రుషభ్ గాంధీ
డిప్యూటీ సీఈఓ
ఇండియాఫస్ట్ లైఫ్ డిప్యూటీ సి.ఇ.ఓ అయిన శ్రీ రుషబ్ గాంధీ గారు సంస్థను ఎదుగుదల వైపుకు కీలకంగా నడుపుతున్న శక్తులలో ఒకరు మరియు సంస్థ యొక్క ఒక అంతర్భాగముగా ఉన్నారు. జాతీయ మరియు అంతర్జాతీయ విపణుల వ్యాప్తంగా 25 సంవత్సరాల అనుభవంతో ఒక అసాధారణమైన ఆర్థిక సేవల నాయకుడు అయిన రుషబ్ గారు సాంప్రదాయకతను ప్రశ్నించుటలో ఆనందిస్తారు మరియు సవాళ్ళను అవకాశాల దృష్టితో చూస్తుంటారు. అతడు సి.ఎస్.సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (భారత ప్రభుత్వముచే ప్రోత్సహించబడినది) యొక్క బోర్డులో ఒక డైరెక్టరుగా కూడా ఉన్నారు.
చురుకుగా అడుగులు వేసే వ్యూహకర్త, దారశనికత గల నాయకుడు, మరియు అమ్మకాల వినూత్నయోచనాపరుడు అయిన రుషబ్ గారు అత్యుత్తమ-శ్రేణి బ్యాంకష్యూరెన్స్ వ్యాపారాన్ని అమలు చేశారు మరియు మల్టీఛానల్ పంపిణీ వ్యూహాన్ని విజయవంతంగా అనుసరించారు. ప్రైవేటు బీమా సంస్థలలో రిటైల్ వ్యాపారంలో ఇండియాఫస్ట్ లైఫ్ ర్యాంక్ 11వ స్థానానికి ఎగబ్రాకడానికి అతని పదునైన వ్యాపార చతురత గణనీయంగా దోహదపడింది. విక్రయాలు మరియు పంపిణీకి అదనంగా, రుషభ్ గారు మార్కెటింగ్, ఉత్పాదనలు, కస్టమర్ అనుభవం, వ్యూహము, బిజినెస్ అభివృద్ధి మరియు మానవ పెట్టుబడి అంశాలను అజమాయిషీ చేస్తున్నారు.
రుషబ్ గారు దార్శనికతా నాయకత్వం కొరకు నవభారత్ ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ 2022, ఎలెట్స్ BFSI గేమ్‌ఛేంజర్ అవార్డ్ 2022, బిజినెస్ నాయకత్వం కొరకు సిల్వర్ ఫెదర్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ 2022, సిల్వర్ ఫెదర్ ఇన్నోవేటివ్ లీడర్ అవార్డ్ 2021, మరియు ది ఇండియన్ అఛీవర్స్ అవార్డ్ 21-22 లతో సత్కరించబడ్డారు. అతని ఆధ్వర్యంలో ఇండియాఫస్ట్ లైఫ్ కంపెనీ, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ® ఇన్‌స్టిట్యూట్ (2019, 2020, 2021, 2022), ది ఎకనామిక్ టైమ్స్ బెస్ట్ బ్రాండ్స్ (2018, 2021, 2022) వారిచే "BFSIలో భారతదేశపు అత్యుత్తమ పనిప్రదేశాలు" వంటి ప్రముఖ పరిశ్రమ ప్రశంసలను గెలుచుకుంది, మరియు ఇండియా బీమా సదస్సు మరియు ఇతరత్రా అవార్డులు 2022లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును గెలుచుకొంది.
రుషభ్ గారు తన మునుపటి రోజుల్లో కెనరా హెచ్.ఎస్.బి.సి ఒబిసి లైఫ్ ఇన్స్యూరెన్స్, అవీవా లైఫ్ ఇన్స్యూరెన్స్ మరియు బిర్లా సన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ లలో పని చేశారు. పట్టుదల మరియు ప్రక్రియలచే నడిపించబడిన ప్రజల వ్యక్తిగా, అతడు ఇండొనేషియాలో అవీవా రిటెయిల్ జీవిత బీమా వ్యాపారాన్ని ఏర్పాటు చేయడంలో ఒక కీలకమైన భూమికను పోషించారు.
ఇన్‌సీడ్, ఫోంటెయిన్‌బ్లూ యందు ప్రత్యేకంగా ప్రపంచ దిగ్గజాల కొరకు నిర్వహించబడిన గ్రూప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామును రుషభ్ గారు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అతడు నర్సీ మోంజీ యాజమాన్య అధ్యయన సంస్థ (ఎన్.ఎం.ఐ.ఎం.ఎస్) నుండి యాజమాన్య అధ్యయనములో పోస్ట్-గ్రాడ్యుయేట్ పట్టా కూడా పొంది ఉన్నారు.