శ్రీ. దేబదత్తా చంద్
శ్రీ దేబదత్తా చంద్ గారు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించబడ్డారు మరియు 2023, జూలై 1న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. శ్రీ చంద్ గారికి బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల రంగములో 29 సంవత్సరాల అనుభవం ఉంది.
మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా తన నియామకానికి ముందు, శ్రీ. చంద్ గారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు, అక్కడ అతను కార్పొరేట్ మరియు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, కార్పొరేట్ మరియు ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్, ట్రెజరీ మరియు గ్లోబల్ మార్కెట్స్, మిడ్-కార్పొరేట్ బిజినెస్ ఇంకా ట్రేడ్ మరియు ఫారిన్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలను పర్యవేక్షించారు. అదనంగా, అతను బ్యాంక్ యందు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ బిజినెస్, డొమెస్టిక్ సబ్సిడరీస్/జాయింట్ వెంచర్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ మార్కెట్స్, ఎన్ఆర్ఐ బిజినెస్ అదేవిధంగా హెచ్ఆర్ఎమ్, ఫైనాన్స్ మరియు ప్లానింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఆడిట్ మరియు తనిఖీ, క్రెడిట్ మానిటరింగ్, సేకరణలు, లీగల్, కాంప్లియెన్స్, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, సమాచార భద్రత మరియు ఎస్టేట్ మేనేజ్‌మెంట్ మరియు సెక్యూరిటీ వంటి కీలక ప్లాట్‌ఫారమ్ విధులను కూడా విజయవంతంగా అజమాయిషీ చేశారు.
శ్రీ చంద్ గారు అలహాబాద్ బ్యాంక్ లో ఆఫీసర్‌గా 1994 లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు మరి ఆ తర్వాత 1998 నుండి 2005 వరకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేశారు. 2005 లో, అతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో చీఫ్ మేనేజర్‌గా చేరాడు మరియు క్రమంగా చీఫ్ జనరల్ మేనేజర్ స్థానానికి చేరుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అతని 15 ఏళ్ల ఉద్యోగ వ్యవధిలో, అతను పాట్నా లోని జోనల్ ఆడిట్ ఆఫీస్ హెడ్, బరేలీ రీజియన్ సర్కిల్ హెడ్, ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆపరేషన్స్ హెడ్ మరియు ముంబై జోన్ హెడ్ తో సహా పలు విధులను నిర్వర్తించారు.
శ్రీ. చంద్ గారు ప్రస్తుతం బిఓబి క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, ఇండియా ఇన్‌ఫ్రాడెట్ లిమిటెడ్, బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా (టాంజానియా) లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా (ఉగాండా) లిమిటెడ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా (కెన్యా) లిమిటెడ్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. మునుపు, అతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క నామినీ డైరెక్టర్ గా పిఎన్‌బి ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ మరియు స్విఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులలో పనిచేశారు.
అతను బి.టెక్ డిగ్రీ, ఎంబిఏ మరియు CAIIB విద్యార్హతలను పొంది ఉన్నారు. అదనంగా చంద్ గారు ఈక్విటీ రీసర్చ్ యందు పిజి డిప్లొమా పొంది ఉన్నారు మరియు ధృవీకృత పోర్ట్‌ఫోలియో మేనేజరుగా ఉన్నారు.