు చేసుకుంటూ మరియు అమలు చేసుకుంటూ ఉన్నారు. అతను, తాను నాయకత్వం వహించిన కొన్ని వ్యాపారాల పునఃస్థాపనలో భాగంగా పోర్ట్‌ఫోలియోల విలీనం మరియు పెట్టుబడుల ఉపసంహరణ రెండింటినీ అమలు చేశారు. అతను వ్యూహాత్మక, ప్రతిష్ట, బ్యాలెన్స్ షీట్, మార్కెట్, క్రెడిట్, కార్య నిర్వహణ మరియు సమ్మతి వహింపు రిస్క్ వెక్టర్లను కవర్ చేస్తూ క్రియాత్మక, చురుకైన మరియు స్థితిస్థాపకతా వ్యాపారం మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం పాలనను అమలు చేశారు. అతను ట్రేడ్, ట్రెజరీ యాజమాన్యం, వినియోగదారు క్లయింట్ ముఖాముఖీలు మరియు భాగస్వామి ప్రాప్యత విలువ ప్రతిపాదనలలో వినియోగదారు మరియు సంస్థాగత క్లయింట్ల కోసం మార్గదర్శక డిజిటల్ పరిష్కారాలతో సహా క్లయింట్ శ్రేష్టత మరియు డిజిటల్ పరివర్తనను అమలు చేశారు. అతను అధిక పనితీరు, సమవర్తనం, జట్టుకృషి మరియు నైతిక సంస్కృతి కోసం 3,000 మంది వ్యక్తులతో కూడిన బృందాలకు నాయకత్వం వహించారు, ఆ నాయకత్వ పటిమ సాంస్కృతిక మరియు భాషాపరమైన అవరోధాలను అధిగమించి, అధిక- పనితీరు మరియు అత్యంత సంతృప్తి చెందిన బృందాలను నిర్మించింది. అతను క్లయింట్లు, రెగ్యులేటర్లు, ప్రభుత్వం, కమ్యూనిటీ మరియు ఇతర హక్కుదారులతో సులభతరమైన వ్యాపారం మరియు FDI కోసం న్యాయసలహా వాదనతో ధృఢమైన సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నాడు. అతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి MBA మరియు ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి B.E.(మెకానికల్) డిగ్రీ పొంది ఉన్నారు. అతను ఐఐసిఏ (కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో) నుండి ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేషన్ సంపాదించుకున్నారు.