నమన్ గుప్తా
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ - బ్రాంచ్ ఆపరేషన్స్, పర్సిస్టెన్సీ (స్థిరత్వం) మరియు ఆర్థిక వ్యవహారాలు
ఇండియాఫస్ట్ లైఫ్ యందు నమన్ గుప్తా గారు - బ్రాంచ్ ఆపరేషన్స్, పర్సిస్టెన్సీ (స్థిరత్వం) మరియు ఆర్థిక వ్యవహారాల అధిపతిగా ఉన్నారు. అతని కర్తవ్య విధులు కస్టమర్ కొనసాగింపును నిర్ధారించడం, బ్రాంచ్ కార్యకలాపాలను నిర్వహించడం మరియు కస్టమర్లకు వారి పాలసీ కాలవ్యవధి అంతటా సకాలంలో చెల్లింపులను నిర్ధారించడం చుట్టూ ఉంటాయి. అతను కార్య వ్యవహారాల ప్రక్రియల యొక్క ఘనమైన మరియు బలమైన నియంత్రణ కోసం కార్యాచరణ రిస్క్ మరియు నాణ్యమైన బృందాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా, కంపెనీ ఆపరేషన్లు మరియు సేవా విభాగాలను నెలకొల్పడంలో మరియు విధులను పేర్కొనడంలో అతను ఒక గణనీయమైన పాత్రను పోషించారు. కస్టమర్ ఆనందాన్ని అందించడం పట్ల మక్కువ కలిగిన, నమన్ గారు మా #CustomerFirst సిద్ధాంతానికి ప్రతిపాదకులలో ఒకరు.
ఇండియాఫస్ట్ లైఫ్ లో నమన్ గారు ఒక బిజినెస్ ఎనలిస్టుగా తన ప్రయాణం ప్రారంభించారు, మరి ఆ తర్వాత న్యూ బిజినెస్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంటుకు అధిపతిగా వెళ్ళారు. అతని ప్రస్తుత హోదాకు మునుపు, అతను కస్టమర్ సర్వీస్ మరియు ఛానల్ సేవలకు అధిపతిగా ఉన్నారు.
అతని శ్రేష్టత యొక్క విస్తృతిలో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా, మరియు రిలయన్స్ రిటెయిల్ లిమిటెడ్ లో పూర్వానుభవాలు చేరి ఉన్నాయి. అక్కడ, అతను అనేక శాఖలను ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్రను పోషించడం మాత్రమే కాకుండా, బ్రాంచ్ ఆపరేషన్లను శ్రద్ధగా నిర్వహించారు.
నమన్ గారు కామర్స్ పట్టభద్రులు మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, హైదరాబాద్ నుండి ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ లో ప్రత్యేక నైపుణ్యతతో మేనేజ్‌మెంట్ స్టడీస్ లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాను పొంది ఉన్నారు.