1996లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన కెరీర్ ని ప్రారంభించిన శ్రీ లలిత్ త్యాగీ గారు, వివిధ వాణిజ్య బ్యాంకింగ్ యొక్క విభాగాలలో, ప్రత్యేకించి కార్పొరేట్ ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విధులలో 28 సంవత్సరాలకు పైగా ఘనమైన అనుభవం కలిగి ఉన్నారు. అతను ఇండియా మరియు విదేశాలలో అనగా బ్రస్సెల్స్, బెల్జియం మరియు న్యూయార్క్- యుఎస్ఏ లలో వివిధ శాఖలు/ కార్యాలయాల్లో పనిచేసిన విస్తారమైన అనుభవాన్ని కలిగి ఉన్న ఒక ఆపరేషనల్ బ్యాంకర్‌గా ఉన్నారు, ఇందులో బ్యాంక్ యొక్క విదేశీ కార్యకలాపాలలో రెండు స్టింట్లు ఉన్నాయి.
అతను బెంగళూరు రీజియన్ రీజినల్ హెడ్, ముంబైలోని బ్యాంక్ యొక్క అతిపెద్ద కార్పొరేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ మరియు బ్రాంచ్ హెడ్, మరియు బ్యాంక్ యొక్క అతి పెద్ద ఓవర్సీస్ ప్రాదేశిక యుఎస్ ఆపరేషన్స్, న్యూయార్క్ యందు చీఫ్ జనరల్ మేనేజర్(చీఫ్ ఎగ్జిక్యూటివ్) వంటి ప్రముఖ బ్యాంక్ యొక్క ముఖ్యమైన యూనిట్లలో విజయవంతమైన అనుభవం కలిగి ఉన్నారు.
2022 నవంబర్ 21 న బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా అతని నియామకానికి మునుపు, అతను బ్యాంక్ యొక్క యుఎస్ ఆపరేషన్స్, న్యూయార్క్ యందు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. అతను గతంలో కెన్‌బ్యాంక్ కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ (CCSL - కెనరా బ్యాంక్ యొక్క సంపూర్ణ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) డైరెక్టర్‌గా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా (గయానా) Inc. యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం అతను బిఓబి క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, ఇండియా ఇన్‌ఫ్రాడెట్ లిమిటెడ్, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇండో జాంబియా బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా (ఉగాండా) లిమిటెడ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా (యుకె) లిమిటెడ్‌లో నామినీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, అతను ప్రస్తుతం కార్పొరేట్ మరియు సంస్థాగత బ్యాంకింగ్, ట్రెజరీ మరియు గ్లోబల్ మార్కెట్‌లు, మిడ్-కార్పోరేట్ బిజినెస్, అంతర్జాతీయ బ్యాంకింగ్, దేశీయ అనుబంధ శాకలు/ ఉమ్మడి వెంచర్‌లను చూస్తున్నారు.
గత కాలంలో, అతను కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఆడిట్ మరియు తనిఖీ, క్రెడిట్ మానిటరింగ్, కలెక్షన్స్, లీగల్ మరియు హెచ్ఆర్ఎం వంటి కీలక ప్లాట్‌ఫారమ్ విధులను కూడా అజమాయిషీ చేశారు.
శ్రీ త్యాగీ గారు అతని నాయకత్వం మరియు ప్రేరణాత్మక నైపుణ్యాలకు అత్యంత సుపరిచితులు.
అతను పుణె యందలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (NIBM) నుండి బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGDBF) పొందారు మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ యొక్క సర్టిఫైడ్ అసోసియేట్ గా కూడా ఉన్నారు. అతను భవిష్యత్ నాయకత్వ విధుల కోసం బ్యాంక్ యొక్క బోర్డ్ బ్యూరో (ప్రస్తుతం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో అని పిలువబడుతోంది) ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకర్లలో ఒకరిగా గుర్తించబడ్డారు.